CM KCR: కేసీఆర్‌ గుడి అమ్మబడును! | CM KCR Temple For Sale In Adilabad | Sakshi
Sakshi News home page

CM KCR: కేసీఆర్‌ గుడి అమ్మబడును!

Published Tue, Sep 21 2021 12:45 PM | Last Updated on Tue, Sep 21 2021 7:18 PM

CM KCR Temple For Sale In Adilabad - Sakshi

సాక్షి, మంచిర్యాల (ఆదిలాబాద్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టించాడు. అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేసీఆర్, కేటీఆర్‌లను కలిసే అవకాశం కూడా రాలేదని గుడిని, గుడిలోని కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్‌ కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలో గుడి కట్టించాడు.

అందులో కేసీఆర్‌ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కేసీఆర్, కేటీఆర్‌ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్‌ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్‌ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. 

చదవండి: డ్రగ్స్‌ వార్‌: రేవంత్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement