దుబ్బాకలో స్వామీజీ నిర్వహిస్తున్న ఆశ్రమం
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో మరో డేరాబాబా (స్వామీజీ), ఆయన అనుచరుడి రాసలీలల భాగోతం బట్టభయలు కావడం తీవ్ర చర్చానీయాంశగా మారింది. తనకు జరిగిన అన్యాయంపై ఓ వివాహిత దుబ్బాక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడంతో స్వామీజీతో పాటు ఆయన అనుచరుడి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక సీఐ హరికృష్ణ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇవి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌కు చెందిన ఓ మహిళ సంతోషిమాతా భక్తురాలు.. ఆమెకు సంతోషిమాతా గుడి కట్టాలన్న సంకల్పం చాలా రోజులుగా ఉంది. అయితే చీకోడ్ సమీపంలోనే కొన్నేండ్లుగా రఘు అనే వ్యక్తి ఓ స్వామీజీగా అవతారమెత్తి స్వామి సమర్థ మహరాజ్ ఈనే పేరుతో ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. చాలా మహిమ గల స్వామీజీగా పేరొందడంతో ప్రతిరోజు చాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో చీకోడ్‌కు చెందిన భాదిత మహిళ సైతం స్వామీజీకి భక్తురాలిగా మారింది.
మహిళ తన మదిలో ఉన్న సంకల్పం(సంతోషీమాతా గుడి కట్టాలన్నది) స్వామీజీకి చెప్పింది. దీంతో భక్తురాలి అమాయకత్వాన్ని పసిగట్టిన స్వామీజీ రాత్రి వేళలో బాధిత మహిళకు తన అనుచరుడు నరేష్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి నేను స్వామీజీని మాట్లాడుతున్నా నీ సంకల్పం నేరవేరాలంటే నా అనుచరుడు నరేష్ రూపంలో మీ ఇంటికి వస్తాను ఆయన రూపంలో ఉన్న నన్ను సంతృప్తి పరిస్తే నీ ఆలయ సంకల్పం నేరవేరుతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటూ ఒట్టు వేయించుకొన్నాడు. ఇది నమ్మిన ఆ అమాయక మహిళపై స్వామీజీ అనుచరుడు నరేష్‌గత కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. చాలా రోజులు అవుతున్నా ఆమె సంకల్పం నేరవేరకపోవడంతో తనను మోసం చేశారని తెలుసుకున్న మహిళ తమకు ఫిర్యాదు చేసిందని సీఐ హరికృష్ణ తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు స్వామీజీతో పాటు ఆయన అనుచరుడు నరేష్‌పై అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర చర్చానీయాంశగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment