ఇలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (Twitter) తన ప్రీమియం ప్లస్ ధరల పెంపును ప్రకటించింది. డిసెంబర్ 21 నుంచే ప్రపంచంలోనే చాలా దేశాల్లో ప్రీమియం ప్లస్ ధరలను పెంచిన ఎక్స్.. ఇప్పుడు తాజాగా భారత్‌లోనూ పెంచినట్లు వెల్లడించింది.
ఇప్పటికే ప్రీమియం ప్లస్ (Premium Plus) ప్లాన్ ఎంచుకున్న వారు మినహా.. మిగిలినవారు కొత్త ధరల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. యునైటెడ్ స్టేట్స్‌లో.. నెలవారీ ప్రీమియం ప్లస్ రేటు 16 డాలర్ల నుంచి 22 డాలర్లకు పెరిగింది. అదే సమయంలో వార్షిక చందా కూడా 168 డాలర్ల నుంచి 229 డాలర్లకు చేరింది.
భారత్‌లోనూ ఈ ప్రీమియం ప్లస్ ధరలు రూ. 1,300 నుంచి రూ. 1,750కి పెరిగింది. అంటే ఈ ధరలు 35 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. యాన్యువల్ సబ్‌స్క్రైబర్‌లు కూడా ఇప్పుడు 18,300 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ధరల పెరుగుదలకు ముందు.. యాన్యువల్ సబ్‌స్క్రైబర్‌లు రూ. 13,600 మాత్రమే చెల్లించాల్సి ఉండేది.
పెరిగిన ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ప్రీమియం ప్లస్ ధరలు పెరిగినప్పటికీ.. భారతదేశంలో బేసిక్, స్టాండర్డ్ ప్రీమియం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఈ ప్లాన్స్ సబ్‌స్క్రైబర్‌లు మునుపటి మాదిరిగానే 243 రూపాయలు, 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో
ప్రస్తుత సబ్‌స్క్రైబర్‌ల ధరల నిర్మాణాన్ని కూడా ఎక్స్ స్పష్టం చేసింది. మీ తదుపరి బిల్లింగ్ సైకిల్ 20 జనవరి 2025లోపు ప్రారంభమైతే, మీరు పాత ధరనే చెల్లిస్తే సరిపోతుంది. ఆ తరువాత కొత్త రేటు వర్తిస్తుంది. సర్వీస్‌ల పెంపుదల కారణంగానే ధరల పెంచినట్లు సంస్థ వెల్లడించింది. ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రైబర్‌లు యాడ్-ఫ్రీ బ్రౌజింగ్‌ను పొందవచ్చు. అంతే కాకుండా గ్రోక్ ఏఐ చాట్‌బాట్, రాడార్ వంటి కొత్త ఫీచర్‌లకు యాక్సెస్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment