![Molestation Case Registered Against Self Styled Godman Daati Maharaj In Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/11/molestation.jpg.webp?itok=LcFWuBBP)
దాత్తి మహారాజ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో డేరా బాబా వెలుగులోకి వచ్చాడు. తానే స్వయంగా దేవుడి అవతారం అని చెప్పుకునే దాతి మహారాజ్ బాబాపై ఢిల్లీ పోలీసులు సోమవారం అత్యాచార నేరం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. మహారాజ్ ఆశ్రమం శనిధామ్‌లో రెండు సంవత్సరాల క్రితం తాను అత్యాచారానికి గురైనట్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం తనపై లైంగిక దోపిడి జరిగినప్పటికి ప్రాణ భయం వల్ల, జీవితం అల్లరి పాలవుతుందని భయపడి అత్యాచార విషయాన్ని బయటికి చెప్పలేదని ఆమె తెలిపినట్టు పోలీసు వెల్లడించారు. అలాగే ఈ బాబాకు ఢిల్లీలోని ఫతేపూర్‌లో ఆఫీసు కూడా ఉంది. ఈయన ఉత్తర భారతదేశంలోనే పాపులర్ బాబా.
Comments
Please login to add a commentAdd a comment