ఎక్స్‌లో 10 కోట్ల ఫాలోవర్లు.. మోదీకి మస్క్‌ అభినందనలు | Elon Musk Congratulates PM Narendra Modi For 100 Million Followers On X, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

ఎక్స్‌లో 10 కోట్ల ఫాలోవర్లు.. మోదీకి మస్క్‌ అభినందనలు

Published Sat, Jul 20 2024 2:48 PM | Last Updated on Sat, Jul 20 2024 4:18 PM

elon musk Congratulates PM NarendraModi for 100 million followers on x

ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఇలాన్‌మస్క్‌ ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారంది.

‘అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు’ అని మస్క్‌ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్‌ చేశారు. మోదీకి ఎక్స్‌లో 100.1 మిలియన్ల(10 కోట్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనే మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆ సందర్భంగా ప్రధాని..‘ఎక్స్‌లో వంద మిలియన్లు! ఈ శక్తివంతమైన మాధ్యమంలో చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను ఆదరించినందుకు సంతోషంగా ఉంది’ అని పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: విండోస్‌లో సైబర్‌ అటాక్‌..? స్పష్టతనిచ్చిన సీఈఓ

ప్రపంచంలోనే ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తులు

  • ఇలాన్‌మస్క్‌ 189 మిలియన్లు

  • బరాక్‌ ఒబామా 131 మిలియన్లు

  • క్రిస్టియానొ రొనాల్డో 112 మిలియన్లు 

  • జస్టిన్‌ బీబర్‌ 110 మిలియన్లు

  • రిహన్నా 108 మిలియన్లు

  • కాటిపెర్రీ 106 మిలియన్లు

  • నరేంద్రమోదీ 100 మిలియన్లు

  • టేలర్‌ స్విఫ్ట్‌ 95.3 మిలియన్లు

  • డొనాల్డ్‌ ‍ట్రంప్‌ 87.5 మిలియన్లు

  • లేడీ గగా 83.1 మిలియన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement