డేరాలో ఆయుధాల ఫ్యాక్టరీ
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిర్వహిస్తున్న డేరాలో ఆశ్రమానికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. శుక్రవారం నుంచి హర్యానాలోని సిర్సా ఆశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజా శనివారం జరిపిన సోదాల్లో ఆయుధాల తయారీ కర్మాగారం బయటపడింది. దీనిని చూసి ఆర్మీ, సోదాలు చేస్తున్న అధికారులు నెవ్వెరపోయారు. ఆయుధ తయారీ ఫ్యాక్టరీపై హర్యానా ఉన్నతాధికారి సతీష్ మెహ్రా స్పందిస్తూ.. ఆ ఫ్యాక్టరీని తక్షణం అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అంతేకాక పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో డేరా ఆవాస్ నుంచి మహిళా సన్యాసినులు నివాసముండే ప్రాంతానికవెళ్లే రహస్య రహదారిని గుర్తించినట్లు ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే శుక్రవారం జరిపిన సోదాల్లో అస్తిపంజరాలు వెలుచూసిన విషయం తెలిసిందే. అంతేకాక నంబర్ ప్లేట్ లేని కోటిరూపాయల ఖరీదైన ఓ లగ్జరీ కారు, ఓబీ వ్యాను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.