
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి ఓ కార్యకర్త పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది.. సీఎం స్వయంగా దగ్గరుండి ఓ కార్యకర్త పుట్టిన రోజు సెలబ్రేట్ చేయడం నిజంగా గ్రేటే. ఈ అరుదైన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కార్యకర్త పుట్టిన రోజు నాడు దగ్గరుండి కేట్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వివరాలు.. ఆప్ సోషల్ మీడియా టీం మెంబర్ వివేక్ పుట్టిన రోజు సందర్భంగా కేజ్రీవాల్ స్వయంగా దగ్గరుండి అతని చేత కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వివేక్ ట్విటర్‌లో షేర్ చేశాడు. దాంతో పాటు ‘ఓ సాధరణ కార్యకర్తకు ఓ ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవం’ అనే మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశాడు.
దాంతో ఈ విషయం గురించి అందరికి తెలిసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ క్రమంలో కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలే మాకున్న గొప్ప బలం. కార్యకర్తల సాయంతో మా పార్టీ దేశ సేవ చేస్తుంద’ని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment