
న్యూఢిల్లీ: అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ తక్లా(57)ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతడు గురువారం దుబాయ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత ముంబై తరలించి బాంబు పేలుళ్ల కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడిని మార్చి 19 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. నిఘా వర్గాల ప్రయత్నాల ఫలితంగానే యూఏఈ ఫరూక్‌ను భారత్‌కు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబై బాంబు పేలుళ్లకు పాల్పడి దేశం నుంచి పరారయిన నిందితులకు ఫరూక్ సహాయకారిగా దోహదపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment