![Narendra Modi met with Tesla CEO Elon Musk at Blair House in Washington, DC](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/musk01.jpg.webp?itok=VzLSDcm1)
అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్‌లో సమావేశమయ్యారు. మోదీ ట్రంప్‌తో చర్చలకు ముందు మస్క్‌ను కలిశారు. ఈ సమావేశం ఇండియా-యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యాపార సంబంధాల భవిష్యత్తుపై ఊహాగానాలను రేకెత్తించింది.
వ్యాపార సంస్కరణలకు భారత్ మద్దతు
సమావేశం అనంతరం ఇరువురి మధ్య చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయని మోదీ తెలిపారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. వ్యాపార సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన(మినిమం గవర్న్‌మెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్)’ అనే భావనను మోదీ హైలైట్ చేశారు. మోదీతో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలను వెంటపెట్టుకొని వచ్చారు. ఆ చిన్నారులతో మోదీ కాసేపు ముచ్చటించారు.
వ్యాపార ఆసక్తులు, అవకాశాలు
ఈ సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీకి దేశం ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నందున ఇండియాలోకి టెస్లా ఉత్పత్తులను తీసుకురావడానికి ఈ చర్చలు దారితీసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_456.jpg)
ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కార్మిక శాఖ అధికారుల విచారణ
భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం
ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సహకారానికి మోదీ-మస్క్ మధ్య జరిగిన సమావేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్, సుపరిపాలనలో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలను కూడా ఈ చర్చల్లో ప్రస్తావించినట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment