charlapalli jail
-
జైల్లో చిప్పకూడు తినిపిస్తా
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కాలు విరిగిందని, అధికారం పోయిందని, కూతురు జైలుకెళ్లిందని ఇన్నాళ్లూ సంయమనం పాటించామని.. సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను జానారెడ్డి టైపు కాదని.. తప్పుడు మాటలు మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. గతంలోనే తాను చెప్పినట్టు కేసీఆర్, కూతురు, అల్లుడు, కుటుంబం ఉండేట్టు అందులో డబుల్ బెడ్రూం కట్టిస్తానని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ ప్రసంగించారు. బీఆర్ఎస్తోపాటు బీజేపీపై, ఆ పార్టీల నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘ఇన్నాళ్లూ కుక్కలు మొరిగినయ్. ఇప్పుడో నక్క వచ్చింది. మొన్న సూర్యాపేటకు, నిన్న కరీంనగర్‌కు వెళ్లింది. కేసీఆర్ తననేం పీకుతారని అడుగుతున్నారు. వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? పదేళ్లుగా రాష్ట్రాన్ని పీడించి, దోచుకున్న దొంగలు వాళ్లు. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. గత ఏడాది సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ఇదే చోట సభలో ఆరు గ్యారంటీలిచ్చి తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా దేశానికి ఐదు గ్యారంటీలను రాహుల్‌గాంధీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుంది. జూన్ 9న ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎలా తొక్కారో.. అదే ఊపు, ఉత్సాహం, పట్టుద లతో బీజేపీని తొక్కడానికి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభకు వచ్చారు. వైబ్రెంట్ తెలంగాణ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తాం. మా పాలనను మీ ముందు పెట్టాం మా 100 రోజుల పాలనను మీ ముందు పెట్టాం. మేం మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమ లు చేస్తే, ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని అనుకుంటే మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు, అనుమతులు తెచ్చుకోవాలన్నా తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలు గెలవాలి. మోదీ.. గాంధీ కుటుంబం మధ్య పోరాటం.. విదేశాలు తిరుగుతూ గంటకో డ్రెస్ మార్చే మోదీ దేశ ప్రధాని కావాలో.. దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి చుట్టివస్తున్న రాహుల్ గాంధీ కావాలో తేల్చుకోవాలి. రాబోయేవి ఎన్నికలు కావు. పోరాటం. నరేంద్ర మోదీ కుటుంబం, గాంధీ కు టుంబం మధ్య పోరాటం. మోదీ కుటుంబంలో ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐ ఉన్నాయి. గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీతోపా టు ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను త్యాగం చేసిన సోనియాగాంధీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, దేశంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. నమో అంటే నమ్మితే మోసం.. రాజ్యాంగాన్ని మార్చాలనే మోదీ ప్రయత్నా లను ఆపాలంటే తెలంగాణ రాహుల్ గాంధీ వెంట నడవాలి. అసలు బీజేపీకి ఎందుకు ఓటే యాలి? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసినందుకా? రైతులను చంపినందుకా? దేశంలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టినందుకా? హైదరాబాద్‌లో వరదలు వస్తే ఈ సిగ్గులేని కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా వరద సాయం తెచ్చారా? నమో అంటే నమ్మితే మోసం. 2024 నాటికి ప్రతిపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని మోదీ చెప్పారు. మరి తెలంగాణలో ఎన్ని ఇళ్లు ఇచ్చా రో బీజేపీ నేతలు లెక్కచెప్పి ఓట్లడగాలి..’’ అని రేవంత్ డిమాండ్ చేశారు. -
తీన్మార్ మల్లన్నకు రిమాండ్.. ఆచూకీ చెప్పాలని పోలీస్ స్టేషన్‌కు భార్య..
సాక్షి, హైదరాబాద్: మేడిపల్లి పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై దాడి చేశారన్న కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నతోపాటు మరో నలుగురిని పోలీసులు బుధవారం ఉదయం హయత్‌నగర్ మేజి్రస్టేట్ ముందు హాజరు పర్చారు. మేజిస్ట్రేట్ మల్లన్నతోపాటు నలుగురు వ్యక్తులకు 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. రాత్రి అరెస్టు చేసిన మల్లన్నను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తీసుకుచ్చారు. కాగా, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే వరకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీర్జాదిగూడలో చైన్ స్నాచింగ్ నేరాలను నిరోధించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కానిస్టేబుళ్ల వద్దకు వచ్చి ఎవరు మీరు! అని ప్రశ్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా.. వినకుండా వారిని కొట్టి, లాఠీలను లాక్కొని బలవంతంగా సమీపంలో ఉన్న క్యూ న్యూస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆఫీసు ముందు తిరుగుతున్నారని, దీంతో అనుమానం వచ్చి తీసుకొచ్చామని కానిస్టేబుళ్ల గురించి మల్లన్నకు తెలిపారు. వారిని తన గదిలోకి తీసుకురావాలని మల్లన్న చెప్పడంతో లోపలికి తీసుకెళ్లి కానిస్టేబుళ్ల సెల్ఫోన్లు లాక్కొని, రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.. కర్రలతో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను పంపించారు. సీనియర్ పోలీసు అధికారులు కూడా క్యూ న్యూస్ ఆఫీసుకు చేరుకొని నిర్బంధంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను రక్షించారు. వారిని నిర్బంధించిన తీన్మార్ మల్లన్నతో పాటు క్యూ న్యూస్ ఎడిటర్ బండారు రవీందర్, డ్రైవర్ ఉప్పాల నిఖిల్, ఆఫీసు బాయ్ సిర్రా సుధాకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చింత సందీప్ కుమార్‌లను అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవటంతో పాటు అక్రమంగా బంధించడం, కర్రలతో దాడి చేయడం వంటి నేరంపై ఆ ఐదుగురిపై ఐపీసీ సెక్షన్ 363, 342, 395, 332, 307 ఆర్/డబ్ల్యూ 34, సెక్షన్ 7(1) కింద కేసులు నమోదు చేశారు. నా భర్త ఆచూకీ చెప్పండి.. ఇదిలా ఉండగా తన భర్త ఆచూకీ చెప్పాలని తీన్మార్ మల్లన్న భార్య మమత మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, లాయర్లతో కలసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్ వెళ్లిన ఆమె, తన భర్తను ఎందుకు అరెస్ట్‌చేశారని, ఎక్కడికి తీసుకువెళ్లారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలని కోరారు. కాగా, పోలీసులు మల్లన్నతో ఫోన్లో మాట్లాడిస్తామని ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. చదవండి: ఆ ముగ్గురినీ ప్రాసిక్యూట్ చేయాలి -
చిన్నారుల్ని చిదిమేసిన లారీ
కుషాయిగూడ (హైదరాబాద్): సాయంత్రం 5 గంటల సమయం. పాఠశాలలు వదిలేశారు. ఒకేచోట ఉన్న మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాము రోజూ వచ్చే ఆటోలో ఎక్కారు. అందరిలోనూ ఇంటికి వె ళుతున్న సంతోషం. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలోనే ఘోరం.. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడి పల్టీలు కొట్టింది. పిల్లలు చెల్లా చెదురుగా పడిపోయారు. అమ్మా అంటూ ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇద్దరు విద్యార్థినులు అక్కడి కక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రక్తం మడుగులు కట్టింది. చర్లపల్లి చలించిపోయింది. స్థానికు లు హుటాహుటిన చిన్నారుల్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థినులు మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. కుషాయిగూడ పోలీ స్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లకు చేరతారనగా.. చర్లపల్లి ప్రాంతానికి చెందిన తన్మయి (13) కోమలిత (11), రిషిప్రియ, రిషి వల్లభ్, రిషి కుమార్, వర్ణిక ఈసీఐఎల్‌లోని శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్రభారతి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరంతా రోజూ ఒకే ఆటోలో స్కూళ్లకు వచ్చి వెళ్తుంటారు. రోజులానే గురువారం ఉదయం కూడా స్కూల్‌కు వచ్చి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆటో బయలుదేరిన పది నిమిషాలకు, కాసేపట్లో ఇళ్లకు చేరతారనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చక్రిపురం చౌరస్తా మీదుగా చర్లపల్లి జైలు దాటి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ (ఏపీ 28 టీడీ 0599) అదుపుతప్పి పిల్లలతో వెళ్తున్న ఆటోను (టీఎస్ 34 టీ 4311) వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నారా యణ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తన్మయి (13), శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కోమలిత (11) చనిపోగా మిగతా నలుగురు గాయపడ్డారు. రవీంద్రభారతి స్కూల్లో 7వ తరగతి చదువుతున్న వర్ణిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వినోద్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘోర దుర్ఘటనతో చర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
చర్లపల్లి జైలులో రాజాసింగ్.. పీడీ యాక్ట్ రివోక్‌పై ప్లాన్ ఫలిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో రాజాసింగ్‌కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలులో ఉగ్రవాద ఖైదీలున్న నేపథ్యంలో రాజాసింగ్‌ను ప్రత్యేక బ్యారెక్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. రాజాసింగ్‌పై నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను రివోక్ చేసేందుకు ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రాజాసింగ్ అరెస్ట్‌లో పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం కీలకంగా మారనుంది. పీడీ యాక్ట్ ప్రపోజర్స్ను అడ్వైజరీ బోర్టు కమిటీ పరిశీలించనుంది. నెలలోపు రాజాసింగ్‌ను అడ్వైజరీ కమిటీ విచారించనుంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను ఆయన లాయర్లు ములాఖత్ ద్వారా ఇప్పటికే కలిశారు. కాగా, పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు మూడు నెలలు లేదా ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లలో పోలీసులు.. 2,573 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏడాది కాలంలో 664 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్ కొనసాగుతోంది. రాజాసింగ్ అభిమానులు, హిందూ సంఘాలు.. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. ఇక, భైంసాలో బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! -
గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డు బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి బెడ్‌షీట్‌ను తాడుగా ఉపయోగించి.. ఆస్పత్రి వెనుక వైపు గల గేటు దూకి వీరు పరారైనట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులో ఉన్న ఖైదీల వార్డులో కరోనా సోకిన 19 మందికి వైద్యం అందిస్తున్నారు. వారిలో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు చెందిన ఖైదీలు అబ్దుల్ అర్బాజ్ (21), సోమసుందర్ (20), మహ్మద్ జావీద్ (35), పార్వతీపురం నర్సయ్య (32)లను బుధవారం పోలీసులు చేర్చారు. గురువారం చేపట్టిన తనిఖీల్లో నలుగురు ఖైదీలు తక్కువగా ఉండటంతో అన్ని వార్డుల్లో గాలించారు. ప్రిజనర్స్ వార్డు బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడంతో ఈ నలుగురు ఖైదీలు పరారైనట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఉన్నతాధికారులకు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలోని చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీపై పోలీసులు స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నట్లు తెలిసింది. -
చర్లపల్లి జైలుకు ప్రొఫెసర్ కాశీం
సాక్షి, హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చింతకింద కాశీం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్ విచారణ ముగిసింది. విచారణ నిమిత్తం ఆయనకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశీంను సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాశీం అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నివాసంలో ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచిన విషయం తెలిసిందే. అనంతరం ఈ పిటిషన్‌పై ఆయన నివాసంలోనే విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించారు. (ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్టు) విచారణ అనంతరం ఆయన న్యాయవాది మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌పై హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసాం. కోర్టు ఆదేశాల మేరకు చీఫ్ జస్టీస్ ముందు హాజరు పరిచారు. కశీం ఇంటిపై సోదాలు చేసి అరెస్ట్ చేసిన విధానంపై వాదనలు వినిపించాము. 2016 లో నమోదైన కేసును ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ మధ్య కాలంలో ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులపై అక్రమ అరెస్ట్‌లకు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాము.’ అని తెలిపారు. -
దిశ నిందితులకు సండే స్పెషల్
కుషాయిగూడ: వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో అరెస్టయి..చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులకు జైలు అధికారులు సండే స్పెషల్ రుచి చూపించారు. జైలులోని మహానంది బ్యారక్‌లో వేర్వేరు గదుల్లో ఉన్న నిందితులు మహమ్మద్ బాషా, బొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్‌కుమార్‌లకు జైలు అధికారులు ఆదివారం ఉదయం పులిహోర, మధ్యాహ్నం సాధారణ భోజనం, రాత్రి మాంసాహారం అందజేశారు. జైల్లో కూడా వారిపై దాడి జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆయా బ్యారక్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం కూడా బ్యారక్ల వద్దకే పంపారు. వారు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదని, తప్పు చేశామనే పశ్చాత్తాపం వారిలో కన్పిస్తోందని జైలు అధికారులు తెలి పారు. జైల్లోని ఇతర ఖైదీలు దాడి చేసే అవకాశం ఉండటంతో పాటు షాక్‌లో ఉన్న నిందితులు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం కూడా ఉందని, అందుకే వారిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు జైలు అధికారులు ప్రకటించారు. -
చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను తమకు అప్పగించాంటూ కొంత మంది యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంత్తాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను నిలువరించేందుకు జైలు వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను హైసెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచినట్లు జైలు అధికారుల సమాచారం. కాగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కొంత సమయం క్రితమే నిందితులను చర్లపల్లికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో జైలు వద్దకు ముందుగానే భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలని ధర్నాకు దిగారు. లేనిపక్షంలో వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. -
పెరోల్‌పై వెళ్లిన ఖైదీ అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఫార్లో పెరోల్‌పై వెళ్లి తిరిగి రాని జీవిత ఖైదీ ఒకరిపై జైలు అధికారులు పోలీసు కేసు నమోదు చేశారు. శోభన్‌బాబు అనే జీవిత ఖైదీ 18 రోజుల క్రితం పెరోల్‌పై విడుదలయ్యాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో చర్లపల్లి జైలు అధికారులు అతనిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ హత్య కేసులో పన్నెండేళ్లుగా చర్లపల్లి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. క్షమాభిక్ష లభించదని మనస్తాపానికి గురై అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఇతను నార్త్ లాలగూడకు చెందినవాడు. -
చర్లపల్లి జైలు అధికారిపై ఖైదీ దాడి!
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరతంపై ఓ ఖైదీ దాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిలో గాయపడి చెయ్యి విరిగిన జైలు అధికారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా దాడి జరగలేదని పెనుగులాట మాత్రమే జరిగిందని జైలు పర్యవేక్షణాధికారి ఎం.ఆర్. భాస్కర్ అంటున్నారు. అసదుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో పదేళ్ల జైలు శిక్షపడిన మహ్మద్ పహిల్వాన్ అనుచరుడు అహ్మద్‌బీన్ సౌద్ జైల్లోని స్వర్ణముఖి బ్యారక్‌లో ఉంటున్నాడు. అతను సెల్‌ఫోన్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న జైలు అధికారులు అతనిపై నిఘా పెట్టారు. అందులో భాగంగా ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరతం ఆకస్మిక తనిఖీ చేసి సెల్‌ఫోన్‌ను గుర్తించారు. ఆ సెల్‌ఫోన్‌ను స్వా ధీనం చేసుకునే క్రమంలో అహ్మద్‌బీన్ సౌద్ విచక్షణ కోల్పోయి దశరతంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దశరతం చెయ్యి విరగడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. ఈ నెల 1న ఆయన చేతికి శస్త్ర చికిత్స చేశారు. ఇదంతా జరిగి 10 రోజులు గడుస్తున్నా విషయం బయటకు తెలియకుండా జైలు అధికారులు గుట్టుగా వ్యవహరించారు. ఈ ఘటనపై జైలు పర్యవేక్షణాధికారి భాస్కర్‌ను వివరణ కోరగా దాడి జరగలేదని, సెల్ స్వాధీనం చేసుకునే క్రమంలో పెనుగులాట జరిగిందంటూ సమాధానం చెప్పడం గమనార్హం. సెల్ఫోన్లు, మద్యం బాటిళ్లు జైల్లోకి ఎలా వచ్చాయి? అహ్మద్‌బీన్ సౌద్ ఉంటున్న బ్యారక్‌లో సెల్‌ఫోన్‌తో పాటు మద్యం బాటిళ్లు కూడా లభ్యమైనట్లు తెలిసింది. ఇంత సెక్యూరిటీ ఉన్నా జైలులోకి నిషిద్ధ వస్తువులు ఎలా ప్రవేశించాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు చర్లపల్లి జైలు పర్యవేక్షణాధికారి భాస్కర్ తెలిపారు. -
చంచల్‌గూడకు భానుకిరణ్
హైదరాబాద్: మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సూరి హత్య కేసులో అరెస్ట్ అయిన తరువాత భానుకిరణ్ నాలుగేళ్ళుగా చర్లపల్లి జైలులోనే ఉంటున్నాడు. అయితే జైలు కేంద్రంగా భాను పలు అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో ఈ రోజు మధ్యాహ్నం భానుకిరణ్ ను చంచల్ గూడకు తరలించారు. మరో వైపు భానుకు ప్రాణహాని ఉండటంతో ప్రత్యేక బ్యారక్ ను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. -
జైళ్లో ఐఎస్డీ సౌకర్యం లేదు: డీఐజీ నరసింహా
-
'భత్కల్ 27 సార్లు మాట్లాడాడు'
యాసిన్ భత్కల్ మొత్తం 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ తెలిపారు. భత్కల్ తన భార్యతో మాట్లాడిన అంశాలు బహిర్గతం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భత్కల్ వద్ద సెల్‌ఫోన్ ఉందన్న మాట అవాస్తవమని చెప్పారు. అతడు తన తల్లితోను, భార్యతోను జైలు ఫోన్ నుంచే మాట్లాడాడన్నారు. నిబంధనల ప్రకారం భత్కల్ మాట్లాడిన ప్రతి కాల్‌ను రికార్డు చేశామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలందరికీ ల్యాండ్ లైన్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఆ ఫోను వాడుకోడానికి కూడా మొదట్లో తాము భత్కల్‌కు అనుమతి ఇవ్వలేదని.. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారంలో రెండుసార్లు ఫోన్ మాట్లాడుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. అది కూడా ఒక్కోసారి 5 నిమిషాలు మాట్లాడేందుకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. భత్కల్ మొత్తం 27 సార్లు మాట్లాడాడని వివరించారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారాన్ని ఎన్ఐఏ తమకు ఇవ్వలేదని డీఐజీ నరసింహ చెప్పారు. అయితే తాజాగా వెల్లడైన అంశాల నేపథ్యంలో చర్లపల్లి జైలుకు అదనపు భద్రత కల్పిస్తున్నామని ఆయన అన్నారు. -
నాకు బెయిల్ వచ్చింది.. కేసీఆర్ కు జ్వరం వచ్చింది
-
నాకు బెయిల్ వచ్చింది.. కేసీఆర్ కు జ్వరం వచ్చింది: రేవంత్
ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీసం తిప్పారు. అభిమానుల కోలాహలం మధ్య భారీ ఊరేగింపుగా ఆయన చర్లపల్లి జైలు నుంచి పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. వచ్చే 30 ఏళ్లు తాను కేసీఆర్ మీదే పోరాటం చేస్తానని, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని అన్నారు. తనకు బెయిల్ రావడంతో కేసీఆర్ కు జ్వరం వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌తో పాటు మంత్రులను కూడా నేరుగా పేర్లు పెట్టి మరీ దూషించారు. తనపై పోలీసులను, ఏసీబీని ప్రయోగించారని.. తనపై పెట్టిన కేసు కుట్రపూరితమని ఆయన అన్నారు. తెలంగాణ అంతా తిరిగి కేసీఆర్ చేసిన తప్పులను ఎండగడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. 'కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనను ఎత్తిచూపినందుకే నాపై కుట్ర పన్ని కేసులో ఇరికించారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం లేకుండా చేస్తా..అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తనను ఏమీ చేయలేరనన్నారు. బుధవారం ఓటుకు కోట్లుకేసులో చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం తొడగొట్టి, మీసాలు మెలేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేక కేసులో ఇరికించారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 'రెండు పెగ్గులు తాగితే కాని మాట్లాడలేని కేసీఆర్‌కు అంతా తొత్తులుగా మారారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తున్నావు.. దమ్ముంటే వారితో రాజీనామాలు చేయించి పోటీ చేయించు. వారు గెలిస్తే ముక్కు నేలకు రాస్తా' అని సవాలు విసిరారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని కలలు కంటున్నారని, కానీ టీడీపీకి రేవంత్‌రెడ్డి ఉన్నాడని పేర్కొన్నారు. 'ఒడ్డూ పొడుగు ఉన్న హరీశ్‌రావుకు మెదడు మోకాళ్లలో ఉంది. మామ చేసిన బ్రోకర్ దందాలు ఆయనకు తెలియవా? అవినీతి.. అవినీతి.. అంటున్న కేసీఆర్‌కు నిజామాబాద్‌లో కొడుకు చేస్తున్న ఇసుక మాఫియా గురించి తెలియదా' అని ప్రశ్నించారు. సన్నాసులంతా తాగుబోతు పక్కన చేరారు. మందులో సోడా పోసే వాళ్లంతా మంత్రులయ్యారు అని విమర్శించారు. పార్టీ అభిమానుల కోలాహాలం మధ్య రేవంత్‌రెడ్డి.. చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచే టీడీపీ శ్రేణులు జైలు వద్ద హంగామా చేశాయి. సాయంత్రం జైలు నుంచి విడుదలైన తర్వాత అభిమానులు అందజేసిన గండ్ర గొడ్డలిని పట్టుకొని గాల్లో తిప్పారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ మహిళ అధ్యక్షురాలు బండ్ర శోభారాణి జైలు వద్ద రేవంత్‌కు స్వాగతం పలికారు. -
జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల
-
జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. బుధవారం సాయంత్రం రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వద్దకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో అక్కడ హడావుడి వాతావరణం నెలకొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కూడా విడుదల చేశారు. మంగళవారం హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పూచీకత్తు ఏసీబీ కోర్టులోనే ఇవ్వాలని స్పష్టం చేస్తూ తీర్పు కాపీని సవరించింది. తీర్పు కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్ ఆర్డర్ కాపీలు తీసుకుని చర్లపల్లి జైలుకు వెళ్లి అధికారులకు సమర్పించారు. కాసేపటి తర్వాత రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ఉదయసింహా, సెబాస్టియన్‌కు బెయిల్ మంజూరు చేసింది. -
చర్లపల్లి జైలు వద్దకు రేవంత్ కుటుంబసభ్యులు
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు చర్లపల్లి జైలు వద్దకు వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు రావడంతో జైలు వద్ద హడావుడి నెలకొంది. మంగళవారం హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా బెయిల్ ఆర్డర్లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పూచీకత్తు ఏసీబీ కోర్టులోనే ఇవ్వాలని స్పష్టం చేస్తూ తీర్పు కాపీని సవరించింది. తీర్పు కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్ ఆర్డర్ కాపీలు తీసుకుని చర్లపల్లి జైలుకు వచ్చారు. -
రేవంత్ రెడ్డి విడుదల రేపు
ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. జైలు నుంచి విడుదల అయ్యేందుకు మాత్రం మరో రోజు వేచి ఉండక తప్పడం లేదు. కోర్టు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించకపోవడంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. దర్యాప్తు అధికారుల ముందు పూచీకత్తులు, సాక్షులను ఉంచాలని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టుకు ఏసీబీ మెమో దాఖలు చేయనుంది. ఏసీబీ మెమో ఆధారంగానే ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వనుంది. సాధారణంగా జైలు నుంచి ఖైదీలను సాయంత్రం 6 గంటలలోగానే విడుదల చేయాల్సి ఉంటుంది, అలాగే జైల్లోకి ఖైదీలను తీసుకురావడానికి కూడా అనుమతించరు. ఈలోపే మొత్తం లాంఛనాలన్నీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే, హైకోర్టు నుంచి బెయిల్ పేపర్లు ఏసీబీ కోర్టుకు చేరుకున్నా, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు మాత్రం తగిన సమయంలో ష్యూరిటీ పేపర్లు సమర్పించలేకపోయారు. దాంతో ఆయన విడుదల మరొక్కరోజు ఆలస్యం అవుతోంది. బుధవారం నాడే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. -
రేవంత్‌ను కలసిన పయ్యావుల
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం కలిశారని జైలు అధికారులు తెలిపారు. దాదాపు గంటసేపు రేవంత్‌తో వారు మాట్లాడి వెళ్లినట్లు తెలిసింది. -
మళ్లీ చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి
-
మళ్లీ చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి
ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరై.. తిరిగి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ సమయం ఉన్నా, చర్లపల్లి జైలు నగరానికి దూరంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ముందుగానే ఆయన బయల్దేరినట్లు తెలుస్తోంది. అత్యంత పటిష్ఠమైన నిఘా మధ్య రేవంత్ రెడ్డిని జైలుకు తరలించారు. ఉదయం 8.45 గంటలకు తన ఇంటి నుంచి ఎన్ కన్వెన్షన్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి, అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. గంటన్నర పాటు కుటుంబ సభ్యులతోను మరికొందరు నాయకులతోను గడిపారు. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, మరికొందరు నాయకులు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఆయనే స్వచ్ఛందంగా బయటకు వచ్చి, తనను తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనంలోకి ఎక్కారు. వెంటనే ఎస్కార్ట్ సిబ్బంది ఆయనతో పాటు జైలుకు బయల్దేరారు. రెండు గంటల సమయం ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల్లోగానే జైలుకు తిరిగి వెళ్లాలన్న నిబంధన ఉండటంతో ఆయన ముందే బయల్దేరినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకే ఆయన చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. చాలామంది ఆయనను కలిసేందుకు జైలు వద్దకు వచ్చినా, ఆయన మాత్రం ముందుగానే సాయంత్రం 5 గంటలకే జైలు లోపలకు వెళ్లిపోయారు. -
ఉత్తరాన తీహార్..దక్షిణాన చర్లపల్లి
హైదరాబాద్: ఖైదీలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సేవలు అందేలా చూస్తున్న చర్లపల్లి సెంట్రల్ జైలుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. దక్షిణ భారత దేశంలోని జైళ్ల పనితీరుపై క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ మూడు మాసాలు అధ్యయనం చేసింది. కేంద్రకారాగారంలోని ఖైదీల సంక్షేమానికి అమలవుతున్న పథకాలు, అక్కడి వసతులు, అధికారుల పనితీరు, ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ సర్టిఫికెట్ అందజేశారు. దక్షిణ భారత దేశంలో చర్లపల్లి సెంట్రల్ జైల్ గుర్తింపు పొందగా, ఉత్తర భారత దేశంలో తీహార్ జైలుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా చర్లపల్లి జైలు అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. (కుషాయిగూడ)