డేరా బాబా ‘విల్లా’సం
డేరా బాబా ‘విల్లా’సం
Published Thu, Sep 7 2017 4:49 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM
సాక్షి, సిర్సా : డేరా బాబా బాగోతాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హరియాణాలోని సిర్సాలో 700 ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి తొంగిచూసిన మీడియా బృందాలకు విస్తుగొలిపే దృశ్యాలు ఎదురవుతున్నాయి. గుర్మీత్ అత్యంత విలాసవంత జీవితం గడిపాడని అక్కడి కళ్లుచెదిరే భవంతులు, రాజప్రాసాదాలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. డేరా బాబా కలర్‌ఫుల్ లైఫ్ ఆ ప్రాంగణంలో అడుగడుగునా కనిపిస్తోంది. ఇప్పటికే ఈఫిల్ టవర్, తాజ్‌మహల్, డిస్నీలాండ్ నమూనాలను ప్రాంగణంలో కనుగొంటే తాజాగా స్పోర్ట్స్ విలేజ్, డేరా బాబా సినిమాలు ప్రదర్శించే మహి సినిమా థియేటర్ మీడియా కంటపడ్డాయి.
ఈ థియేటర్‌లో ప్రస్తుతం గుర్మీత్ నటించిన జట్టు ఇంజనీర్ ప్రదర్శితమవుతోంది. ఎంఎస్‌జీ ఫుడ్ పార్టీ పేరుతో రెస్టారెంట్, సెవెన్ స్టార్ స్పా, మహిళల కోసం జిమ్, స్విమ్మింగ్ పూల్‌లు డేరా బాబా లగ్జరీ లైఫ్‌కు అద్దం పడుతున్నాయి. మహిళలు, యువతులతో గడిపేందుకు గుర్మీత్ ఏకాంత మందిరం ఎక్కడ ఉందో ఆరా తీస్తున్న మీడియా బృందానికి మరో కట్టడం తారసపడింది. స్విమ్మింగ్ పూల్ పక్కనే అయ్యగారి నిర్వాకాలకు పరాకాష్ట వంటి అద్భుత కట్టడం కనిపించింది.
విదేశీ అనుచరుల కోసం డేరా బాబా ఏకంగా ఇక్కడ అండర్ వాటర్ విల్లా నిర్మిస్తున్నారు. అద్భుత ఇంజనీరింగ్ ప్రమాణాలతో నీటిలోపల భారీ రిసార్ట్‌ను నిర్మించేందుకు బాబా చేసిన ప్లాన్ ఆయన అరెస్ట్‌తో అటకెక్కింది. పోలీసులు ఇంకా డేరా బాబా ప్రాంగణంలో పూర్తిస్ధాయి సోదాలు చేపట్టలేదు. డేరా ప్రాంగణంలో త్వరలోనే పోలీసులు తనిఖీలు చేపడుతున్న క్రమంలో మరిన్ని అంశాలు వెలుగులోకి రానున్నాయి.
Advertisement
Advertisement