
వైఎస్సార్‌సీపీపై తన అభిమానానికి హద్దుల్లేవని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పండ్ల వ్యాపారి దామర్ల శ్రీనివాసరావు నిరూపించాడు. దివంగత సీఎం వైఎస్సార్ వీరాభిమాని అయిన ఆయన వైఎస్సార్ మరణాంతరం వైఎస్ జగన్ అభిమానిగా కొనసాగుతున్నాడు. శ్రీనివాసరావుకు జగన్ అంటే ఎంత అభిమానమంటే తాను నిరంతరం వాడే టీవీఎస్ ద్విచక్రవాహనానికి 365 రోజులు, 24 గంటలు వైఎస్సార్‌సీపీ జెండాలు పెద్దవి ఏర్పాటు చేశాడు. వాహనానికి ముందు భాగంలో చెరగని చిరునవ్వుతో మహానేత వైఎస్సార్ ఫొటో కూడా ఉంటుంది. ఆయన కుమార్తె సైతం పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రంగులతో కుట్టించిన దుస్తులతో హాజరవుతోంది. వారి కుటుంబం జగన్‌పై అభిమానంతో పార్టీ ప్రచారం నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటుండడం నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెల్లని పొడవాటి గడ్డం పెంచి తిరిగే శ్రీనివాసరావు సందర్భాన్ని బట్టి తన గడ్డానికి వైఎస్సార్‌సీపీ జెండాలోని రంగులు వేసుకుని కనిపించడం పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment