
సాక్షి, అమరావతి: ఉత్తమ పనితీరు కనబరిచిన ఏపీ గిరిజన సంక్షేమ ప్రధాన కార్యాలయం, ఏపీ గిరిజన సహకార ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సరి్టఫికెట్(ఐఎస్‌వో) లభించింది. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్‌బాషా, ఏపీ గిరిజన సహకార ఆరి్థక సంస్థ ఎండీ ఇ.రవీంద్రబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
పలు పథకాల అమలు, నిర్వహణ, సేవలు తదితర అనేక అంశాలపై హైమ్ ఇంటర్నేషనల్ సరి్టఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్(హైదరాబాద్) సంస్థ మదింపు(ఆడిట్) చేసి ఈ ఐఎస్‌వో సరి్టఫికెట్‌ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విజయవాడలోని ఈ రెండు ప్రధాన కార్యాలయాలు ఉత్తమ పనితీరుతో అంతర్జాతీయ గుర్తింపు పొందడం వరుసగా ఇది మూడో ఏడాది అని రంజిత్‌బాషా, రవీంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment