
చండీగఢ్ : గురుగ్రాంలో 13 మంది పోలీసులకు మంగళవారం కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయింది. గత వారం ఇద్దరు పోలీసులకు కరోనా వైరస్ సోకిన క్రమంలో తాజాగా 13 మంది పోలీసులు మహమ్మారి బారిన పడటంతో కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు కరోనా పాజిటివ్‌గా తేలిప వారిలో ఎక్కువమందికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1.45 లక్షలు దాటగా, 60,000 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా, కరోనా మరణాల రేటు 2.87 శాతానికి దిగిరావడం సానుకూల పరిణామమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment