Elon Musk Starts Following Narendra Modi's Twitter, Netizens React - Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీని ఫాలో అవుతున్న మస్క్.. వైరల్ అవుతున్న నెటిజన్ల కామెంట్స్

Published Mon, Apr 10 2023 6:33 PM | Last Updated on Mon, Apr 10 2023 7:30 PM

Elon musk starts following narendra modi  twitter netizens react - Sakshi

అపర కుబేరుడు.. ట్విటర్, టెస్లా సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్విటర్‌లో ఫాలో అవడం మొదలుపెట్టారు. ట్విటర్‌లో 134.3 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగిన మస్క్ కేవలం 195 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న ప్రముఖుల జాబితాలో ఎలాన్ మస్క్ కూడా ఒకరు కావడం గమనార్హం.

భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్విటర్లో 87.7 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు మస్క్ మోదీని ఫాలో అవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ఫాలోవర్ అప్‍డేట్‍లను పోస్ట్ చేసే 'ఎలాన్ అలర్ట్స్' అకౌంట్ నుంచి ఓ ట్వీట్ పోస్ట్ అయింది. నరేంద్ర మోదీని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్నారంటూ అందులో ఉంది.

చాలా రోజుల తరువాత ప్రధాని మోదీని మస్క్ ఫాలో అవడం ప్రారంభించటంతో నెటిజన్లలో చర్చ మొదలైంది. కొంత మంది త్వరలో టెస్లా ఇండియాకు రానుందా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కొంతమంది మోదీ ప్రపంచంలోని గొప్ప నాయకులలో ఒకరు, కాబట్టి మస్క్ ఫాలో అవుతున్నదంటూ వారి అభిప్రాయాలను వెల్లడించారు. 

మొత్తానికి ఇది భారతదేశంలో టెస్లా రావడానికి సూచనగా భావిస్తున్నారు. గతంలో కూడా మస్క్ టెస్లా కార్లను ఇండియాకు దిగుమతి చేసి విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే మన దేశంలో అధిక పన్నులపై అసంతృప్తి వ్యక్తం చేసి ఒకడుగు వెనక్కి వేశారు. అప్పట్లో దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరాడు. కానీ దీనికి ఇండియా ఒప్పుకోలేదు. 

బీబీసీ ట్విట్టర్ ఖాతాకు గవర్నమెంట్ ఫండెండ్ మీడియా అనే లేబుల్ ఇచ్చిన తర్వాత భారత ప్రధాని మోదీని మస్క్ ఫాలో కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. దీని తరువాత మస్క్ ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఇది అందరిలోనూ ఒక ప్రశ్నను లేవనెత్తింది. దీనిపైన మస్క్ ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement