నయీం మరో అనుచరుడి అరెస్ట్ | gang star nayeem follower arrest | Sakshi
Sakshi News home page

నయీం మరో అనుచరుడి అరెస్ట్

Published Fri, Aug 26 2016 8:06 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

gang star nayeem follower arrest

భువనగిరి: ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ మరో అనుచరుడు సగ్గర హరి అనే వ్యక్తిని పోలీసులు భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసుకు తరలించారు. నయీమ్ బాధితుడు, ఎలక్ట్రానిక్స్ అండ్ సానిటరీ షాపు యజమాని సుంచు నరహరి ఫిర్యాదు మేరకు పోలీసులు హరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సగ్గర హరి కాకినాడకు చెందిన వ్యక్తి. గత కొంత కాలంగా భువనగిరిలో స్థిరపడిన ఇతను నయీం సెటిల్మెంట్‌లలో ఇతను కీలకవ్యక్తిగా భావిస్తున్నారు. వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి నయీం ద్వారా సెటిల్మెంట్‌లు జరిపినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement