బిలినీయర్ ఇలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్) మే 26 నుంచి జూన్ 15 మధ్య భారతదేశంలో ఏకంగా 194053 ఖాతాలను నిషేధించినట్లు పేర్కొంది. కంపెనీ నియమాలను పాటించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ తన ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా ఖాతాలను తొలగించింది. వచ్చిన మొత్తం ఫిర్యాదులలో 12570 భారతదేశం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇందులో సెన్సిటివ్ అడల్ట్ కంటెంట్, వేధింపులు వంటి వాటికి సంబంధించినవి మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మస్క్.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఫోటోను ఇతరులకు కనిపించకుండా కూడా చేసింది. ఇది యూజర్ గోప్యతను మెరుగుపరుస్తుంది. రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 194053 ఖాతాలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment