వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ | WhatsApp New feature: Now users Can Mute Videos Before Sending | Sakshi
Sakshi News home page

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

Published Thu, Nov 19 2020 1:10 PM | Last Updated on Thu, Nov 19 2020 2:18 PM

WhatsApp New feature: Now users Can Mute Videos Before Sending - Sakshi

వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో ఫీచర్ ని తీసుకురాబోతుంది. వీడియోలను ఇతరులకు పంపే ముందు మ్యూట్ చేయడం కోసం ఈ ఫీచర్ ని తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ అనేది ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల తీసుకొచ్చిన మాదిరిగానే ఉండనుంది. ఈ ఫీచర్ గురుంచి వాట్సాప్ తన బ్లాగ్ లో పేర్కొంది. తాజా ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. భవిష్యత్ లో దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ ఈ ఫీచర్ ని ఐఓఎస్ వినియోగదారుల కోసం తీసుకు వస్తారా? లేదా? అనేది తెలపలేదు.  

వాట్సాప్ తన బ్లాగ్ లో కొత్తగా తీసుకు రాబోయే ఫీచర్ యొక్క స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. సీకర్ టూల్ కింద ఈ స్పీకర్ బటన్‌ను చూపిస్తుంది. వినియోగదారులు వారి వీడియోలను పంపే ముందు వాటిని కత్తిరించడానికి అనుమతిస్తుంది. స్పీకర్ ఐకాన్ ద్వారా ఫార్వార్డ్ చేస్తున్న వీడియోలపై సౌండ్ ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ క్రొత్త ఫీచర్ అనేది ఫార్వార్డ్ చేయబడిన వీడియోలు, యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేయబడిన వీడియోలపై పనిచేస్తుంది.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement