సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఫార్లో పెరోల్‌పై వెళ్లి తిరిగి రాని జీవిత ఖైదీ ఒకరిపై జైలు అధికారులు పోలీసు కేసు నమోదు చేశారు. శోభన్‌బాబు అనే జీవిత ఖైదీ 18 రోజుల క్రితం పెరోల్‌పై విడుదలయ్యాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో చర్లపల్లి జైలు అధికారులు అతనిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ హత్య కేసులో పన్నెండేళ్లుగా చర్లపల్లి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. క్షమాభిక్ష లభించదని మనస్తాపానికి గురై అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఇతను నార్త్ లాలగూడకు చెందినవాడు.
Comments
Please login to add a commentAdd a comment