ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్ | Twitter Announces Paid Super Follows to Let You Charge For Tweets | Sakshi
Sakshi News home page

క్రియేటర్స్ కోసం ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్

Published Sun, Feb 28 2021 8:39 PM | Last Updated on Sun, Feb 28 2021 8:54 PM

Twitter Announces Paid Super Follows to Let You Charge For Tweets - Sakshi

ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియా గురుంచి తెలియని వారు అతితక్కువలో ఉంటారని చెప్పుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో ఎక్కువ శాతం ఈ సోషల్ మీడియాకు బానిస అయిన వారే. అయితే, ఈ సోషల్ మీడియా ద్వారా కొందరు తమ సమయాన్ని వృథా చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా, ట్విటర్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకోని వస్తుంది. ఈ ‘సూపర్ ఫాలో’ ఫీచర్ ద్వారా యూజర్లు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోస్తుంది.

ఈ కొత్త ఫీచర్‌తో ట్విటర్ యూజర్లు సరికొత్త వీడియోలు, ప్రత్యేకమైన కంటెంట్, తాజా సమాచారం, ప్రత్యేక ఫోటోలు, ఇతర ఆసక్తికర విషయాలను షేర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఒక ట్విటర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేసే ప్రత్యేకమైన ఈ సమాచారం.. అతని అభిమానులు చూడాలంటే తప్పనిసరిగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వారు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా వారు చెల్లించే ఫీజు ద్వారా ట్విట్టర్ యూజర్లు మనీ సంపాదించవచ్చు. ఇక సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది. సబ్‌స్క్రైబ్ చేసుకోని వారు ఈ కంటెంట్‌ను చూడలేరు. ఇలాంటి ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్ 'జాయిన్' అనే పేరుతో ఉంది.

చదవండి:

ఫేస్‌‘బుక్‌'కు అమెరికా కోర్టు షాక్‌ 

వాట్సాప్‌ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement