పంచకుల: 16 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురు దోషులుగా తేలారు. ఈ మేరకు పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇద్దరు మహిళా భక్తురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. దోషులకు శిక్షను ఈ నెల 17న ఖరారు చేయనున్నారు. దీంతో హరియాణాలోని డేరా ఆశ్రమం పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని వివరిస్తూ గుర్తుతెలియని వ్యక్తి రాసిన లేఖ 2002 అక్టోబర్‌లో ‘పూరా సచ్’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత అదే పత్రికలో పనిచేస్తున్న రామ్‌చందర్ ఛత్రపతి అనే పాత్రికేయుడిని తుపాకీతో కాల్చి చంపేశారు.
Comments
Please login to add a commentAdd a comment