follower
-
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు అరెస్ట్
సాక్షి,అనంతపురం: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అనుచరుడు మహానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహానందరెడ్డిపై ఎలాంటి కేసులు లేకున్నా అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిడితో మహానందరెడ్డిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మహానందరెడ్డి అరెస్ట్‌ను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించారు. మహానందరెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది. మహానందరెడ్డిని చంపడానికి టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. అందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. -
అమ్మాయిల వీడియోలు తీసి.. మంత్రి అనుచరుడి దుర్మార్గాలు
-
పోలీస్ స్టేషన్ లో టీడీపీ రౌడీల వీరంగం..
-
ఎక్స్‌లో 10 కోట్ల ఫాలోవర్లు.. మోదీకి మస్క్ అభినందనలు
ఎక్స్ ప్లాట్ఫామ్లో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఇలాన్‌మస్క్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్‌గా మారంది.‘అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు’ అని మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు. మోదీకి ఎక్స్‌లో 100.1 మిలియన్ల(10 కోట్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనే మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆ సందర్భంగా ప్రధాని..‘ఎక్స్‌లో వంద మిలియన్లు! ఈ శక్తివంతమైన మాధ్యమంలో చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను ఆదరించినందుకు సంతోషంగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Congratulations PM @NarendraModi on being the most followed world leader!— Elon Musk (@elonmusk) July 19, 2024ఇదీ చదవండి: విండోస్‌లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓప్రపంచంలోనే ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తులుఇలాన్మస్క్ 189 మిలియన్లుబరాక్ ఒబామా 131 మిలియన్లుక్రిస్టియానొ రొనాల్డో 112 మిలియన్లు జస్టిన్ బీబర్ 110 మిలియన్లురిహన్నా 108 మిలియన్లుకాటిపెర్రీ 106 మిలియన్లునరేంద్రమోదీ 100 మిలియన్లుటేలర్ స్విఫ్ట్ 95.3 మిలియన్లుడొనాల్డ్ ట్రంప్ 87.5 మిలియన్లులేడీ గగా 83.1 మిలియన్లు -
TDP రాక్షసానందానికి ఇంకెంతమంది బలి కావాలి..?
-
పల్నాడులో రాజకీయ కక్షతో YSRCP కార్యకర్త దారుణ హత్య
-
Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్‌ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్‌ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్‌లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం. వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్‌ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్ఫోన్ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది. వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారారు. ఇక ఒరిజినల్‌గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్‌ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్‌లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే. 15000 మంది గేమర్స్ మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్‌ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్‌ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది. సంవత్సరానికి 5 కోట్లు 23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్‌ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్‌కు సెల్‌ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు. పల్లెటూరి అమ్మాయి పాయల్ ధారేది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్‌లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్‌లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్‌లోకి వచ్చారని తెలిపింది. మంచి మార్గం కోసం ‘గేమ్స్‌ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్‌ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్‌కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు. చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్‌లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్‌కు సూచించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులుగా ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ శాఖ తేల్చింది. ప్రదీప్‌రెడ్డితో పాటు కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో రూ. 7 కోట్ల 50 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఐటీ అధికారుల వరుస సోదాలు సోమవారం మూడ్రోజులు పాటు కొనసాగాయి. ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్సీపురం, వట్టినాగులపల్లి,గచ్చి బౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించాయి. మై హోమ్ భుజాలో నివాసం ఉంటున్న ప్రదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడాలో అంతర్జాతీయ రసాయన పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. తనిఖీల సమయంలో ఎవరినీ లోపలికి రానీయకుండా సీఆర్పీ ఎఫ్ జవాన్లు బందోబస్తు నిర్వహించారు. ఆయా కంపెనీలకు చెందిన ఆర్ధిక లావాదేవీల వివరాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు మెరుపుదాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కోట్లున్నా..కారుండదు..ఎందుకు? -
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: పొంగులేటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొంగులేటి అనుచరుడు ఉపేందర్ ఆయన ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఉదయం 5 గంటల నుండి పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటికి మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పొంగులేటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయంటూ నిరసన తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇవాళ నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనుసైగల్లో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని ప్రకటించాను. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రుల 30 మంది ఇళ్లపై 400మంది అధికారులు దాడులు చేస్తున్నారు. నారాయణపురంలోని మా తల్లి ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. కనీసం లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారు. నా దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, బంధువులపై మాన్ హ్యండలింగ్ చేశారు. నా భార్యను, కుమారుడిని వాళ్ల ఆఫీస్‌కి తీసుకెళ్లారు. నన్ను ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపై సోదాలు ఎందుకు జరగట్లేదు?. ఈ పరిణామాలను ప్రజలంతా గమనించాలి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆర్ఎస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. చదవండి: ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం -
మోదీని ఫాలో అవుతున్న మస్క్.. కారణం అదే అంటున్న నెటిజన్లు
అపర కుబేరుడు.. ట్విటర్, టెస్లా సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్విటర్లో ఫాలో అవడం మొదలుపెట్టారు. ట్విటర్లో 134.3 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగిన మస్క్ కేవలం 195 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న ప్రముఖుల జాబితాలో ఎలాన్ మస్క్ కూడా ఒకరు కావడం గమనార్హం. భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్విటర్లో 87.7 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు మస్క్ మోదీని ఫాలో అవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ఫాలోవర్ అప్డేట్లను పోస్ట్ చేసే 'ఎలాన్ అలర్ట్స్' అకౌంట్ నుంచి ఓ ట్వీట్ పోస్ట్ అయింది. నరేంద్ర మోదీని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్నారంటూ అందులో ఉంది. Elon Musk is now following Narendra Modi (@narendramodi) — ELON ALERTS (@elon_alerts) April 10, 2023 చాలా రోజుల తరువాత ప్రధాని మోదీని మస్క్ ఫాలో అవడం ప్రారంభించటంతో నెటిజన్లలో చర్చ మొదలైంది. కొంత మంది త్వరలో టెస్లా ఇండియాకు రానుందా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కొంతమంది మోదీ ప్రపంచంలోని గొప్ప నాయకులలో ఒకరు, కాబట్టి మస్క్ ఫాలో అవుతున్నదంటూ వారి అభిప్రాయాలను వెల్లడించారు. What made Elon Musk to follow Narendra Modi of India⁉️ Can we expect a factory there $TSLA Let’s see https://t.co/3SRwS2FuJH pic.twitter.com/QXTSQhLfa2 — Technosmith (@itechnosmith) April 10, 2023 మొత్తానికి ఇది భారతదేశంలో టెస్లా రావడానికి సూచనగా భావిస్తున్నారు. గతంలో కూడా మస్క్ టెస్లా కార్లను ఇండియాకు దిగుమతి చేసి విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే మన దేశంలో అధిక పన్నులపై అసంతృప్తి వ్యక్తం చేసి ఒకడుగు వెనక్కి వేశారు. అప్పట్లో దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరాడు. కానీ దీనికి ఇండియా ఒప్పుకోలేదు. Thanks Elon Musk! As our PM Modiji is taking efforts to make our country better, prosperous, progressive & improve people' lives, Elon Musk is also striving for making world sane,wokism free, assuring good society & better future life for today's children. Wish both best wishes! https://t.co/EsXNApQCTE — An Atheist (@MrsAtheist) April 10, 2023 బీబీసీ ట్విట్టర్ ఖాతాకు గవర్నమెంట్ ఫండెండ్ మీడియా అనే లేబుల్ ఇచ్చిన తర్వాత భారత ప్రధాని మోదీని మస్క్ ఫాలో కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. దీని తరువాత మస్క్ ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఇది అందరిలోనూ ఒక ప్రశ్నను లేవనెత్తింది. దీనిపైన మస్క్ ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. -
టీడీపీ కంచుకోటలో జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): టీడీపీ కంచుకోట నరసాపురంలో జేసీ బ్రదర్స్ (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)కు గట్టి షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడైన రామాంజులరెడ్డి, ఆయన వర్గీయులు దాదాపు 160 కుటుంబాల వారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి నేతృత్వంలో వీరంతా మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ మారడం టీడీపీ కంచుకోటకు బీటలు బారినట్లయ్యింది. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తుండటంతో ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లభించకపోవడం, వర్గ కక్షలు పెంచి పోషించే జేసీ సోదరుల వైఖరి నచ్చకపోవడంతో 160 కుటుంబాల వారు పార్టీ వీడారన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు వేమనాథరెడ్డి, ఎంపీపీ రామ్మూర్తిరెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హాజీవలి, మండల యూత్ కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, పార్లమెంటు జనరల్ సెక్రటరీ రవిప్రసాద్‌రెడ్డి, సీనియర్ నాయకులు చిక్కేపల్లి రామేశ్వర్‌రెడ్డి, ముచ్చుకోట అమర్నాథరెడ్డి, నరసాపురం రామచంద్ర (కాశీ), ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా పలు అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తూ పబ్బం గడుపుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అనుచరుడు కోరాడ సుబ్రహ్మణ్యం తాజాగా తన కారుకు నకిలీ పోలీసు నేమ్ బోర్డు పెట్టుకుని తిరుగుతూ ఒడిశా పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కోరాడ సుబ్రహ్మణ్యం కింజరాపు అచ్చెన్నాయుడికి ప్రధాన అనుచరుడు. ఈయన కొత్తపల్లిలో ఇనుము, సిమెంట్ వ్యాపారం చేస్తుంటాడు. చదవండి: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు దీంతో పాటు ఫెర్టిలైజర్స్ డీలర్షిప్ ఉంది. ఒడిశా ప్రాంతం నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తుంటాడనే ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో ఒడిశా నుంచి సిమెంట్, ఎరువులు, విత్తనాలను ఎటువంటి పత్రాలు లేకుండా లారీల్లో దిగుమతి చేస్తుండేవాడన్న వాదనలున్నాయి. 2021 ఆగస్టులో సుబ్రహ్మణ్యం గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్కడ ఈ–వే బిల్లులు లేకుండా ఒడిశా నుంచి సిమెంట్ రవాణా చేసినట్లు గుర్తించి రూ.48 వేల జరిమానా విధించారు. అలాగే సిమెంట్ అక్రమ నిల్వలున్నాయన్న సమాచారంతో గోడౌన్లో దాడులు నిర్వహించగా అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 122 యూరియా బస్తాలు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా.. ఏపీ 39 ఎల్డబ్ల్యూఎస్ 123 నంబర్ గల కారుకు పోలీసు నేమ్ బోర్డు పెట్టుకుని ఒడిశాలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో ఇటీవల యథేచ్ఛగా తిరుగుతున్నాడు. దీంతో బరంపురం పోలీసులకు అనుమానం వచ్చి ఆయనను విచారించడంతో నకిలీ పోలీసు నేమ్‌బోర్డు వ్యవహారమని తేలింది. దీంతో ప్రాథమిక విచారణలో భాగంగా ఈ నెల 2వ తేదీన వాహనాన్ని సీజ్ చేసి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించారు. 417, 419, 464 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడ్డగోలు వ్యాపారాల కోసమే ఒడిశాకు వెళ్లారని, ఎవరూ తమను అడ్డుకోరాదనే ఉద్దేశంతోనే పోలీసు నేమ్ బోర్డు పెట్టుకుని తిరుగుతున్నారని వాదనలు విన్పిస్తున్నాయి. -
కాసేపట్లో రిమాండ్ కు నయీం అనుచరుడు శేషన్న
-
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన మూవీస్
-
Cannes Film Festival: గోస్ టు కాన్స్
పేదరికంతో ఇబ్బందులు పడే ఒక మహిళ కథ.. ఓ బాలుడి తీయని జ్ఞాపకాలు.. భారతీయ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాద బాధితుల ఇబ్బందులు.. ఇంటి కోసం వెతికే ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళల పాట్లు.. ఒక జర్నలిస్ట్ మరియు రెండు వర్గాల మధ్య సంఘర్షణ.. ఇవన్నీ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కథలతో రూపొందిన ఐదు భారతీయ చిత్రాలు కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ‘గోస్ టు కాన్స్’ విభాగంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కాన్స్ ఉత్సవాలకు వెళ్లనున్న ఆ ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం. లైలా... రోషిణి... ఓ ఇల్లు జీవించడానికి ఒక ఇంటి కోసం ఆరాటపడుతుంటారు లైలా, రోషిణి అనే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారు కావడంతో అద్దెకు ఇల్లు దక్కించుకోవడం పెద్ద ప్రహసనం అవుతుంది. రిన్ చిన్, మహీన్ మీర్జా రూపొందించిన హిందీ చిత్రం ‘ఏక్ జగహ్ అప్నీ’ కథ ఇది. నిజమైన ఇద్దరు ట్రాన్స్ ఉమెన్ (లింగ మార్పిడి చేయించుకున్న మహిళలు) నటించిన చిత్రం ఇది. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమానే. కథ రాసేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఓ బాలుడి జ్ఞాపకాలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో చదువుకుంటాడు ఆ కుర్రాడు. ఆ నాలుగేళ్ల జీవితం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ జ్ఞాపకాలకు కొన్ని కాల్పనిక అంశాలు జోడించి దర్శకుడు శైలేంద్ర సాహు తెరకెక్కించిన చిత్రం ‘బైలాడీలా’. శైలేంద్ర సాహు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఛత్తీస్ గఢ్‌లో చదువుకున్నప్పటి అతని జ్ఞాపకాలే ఈ సినిమా. హిందీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి బడ్జెట్ నిర్ణయించలేదు. శేలైంద్ర స్నేహితులు నటించారు. వాళ్లతో పాటు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా డబ్బులొస్తే అప్పుడు ఇస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చారు శైలేంద్ర. కాన్స్ చిత్రోత్సవాల్లో తన చిత్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళుతున్నారు. నిర్మాతలు ముందుకు రాని ‘ఫాలోయర్’ బెల్గామ్‌లోని ఓ పట్టణానికి చెందిన ఒక జర్నలిస్ట్, రెండు వర్గాల మధ్య సంఘర్షణ చుట్టూ సాగే చిత్రం ‘ఫాలోయర్’. హర్షద్ నలవాడే దర్శకత్వంలో హిందీ, కన్నడ, మరాఠీ, దఖినీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. బెల్గామ్ నేపథ్యం కావడంతో అక్కడి స్థానికులతోనే నటింపజేశారు. రెండు వర్గాల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని సినిమా కావడంతో నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సినిమా టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసి ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలా ‘క్రౌడ్ ఫండెడ్’ మూవీగా ‘ఫాలోయర్’ రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చేస్తున్న సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇద్దరు నిర్మాతలు సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయింది. పేదరికాన్ని జయించాలని... ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే వంట మనిషి శివమ్మ జీవితం చుట్టూ సాగే కథ ‘శివమ్మ’ చిత్రం. పేదరికాన్ని జయించడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కూతురి పెళ్లికి దాచిన డబ్బుని ఓ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతుంది. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను జోడించి అల్లిన కాల్పనిక కథతో దర్శకుడు జై శంకర్ ఈ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినవారందరూ వృత్తిరీత్యా యాక్టర్లు కాదు. కానీ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలని నటింపజేశారు. దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాగ్జాన్ 2020లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదంగా నమోదైంది. గ్యాస్ లీకేజ్ కారణంగా చమురు బావిలో ఎగసిపడిన భారీ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన అస్సామీ చిత్రం ‘బాగ్జాన్’. తిన్సుకియాలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే ఆ దుర్ఘటన బాధితులను కూడా నటింపజేశారు చిత్రదర్శకుడు జైచెంగ్ గ్జయ్. బలమైన కథాంశంతో రూపొందిన ఈ ఐదు చిత్రాలూ ప్రపంచ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఊహించవచ్చు. ఇలా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం ఆయా చిత్రబృందాలకు ఉపయోగపడే విషయం. తమ సినిమాని మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే తదుపరి చిత్రానికి ఫండ్ సమకూరే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికి సినిమా విడుదల కాకపోతే విడుదలకు సహాయం అందే అవకాశం ఉంది. మేకర్స్‌కి ఇలాంటి ప్రయోజనాలు ఉంటే.. నటీనటులకు అవకాశాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అందుకే కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లనున్న ఈ ఐదు చిత్రాల యూనిట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
CM KCR: కేసీఆర్ గుడి అమ్మబడును!
సాక్షి, మంచిర్యాల (ఆదిలాబాద్): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టించాడు. అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేసీఆర్, కేటీఆర్‌లను కలిసే అవకాశం కూడా రాలేదని గుడిని, గుడిలోని కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలో గుడి కట్టించాడు. అందులో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కేసీఆర్, కేటీఆర్‌ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్ఎస్ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్బుక్లో పోస్టు చేశాడు. చదవండి: డ్రగ్స్ వార్: రేవంత్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా -
కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..!
-
తాడిపత్రి: వైఎస్సార్సీపీ కార్యకర్తపై వేట కొడవలితో దాడి
తాడిపత్రి రూరల్(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ వర్గీయులపై వరుస దాడులకు తెగబడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు ఘటనలు చోటు చేసుకోవడం తాడిపత్రి ప్రజల్లో భయాందో ళనలు సృష్టిస్తోంది. తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ వర్గీయుడు రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రత్నమయ్యపై గురువారం వేటకొడవలితో దాడి చేశాడు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి గెలుపునకు రత్నమయ్య తనవంతు కృషి చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని రామాంజనేయులు, మరికొందరు గ్రామంలోని బస్టాప్ సమీపంలో రచ్చకట్ట వద్దనున్న రత్నమయ్యపై వేట కొడవలితో దాడి చేశారు. ఘటనలో రత్నమయ్య ఎడమ చేయి తెగడంతో పాటు తొడకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తీసుకెళ్లారు. ఘటన సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. రామాంజనేయులుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్
ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియా గురుంచి తెలియని వారు అతితక్కువలో ఉంటారని చెప్పుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో ఎక్కువ శాతం ఈ సోషల్ మీడియాకు బానిస అయిన వారే. అయితే, ఈ సోషల్ మీడియా ద్వారా కొందరు తమ సమయాన్ని వృథా చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా, ట్విటర్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకోని వస్తుంది. ఈ ‘సూపర్ ఫాలో’ ఫీచర్ ద్వారా యూజర్లు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోస్తుంది. ఈ కొత్త ఫీచర్‌తో ట్విటర్ యూజర్లు సరికొత్త వీడియోలు, ప్రత్యేకమైన కంటెంట్, తాజా సమాచారం, ప్రత్యేక ఫోటోలు, ఇతర ఆసక్తికర విషయాలను షేర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఒక ట్విటర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేసే ప్రత్యేకమైన ఈ సమాచారం.. అతని అభిమానులు చూడాలంటే తప్పనిసరిగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వారు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా వారు చెల్లించే ఫీజు ద్వారా ట్విట్టర్ యూజర్లు మనీ సంపాదించవచ్చు. ఇక సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది. సబ్‌స్క్రైబ్ చేసుకోని వారు ఈ కంటెంట్‌ను చూడలేరు. ఇలాంటి ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్ 'జాయిన్' అనే పేరుతో ఉంది. చదవండి: ఫేస్‘బుక్'కు అమెరికా కోర్టు షాక్ వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్ఓ -
దుబ్బాకలో మరో డేరాబాబా
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో మరో డేరాబాబా (స్వామీజీ), ఆయన అనుచరుడి రాసలీలల భాగోతం బట్టభయలు కావడం తీవ్ర చర్చానీయాంశగా మారింది. తనకు జరిగిన అన్యాయంపై ఓ వివాహిత దుబ్బాక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడంతో స్వామీజీతో పాటు ఆయన అనుచరుడి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక సీఐ హరికృష్ణ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇవి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌కు చెందిన ఓ మహిళ సంతోషిమాతా భక్తురాలు.. ఆమెకు సంతోషిమాతా గుడి కట్టాలన్న సంకల్పం చాలా రోజులుగా ఉంది. అయితే చీకోడ్ సమీపంలోనే కొన్నేండ్లుగా రఘు అనే వ్యక్తి ఓ స్వామీజీగా అవతారమెత్తి స్వామి సమర్థ మహరాజ్ ఈనే పేరుతో ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. చాలా మహిమ గల స్వామీజీగా పేరొందడంతో ప్రతిరోజు చాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో చీకోడ్‌కు చెందిన భాదిత మహిళ సైతం స్వామీజీకి భక్తురాలిగా మారింది. మహిళ తన మదిలో ఉన్న సంకల్పం(సంతోషీమాతా గుడి కట్టాలన్నది) స్వామీజీకి చెప్పింది. దీంతో భక్తురాలి అమాయకత్వాన్ని పసిగట్టిన స్వామీజీ రాత్రి వేళలో బాధిత మహిళకు తన అనుచరుడు నరేష్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి నేను స్వామీజీని మాట్లాడుతున్నా నీ సంకల్పం నేరవేరాలంటే నా అనుచరుడు నరేష్ రూపంలో మీ ఇంటికి వస్తాను ఆయన రూపంలో ఉన్న నన్ను సంతృప్తి పరిస్తే నీ ఆలయ సంకల్పం నేరవేరుతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటూ ఒట్టు వేయించుకొన్నాడు. ఇది నమ్మిన ఆ అమాయక మహిళపై స్వామీజీ అనుచరుడు నరేష్‌గత కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. చాలా రోజులు అవుతున్నా ఆమె సంకల్పం నేరవేరకపోవడంతో తనను మోసం చేశారని తెలుసుకున్న మహిళ తమకు ఫిర్యాదు చేసిందని సీఐ హరికృష్ణ తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు స్వామీజీతో పాటు ఆయన అనుచరుడు నరేష్‌పై అత్యాచారం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర చర్చానీయాంశగా మారింది. -
జేసీ అనుచరుడి జిల్లా బహిష్కరణ..!
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో అసాంఘిక శక్తిగా చలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న ఎస్వీ రవీంద్రారెడ్డి పాతికేళ్లుగా తాడిపత్రిని శాసించాడు. తాడిపత్రి మండలం, దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి వీరారెడ్డి కుమారుడైన సంగటి రవీంద్రారెడ్డి 2003లో జేసీ సోదరుల పంచన చేరాడు. మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి నమ్మిన బంటుగా మారడంతో వారు పూర్తి అండదండలు అందించారు. దీంతో రవి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. హత్యాయత్నం, దొమ్మి, మారణాయుధాలు కలిగి ఉండటం తదితర 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ అప్పటి జిల్లా ఎస్పీలు ఆయన జోలికి వెళ్లడానికి సాహసించలేదు. 2003లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన, 2004లో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడంపై కేసులు నమోదు అయ్యాయి. 2015లో అల్ట్రాటెక్ట్ సిమెంట్ పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసు, 2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన వాటర్ ట్యాంక్ దగ్ధం కేసులో రవీంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నాడు. 2018లో వినాయక చవితి నిమజ్జన సందర్భంగా చేలరేగిన ఘర్షణలో కేసులు నమోదు అయ్యాయి. 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఇవే కాకుండా పొట్టిరవి చేసిన దాడులు దౌర్జన్యాలు, దందాలకు ఎన్నో ఉన్నాయి. అయితే తాడిపత్రిలో పాతిక సంవత్సరాలు జేసీ బ్రదర్స్‌దే సామ్రాజం కావడంతో ఇతనిపై ఫిర్యాదు చేయడానికి బాధితులు సాహసించ లేదు. కొంత మంది పోలీస్స్టేషన్ల వరకు వెళ్లినా అక్కడి పోలీసులు పంచాయతీ చేసి పంపించిన సందర్భాలున్నాయి. ఎస్పీ సత్య యేసుబాబు కొరడా జిల్లా ఎస్పీగా బూసారపు సత్య యేసుబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసాంఘిక శక్తులను అణచివేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రిలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, సెటిల్మెంట్లకు పాల్పడిన వారిని ఏరివేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డిని హత్య చేయాలని పొట్టి రవి కుట్ర పన్నగా...పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. దీంతో పొట్టి రవి అరాచాకాలు ఎస్పీ దృష్టి వెళ్లాయి. దీంతో ఆయన రవిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. తాజాగా జిల్లా బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
హత్యాయత్నం కేసులో.. జేసీ అనుచరుడి అరెస్ట్
సాక్షి, తాడిపత్రి: ఏడీసీసీ బ్యాంకు మేనేజర్ హత్యాయత్నం కేసులో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి(పొట్టి రవి)ని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సురేష్‌బాబుతో కలిసి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. గత నెల 28న తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత వంశీమోహన్‌రెడ్డి సోదరుడు ఏడీసీసీ బ్యాంకు మేనేజర్ అనిల్‌కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టి అతడిని హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన జేసీ వర్గీయులు శివశంకర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, రామాంజులరెడ్డి మరి కొందరు యత్నించారు. అయితే బాధితుడు చాకచక్యంగా తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కాల్‌డేటా ప్రకారం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎస్వీ రవీంద్రారెడ్డి ప్రొద్బలంతోనే అనిల్‌కుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఎస్వీ రవీంద్రారెడ్డి కేసులపై విచారణ ఎస్వీ రవీంద్రారెడ్డిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని, వాటిపై లోతుగా విచారిస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు మట్కా, గ్యాంబ్లింగ్ నిర్వాహకులను ప్రొత్సహించారన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో పలుమార్లు పోలీసుల కౌన్సెలింగ్ జేసీ సోదరుల ప్రధాన అనుచరుడిగా ముద్రవేసుకున్న ఎస్వీ రవీంద్రారెడ్డిపై పలు నేరారోపణలున్నాయి. ఈక్రమంలో పోలీసులు అతడికి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. 2011లో అప్పటి జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా, 2012 నవంబర్‌లో అప్పట్లో స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్, స్థానిక పట్టణ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టేట్ బ్యాంకు మేనేజర్ స్వప్న మంజుల హత్యాయత్నం కేసులో (క్రైం నంబర్:148/18) నిందితుడు. అప్పట్లో అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోయారు. మాట్లాడుతున్న డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి -
గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడి అరెస్ట్
సాక్షి, భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు కత్తుల జంగయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేందర్ తెలిపారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన డీఎస్ ప్రాన్సిస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి భువనగిరి పట్టణ శివారులో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ వెంచర్లో 1993, 1996 మధ్యలో జీపీఏ హోల్డర్ పక్కిర్ బాల్‌రెడ్డి వద్ద నాలుగు ప్లాట్లను ఒక్కొక్కటి 300 గజాల చొప్పున మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2006 సంవత్సరంలో నయీం తన అనుచరులైన పాశం శ్రీను, నాజర్, కత్తుల జంగయ్యతో కలిసి ఎలాగైనా మొత్తం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి సర్వే నంబర్ 721, 733లో ఉన్న మొత్తం 154 ఎకరాల భూమిని పక్కిరు బాల్రెడ్డికి జీపీఏ చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కబ్జాలోకి తీసుకున్నారు. బాధితులు ప్లాట్లలోకి వెళ్లినపుడు ఇక్కడికి వస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. తమ ప్లాట్లను అన్యాయంగా అక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా పట్టణంలోని స్థానిక సంజీవనగర్‌లో కత్తుల జంగయ్య ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతనిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసునమోదు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. గతంలో కత్తుల జంగయ్యను మొత్తం 91కేసులలో అరెస్టు చేసినట్లు, పీడీ యాక్టును కూడా నమోదు చేయగా సంవత్సరం జైలు శిక్ష పడినట్లు తెలిపారు. -
కార్యకర్త బర్త్ డే : సీఎం సర్ప్రైజ్
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి ఓ కార్యకర్త పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది.. సీఎం స్వయంగా దగ్గరుండి ఓ కార్యకర్త పుట్టిన రోజు సెలబ్రేట్ చేయడం నిజంగా గ్రేటే. ఈ అరుదైన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కార్యకర్త పుట్టిన రోజు నాడు దగ్గరుండి కేట్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వివరాలు.. ఆప్ సోషల్ మీడియా టీం మెంబర్ వివేక్ పుట్టిన రోజు సందర్భంగా కేజ్రీవాల్ స్వయంగా దగ్గరుండి అతని చేత కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వివేక్ ట్విటర్లో షేర్ చేశాడు. దాంతో పాటు ‘ఓ సాధరణ కార్యకర్తకు ఓ ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవం’ అనే మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం గురించి అందరికి తెలిసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ క్రమంలో కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలే మాకున్న గొప్ప బలం. కార్యకర్తల సాయంతో మా పార్టీ దేశ సేవ చేస్తుంద’ని పేర్కొన్నారు. -
నిమ్స్ ఆస్పత్రిలో రాజకీయ నేత అనుచరుల వీరంగం
-
విజయనగరం జిల్లాలో మంత్రి అనుచరుడు ఘరానా మోసం
-
ఆ అభిమానానికి హద్దుల్లేవ్!
వైఎస్సార్సీపీపై తన అభిమానానికి హద్దుల్లేవని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పండ్ల వ్యాపారి దామర్ల శ్రీనివాసరావు నిరూపించాడు. దివంగత సీఎం వైఎస్సార్ వీరాభిమాని అయిన ఆయన వైఎస్సార్ మరణాంతరం వైఎస్ జగన్ అభిమానిగా కొనసాగుతున్నాడు. శ్రీనివాసరావుకు జగన్ అంటే ఎంత అభిమానమంటే తాను నిరంతరం వాడే టీవీఎస్ ద్విచక్రవాహనానికి 365 రోజులు, 24 గంటలు వైఎస్సార్సీపీ జెండాలు పెద్దవి ఏర్పాటు చేశాడు. వాహనానికి ముందు భాగంలో చెరగని చిరునవ్వుతో మహానేత వైఎస్సార్ ఫొటో కూడా ఉంటుంది. ఆయన కుమార్తె సైతం పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రంగులతో కుట్టించిన దుస్తులతో హాజరవుతోంది. వారి కుటుంబం జగన్‌పై అభిమానంతో పార్టీ ప్రచారం నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటుండడం నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెల్లని పొడవాటి గడ్డం పెంచి తిరిగే శ్రీనివాసరావు సందర్భాన్ని బట్టి తన గడ్డానికి వైఎస్సార్సీపీ జెండాలోని రంగులు వేసుకుని కనిపించడం పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. -
‘నేను స్మోక్ చేస్తాను.. డ్రింక్ చేస్తాను అంతమాత్రానా’
‘నేను సిగరెట్ తాగుతాను.. డ్రింక్ చేస్తాను. అంత మాత్రానా నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?’ అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి శ్వేతా సాల్వే. విషయమేంటంటే కొన్ని రోజుల క్రితం శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిగరెట్ తాగుతూ ఉన్న పోస్ట్ చేశారు. ఈ ఫోటో కాస్తా నెటిజన్లకు కోపం తెప్పించింది. దాంతో వారు ‘ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మంచి తల్లి కాదు. మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లు వస్తాయి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై శ్వేత స్పందించారు. ‘అవును. నేను తాగుతాను, ధూమపానం కూడా చేస్తాను. కానీ నేను నిజాయతీగా ఉంటాను. కేవలం డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం వంటి వాటి వల్ల నేను మంచి తల్లిని కాకుండా పోతానా? అయిన నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా? పని పాటా లేకుండా ఖాళీగా గడపడం చూశారా? ఎప్పుడైనా నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా? నిత్యం నేను ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నేను నటిని, డ్యాన్సర్‌ను, పారిశ్రామికవేత్తని. ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నేను ఎలాంటి ప్రశ్నలు వేయను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి’ అంటూ నెటిజన్లపై మండిపడ్డారు. అంతేకాక ‘నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. నా ఫాలోవర్ల గురించి.. నా పోస్ట్‌లకు చేసే లైక్‌ల గురించి నేను పట్టించుకోను. మీరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్‌ఫాలో అవ్వచ్చు’ అంటూ డ్రింక్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram A Day off Looks something like this .. . Yes I Drink and Smoke ... I am real , honest and basic like that. It has to be of no reason that anyone ever judge me for the person I am or the Mommy I am .. I don’t propagate it and neither do I question anyone else who does , so I would respect the same back . Today I got a few random DM’s by totally random people about my actions , and I usually let such things go pass me but for some reason today I felt like addressing it . How does this make me a bad person or a bad mom ?? Do you see me wasting my Life ? Do you see me sitting unemployed n jobless ? Do you see me neglecting my child ? I work , I work multiple jobs , I’m an actor , dancer , an entrepreneur . I successfully live in two major cities of our glorious country . I have beautiful friends whom I love and I know who love me back for the person I am . Risking the fact that I might sound aggressive , don’t ever question my abilities of being a bad example to my child !! So tell me does an honest sex worker who sells her body to feed her family , to maybe get an education or to provide a life for her children is a Bad Person ? A Bad Mother ? A stigma to society ? Who are you and I to Judge ?? My parents taught me well and exposed me to the good and evil of everything . They smoked and drank too but they did a mighty fine job of raising my brother and I . As children we knew that this was not something we could practice until a certain age . And that too if we ever wanted to.. a choice that we were allowed to take as adults ... Today I share a drink with them , and celebrate the fact that they gave me a fabulous childhood n Life and I aspire to do the same with my Baby . . . I don’t pay for likes and followers , you choose to follow me for who I am . And hence what you see is me being me and you always have the option to unfollow me :) . Live and Let Live ✌🏼.. this rant has gotten me all irked so I’m gonna go pour myself a red and light up .. #micdrop 👊🏼 . #bekindtooneanother #peaceout A post shared by ⓢⓗⓥⓔⓣⓐ ⓢⓐⓛⓥⓔ (@shveshve) on Oct 28, 2018 at 5:51am PDT -
‘‘ఏయ్..ఉండాలని లేదా’’..
‘‘ఏయ్..ఉండాలని లేదా... నాకు నచ్చని వాళ్లు ఇక్కడ ఉండొద్దు. నాకు నచ్చినట్లు పని చేస్తే.. నా నియోజకవర్గంలో ఉండండి.. లేదంటే ఎలా పంపించాలో అలాగే పంపిస్తా..’’- విద్యుత్ కార్మికులకు హెచ్చరిక‘‘వాడు నాకు నచ్చలేదు. వెంటనే విధుల్లోంచి తీసేసి, మావాడిని (సిఫారసు చేసిన వ్యక్తి పేరు) పనిలో పెట్టుకునేలా చర్యలు తీసుకోండి.. లేదంటే నేను ఎంతదూరమైనా వెళ్తా...’’- విద్యుత్ అధికారులపై హుకుం... ఇలా పెత్తనం చెల్లాయిస్తున్నది ఏదో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కానే కాదు. అంతకుమించి...షాడో ఎమ్మెల్యే..! ఈయన శ్రీకాకుâళం రూరల్ మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి అతి సన్నిహితుడు కావడంతో దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జోక్యం చేసుకుంటూ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. తాజాగా విద్యుత్ శాఖలో తన దురుసుతనం చూపించడంతో, ఏకంగా ఆశాఖ కాంట్రాక్టర్లు, కార్మికుల సమ్మె వరకు దారితీసింది. ఈ వ్యవహారం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... అరసవల్లి శ్రీకాకుళం : స్థానిక నియోజకవర్గంలో విద్యుత్ పనుల్లో భాగంగా కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్పార్మర్లు, హెచ్‌టీ లైన్లు, పలు మీటర్ల ఏర్పాటు పనుల్లో కూడా తనదైన శైలిలో సదరు ఎంపీటీసీ అతిజోక్యం చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాను చెప్పిన ప్రదేశంలో స్తంభాలు, విద్యుత్ తీగలు వేయాలంటూ ఆదేశాలిస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో కొన్నిసార్లు వాదనలు, ప్రతివాదనలతో తాత్కాలికంగా పరిస్థితులు సద్దుమణిగినా, అది కొద్ది రోజులకే పరిమితమైంది. తన నియోజకవర్గంలో తనకు నచ్చిన వారు, తన సిఫారసుతో ఉన్నవారితోనే విద్యుత్ కాంట్రాక్టు పనులు చేయించాలని ఈ షాడో ఎంపీటీసీ విద్యుత్ అధికారులకు, కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ వివాదం రోడ్డెక్కింది. దీంతో రాజకీయంగా ఈ వివాదం సంచలనంగా మారింది. అయితే విద్యుత్ సంబంధించిన ఏ పనికైనా కొన్ని నియమ నిబంధనలు, ప్రతిపాదనలు, ఆమోదాలు ఉంటాయని, వీటి ఆధారంగానే తాము పనిచేస్తామని కొందరు సిబ్బంది చెబుతున్నారు. వీటిని వినిపించుకోకుండా తాను చెప్పినట్లు చేస్తే నియోజకవర్గంలో ఉంటారని, లేదంటే ఉండే అవకాశాలు లేవని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక సమ్మెకు దిగేందుకు కాంట్రాక్టర్లు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. చర్చలు విఫలమై.. స్థానిక నియోజకవర్గంలో విద్యుత్ అధికారులు, కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్న నేతలతో ఇక వేగేది లేదని కార్మికులు, కాంట్రాక్టర్లు తేల్చిచెప్పార ని విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతకుముందు సదరు షాడో ఎమ్మెల్యేకు, స్థానిక రాజకీయ పెద్దల సమక్షంలో పలుమార్లు చర్చలకు దిగినా, ఏ మాత్రం మెట్టు దిగని సదరు వ్యక్తి తీరు.. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు దారితీసినట్లు తెలు స్తోంది. తనకు నచ్చని వారు పనుల్లో ఉండకూడద ని చెప్పడంపై కార్మికులు భగ్గుమంటున్నారు. ఈ మేరకు జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి విద్యుత్ డివిజన్లోని కాంట్రాక్టు సిబ్బందితో కూడా చర్చలు మొదలుపెట్టి, సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విద్యుత్ అధికారుల వద్ద కూడా సమ్మె విషయం సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా అధికారులు విముఖత చూపిస్తున్నారు. ఇదిలావుంటే గురువారం రాత్రి నుంచి కాంట్రాక్టర్లు తమ నిరసనను తెలియజేస్తూ వస్తున్నారని, అందుకే కొంత సేపు విద్యుత్ సరఫరా నిలిపివేసారనే ప్రచారం స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో షికారు చేసింది. ఏదేమైనా షాడో ఎమ్మెల్యే ఆగడాలను తట్టుకోలేక పోతున్నామని, ఎలాగైనా తమ నిరసనను తెలియజేస్తామనే రీతిలో కాంట్రాక్టర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
పెద్దాయన పేరు చెప్పి ..దందాలు
అధికార పార్టీలో ఆయనో పెద్దాయన.. గత ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి జిల్లాలో చక్రం తిప్పిన వ్యక్తి. ప్రస్తుతం అధికార పార్టీలోకి మూడేళ్ల క్రితం చేరి ప్రస్తుతం ఒక నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయాల్లో సమకాలికుడిగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇన్చార్జి హోదాలో ఉన్నప్పటికీ అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. అలాంటి పెద్దాయన పేరు చెప్పి ఆయన ముఖ్య అనుచరుడుగా ఉన్న ఓ నాయకుడు బరితెగింపు దందాలకు పాల్పడుతున్నాడు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారపార్టీలో ఉన్న ఓ పెద్ద నాయకుడి పేరు చెప్పి ఆయన అనుచరుడు చిన్నపాటి వివాదాలు మొదలుకుని భారీ భూదందాల వరకు అన్ని యథేచ్ఛగా సాగిస్తున్నాడు. స్టేషన్లలో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఒక ప్యాకేజ్‌తో పాటు పెద్దాయన పేరు అదనపు బ్రాండ్‌గా మార్చుకుని దందాలు సాగిస్తున్నాడు. ఒక కానిస్టేబుల్‌కు చెందిన పొలంలో పంటను అతనికి తెలియకుండా విక్రయించటంతో వివాదం మొదలైంది. అధికార పార్టీ నేత కావటం, పెద్దాయన బ్రాండ్ ఉండటంతో చివరకు పోలీసులు కూడా సొంత ఖాకీకి న్యాయం చేయలేక సెటిల్మెంట్ చేసుకోమని ఒత్తిడి తేవటం జిల్లాలో అధికార పార్టీ తీరుకు ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. ఏదేమైనా అతని జోలికి రావద్దంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవటం గమనార్హం. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి చెందిన అధికార పార్టీ నేత గంగినేని నాగేశ్వరరావు అలియాస్ తిక్కవరం నాగేశ్వరరావు నియోజకవర్గంలో సాగి స్తున్న వ్యవహారం ఇది. మూడేళ్లలో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో స్టేషన్లలోనే ఐదు కేసులు సెటిల్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆత్మకూరు స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ భార్యకు పుట్టింటి ద్వారా అక్కడ ఏడు ఎకరాల పొలం వచ్చింది. దానిలో ఏడేళ్లుగా సరుగుడు తోట సాగు చేశారు. మంచి ధర వస్తే పంటను విక్రయించాలని కానిస్టేబుల్ భావించాడు. అయితే కానిస్టేబుల్‌కు తెలియకుండా రాత్రికి రాత్రే నాగేశ్వరరావు మనుషులను పెట్టి సరుగుడు తోటను కొట్టించి రూ.4.60 లక్షలకు విక్రయించాడు. దీనిపై కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తే, ఆయన పెద్దాయన మనిషి కదా రూ.2 లక్షలు తీసుకుని రాజీ చేసుకోమని స్టేషన్ ఎస్సై బాధిత పోలీసుకు సలహా ఇచ్చాడు. చివరకు ఉన్నతాధికారుల దృష్టికి రావటంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కేసులు గడిచిన మూడేళ్లలో అనేకం చోటుచేసుకున్నాయి. అలాగే గతంలో కేవీ సుబ్బారెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని కూరపాటి సుశీలమ్మ అనే మహిళకు రూ.91 లక్షలకు విక్రయించాడు. చివరకు స్టేషన్లో పంచాయతీ చేసి రూ.30 లక్షలు వెనక్కి ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నాడు. రైతుల భూములు రియల్ కంపెనీకి విక్రయం మరోవైపు రైతుల భూములు వారికి తెలియకుండా చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి విక్రయించాడు. వాటిలో ప్రస్తుతం కొన్ని పంచాయతీలు పెండింగ్‌లో ఉన్నాయి. నరసింహారెడ్డి అనే వ్యక్తికి చెందిన 9 ఎకరాల భూమిని అతని ప్రమేయం లేకుండా చెన్నైకి చెందిన రెయిన్ ఫారెస్ట్ ఆగ్రో వెంచర్ సంస్థకు విక్రయించాడు. అలాగే చిన్న కొండయ్య అనే వ్యక్తి భూమిని కూడా అదే కంపెనికి విక్రయించాడు. ఇక తిక్కవరం, పల్లవోలు గ్రామాల్లో ఉన్న సీజేఎఫ్ ఎస్ భూముల్ని గతంలో మహిళ తహసీల్దార్ సహకారంతో పట్టాలు సృష్టించి, వాటిని కూడా ఇదే రియ ల్ ఎస్టేట్ కంపెనీకి తక్కువ ధరకు విక్రయించాడు. వాటికి గతంలో ఉదయగిరిలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌తో కలిసి అన్ని రిజిస్ట్రేషన్లు చేశాడు. ప్రస్తుతం ఇవన్నీ పంచాయతీ దశలో ఉన్నాయి. పశువులను కూడా వదలరు చివరకు పశువులను కూడా వదలరనే పేరుంది. రోడ్లపై కనిపించిన గేదెలను ప్రత్యేకంగా ఉండే రెండు వాహనాల్లో తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో విక్రయించటం, లేదంటే కడప సరిహద్దు గ్రామాలకు తరలించటం చేస్తారు. వీటికి సంబంధించి నమోదైన ఫిర్యాదుల్లోనూ పోలీసుల వ్యవహార శైలి ఏకపక్షమే. ఒక రైతుకు చెందిన ఐదు గేదెలను తీసుకెళ్లి ఆ నాయకుడు అమ్మేశాడు. బాధిత రైతులు కేసు పెడితే విచారణ పేరుతో కేసును పెండింగ్‌లో ఉంచారు. అలాగే గతంలో వెంకటనర్సయ్య అనే వ్యక్తి గేదెలను కూడా విక్రయించాడు. రాంపల్లి గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఐదు గేదెలను కూడా ఇదే రీతిలో అమ్మేశాడు. చివరకు బాధిత రైతులతో మాట్లాడి స్టేషన్లో ఎస్సై సెటిల్మెంట్ చేసి రూ.50 వేలు ఇప్పించాడు. ఇలాంటి నేత జోలికి రావద్దని తరచూ అధికార పార్టీ పెద్దాయన నుంచి పోలీసులకు ఫోన్లు రావటంతో పూర్తిగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. -
దావూద్ అనుచరుడు ఫరూక్ అరెస్టు
న్యూఢిల్లీ: అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ తక్లా(57)ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతడు గురువారం దుబాయ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత ముంబై తరలించి బాంబు పేలుళ్ల కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడిని మార్చి 19 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. నిఘా వర్గాల ప్రయత్నాల ఫలితంగానే యూఏఈ ఫరూక్‌ను భారత్‌కు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబై బాంబు పేలుళ్లకు పాల్పడి దేశం నుంచి పరారయిన నిందితులకు ఫరూక్ సహాయకారిగా దోహదపడ్డాడు. -
తెలుగు వారి అడుగుజాడ గురజాడ
పుంగనూరు టౌన్ : తెలుగువారి అడుగుజాడ గురజాడ అని వక్తలు కొనియాడారు. గురజాడ అప్పారావు జయంతిని పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జయచంద్రనాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు భాషాభిమానులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని సుసంపన్నం చేసి, చరిత్ర సృష్టించిన గురజాడ జయంతి తెలుగుజాతికి పండుగగా అభివర్ణించారు. సమాజంలో సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు కన్యాశుల్కం వంటి గొప్ప సాంఘిక నాటకాన్ని రచించిన గురజాడ తెలుగు వాడవటం జాతి చేసుకున్న అదృష్టమన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని దేశభక్తిని జాతి జనులలో రగిల్చిన యుగకర్తగా అభివర్ణించారు. కన్యాశుల్కం, వరకట్నం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, అస్పృశ్యతను ఇతివృత్తాలుగా చేసుకొని కవితలు రచించి సాంఘిక మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ గ్రంథాలయాధికారిణి నసీబ్జాన్, తెలుగు భాషాభిమానులు వెంకటపతి, సీతాపతిరాజు, గండికోటరవీంద్ర, రామలింగప్ప, గురుమూర్తి, ఇట్టాభానుప్రకాష్, గిరిధర్, ఇంతియాజ్, హరి పాల్గొన్నారు. -
నయీం మరో అనుచరుడి అరెస్ట్
-
నయీం మరో అనుచరుడి అరెస్ట్
భువనగిరి: ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ మరో అనుచరుడు సగ్గర హరి అనే వ్యక్తిని పోలీసులు భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసుకు తరలించారు. నయీమ్ బాధితుడు, ఎలక్ట్రానిక్స్ అండ్ సానిటరీ షాపు యజమాని సుంచు నరహరి ఫిర్యాదు మేరకు పోలీసులు హరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సగ్గర హరి కాకినాడకు చెందిన వ్యక్తి. గత కొంత కాలంగా భువనగిరిలో స్థిరపడిన ఇతను నయీం సెటిల్మెంట్లలో ఇతను కీలకవ్యక్తిగా భావిస్తున్నారు. వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి నయీం ద్వారా సెటిల్మెంట్లు జరిపినట్లు సమాచారం. -
నయీం మరో కీలక అనుచరుడి అరెస్టు
-
అయ్యన్నఅనుచరుడిపై కేసు నమోదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచరుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంత్రికి సన్నిహితుడంటూ చెప్పుకుంటున్న స్వరూప్ అనే వ్యక్తి స్ధానికంగా ఉండే బిల్డర్ వంశీ అనే వ్యక్తిని బెదిరించడంతో పాటు దాడి చేసి గాయపరిచాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాదితుని ఫిర్యాదు మేరకు పోలీసులు 448, 323, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మా ప్రభుత్వమే ఉంది...జాగ్రత్త
టీ డీపీ నేత అనుచరుడి హల్చల్ కైకలూరు : చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్న చందంగా....అధికార పార్టీ నాయకుల పేరు చెప్పుకుని అనుచరగణం అక్రమాలకు తెరదీస్తున్నారు. పైనున్నది మా ప్రభుత్వమేనని, మాట వినకపోతే మీ పని అయిపోతుందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కైకలూరు ముస్లిలకు చెందిన ఓ సొసైటీ చెరువు వివాదంలో టీడీపీకి చెందిన ఓ నాయకుని ప్రధాన అనుచరుడు జోక్యం చేసుకుంటున్నాడు. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆటపాక సమీపంలోని కోమటిలంక గ్రామంలో 70 ఎకరాలను ఫక్రూద్ధిన్ అలీ అహ్మద్ సొసైటీకి కేటాయించారు. మొత్తం 89 మంది సభ్యులున్నారు. అప్పట్లో అందరూ కలసి చేపల చెరువును తవ్వుకున్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఈ చెరువును ధ్వంసం చేశారు. సొసైటీ చెరువులను తిరిగి పంపిణీ చేసే అవకాశం ఉందని తెలియడంతో ఎప్పటికప్పుడు ఆడిట్ చేయిస్తూ రెన్యూవల్ చేసుకున్నారు. సొసైటీ ప్రారంభంలోని సభ్యులు మరణిస్తే వారి భార్యలు, వారసులను సభ్యులుగా చేర్చుకున్నారు. వీరిలో ఎక్కువ మంది వితంతువులున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నాయకుని అనుచరుడు మరో 20 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు. దీనిపై సభ్యులు ప్రశ్నిస్తే మంత్రి, ఎంపీల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు. దీంతో శనివారం సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ సర్ధార్ సభ్యులతో కలసికైకలూరు చిన్నమసీదులో సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్న వ్యక్తినిసభ్యులందరూ ఎదుర్కోవాలని తీర్మానం చేశారు. సొసైటీ చెరువు తవ్వకం సమయంలో జైలు శిక్ష సైతం అనుభవించిన వారున్నారన్నారని, అటువంటి వారి కుటుంబ వారసులు సభ్యులుగా ఉండగా మరోకరిని సభ్యులుగా చేర్చడం సబబు కాదని నిర్ణయించారు. దీనిపై త్వరలో కార్యచరణ రూపొందించి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. -
ముండే అభిమానులపై పోలీసుల లాఠీచార్జీ