ఉత్తరాన తీహార్..దక్షిణాన చర్లపల్లి
హైదరాబాద్: ఖైదీలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సేవలు అందేలా చూస్తున్న చర్లపల్లి సెంట్రల్ జైలుకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది. దక్షిణ భారత దేశంలోని జైళ్ల పనితీరుపై క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మూడు మాసాలు అధ్యయనం చేసింది. కేంద్రకారాగారంలోని ఖైదీల సంక్షేమానికి అమలవుతున్న పథకాలు, అక్కడి వసతులు, అధికారుల పనితీరు, ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ సర్టిఫికెట్ అందజేశారు. దక్షిణ భారత దేశంలో చర్లపల్లి సెంట్రల్ జైల్ గుర్తింపు పొందగా, ఉత్తర భారత దేశంలో తీహార్ జైలుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా చర్లపల్లి జైలు అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
(కుషాయిగూడ)