డేరా బాబాకు మరోసారి పెరోల్‌ | Molestation Convict Ram Rahim To Leave Jail Again 9th Parole | Sakshi
Sakshi News home page

డేరా బాబాకు మరోసారి పెరోల్‌

Published Fri, Jan 19 2024 2:56 PM | Last Updated on Fri, Jan 19 2024 2:58 PM

Molestation Convict Ram Rahim To Leave Jail Again 9th Parole - Sakshi

న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌదా చీఫ్‌  గుర్మిత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు మరోసారి పెరోల్‌ మంజూరు అయింది. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో దోషి అయిన గుర్మిత్ శుక్రవారం మరోసారి మంజూరైన పెరోల్‌పై 50 రోజుల పాటు జైలు నుంచి విడుదల కానున్నారు.

అయన ఇప్పటికే పలుమార్లు పెరోల్‌పై విడుదలైన విషయం తెలిసిదే. అయితే తాజాగా మంజూరైన పెరోల్‌తో ఆయన ఇప్పటివరకు గడిచిన రెండేళ్లలో ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో  తొమ్మిదోసారి జైలు నుంచి పెరోల్‌పై బయటకు కావటం గమనార్హం.

తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్పై వెళ్తూ రావడం చేస్తున్నారు.

చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement