డేరా బాబా శిక్ష ఖరీదు రూ. 200 కోట్లు
న్యూఢిల్లీ: గుర్మీత్ రామ్ రహీమ్ బాబా అలియాస్ డేరా బాబాగా గుర్తింపు పొందిన ఆయన.. జైల్లో ఊచలు లెక్కపెట్టేందుకు అయిన ఖర్చు.. అక్షరాలా రూ. 200 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా వేలల్లో శిష్యులు కలిగిన ఆయనపై 2002లో అత్యాచారం కేసు నమోదైంది. నిజానికి గుర్మీత్ బాబాపై కేసు నమోదై.. జైలుకు వెళ్లడానికి మధ్య ఆస్తి, ప్రాణ నష్టాలు చాలా కలిగాయి.
- గుర్మీత్‌పై కేసు 15 ఏళ్ల పాటు నడిచింది. ఆయన నేరం చేశాడని నిరూపణ జరిగి.. శిక్ష పడ్డాక హర్యాన, పంజాబ్‌లలో హింస చెలరేగింది.
- 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారవడంతో చెలరేగిన హింసలో మొత్తం 32 మంది చనిపోయారు. కనీసం 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్థి నష్టం జరిగింది.
- ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు
- ఒక ప్రభుత్వ పాఠశాల, పవర్ సబ్ స్టేషన్, గోడౌన్‌లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
- గుర్మీత్‌పై శిక్ష ఖరారయ్యాక జరిగిన మొత్తం విధ్వంసంలో సుమారు 200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తాజాగా హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అంచనాకు వచ్చాయి.