iso certificate
-
ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్వో సర్టిఫికెట్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్వో 9001: 2015 సర్టిఫికెట్ లభించింది. వైద్య, విద్య రంగాల్లో సేవలందించినందుకు గాను హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఐఎస్వో 9001: 2015 సర్టిఫికెట్ ప్రకటించింది. వైద్య విద్యా సేవల నాణ్యతపై రెండో సర్వే తర్వాత ఐఎస్వో ధ్రువీకరణ పత్రాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌కు చెందిన శివయ్య శనివారం అందజేశారు. ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల సంవత్సరంలో ఐఎస్వో 9001:2015 సర్టిఫికెట్ రావడంపై ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికెట్ ఏడాది కాలం పాటు వ్యాలిడిటితో జారీ చేశారు. హెచ్‌వైఎం మొదటి సారి 2022 ఆగస్టు 16వ తేదీన జారీ చేశారు. రెండోసారి ఇప్పడు ధ్రువీకరణ పత్రం అందించారు. -
AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు
పులిచెర్ల(కల్లూరు)/చిత్తూరు జిల్లా: వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించింది. సాగుకు సరైన సమయంలో సాయం అందించాలని ఆర్బీకే సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అన్నదాతలకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించింది. రైతాంగానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తలలో నాలుకగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సర్కారు ఆశయాలను మతుకువారిపల్లె రైతు భరోసా కేంద్రం అందిపుచ్చుకుంది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విశేష సేవలందిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచి ఐఎస్ఓ గుర్తింపు సాధించింది. చదవండి: ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు బాబూ? మండలంలోని మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి విశిష్ట గుర్తింపు లభించింది. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కింది. అన్నదాతలకు అవసరమైన సలహాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందుల పంపిణీ, పండించిన పంటల మార్కెటింగ్, అత్యుత్తమ నాణ్యతా సౌకర్యాలు భవనం తదితరాలను ఐఎస్ఓ ప్రామాణికంగా తీసుకుంది. విశిష్ట పురస్కారం సాధించిన మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సేవలు.. సౌకర్యాలు మతుకువారిపల్లెలో 1,180 మంది రైతులు ఉన్నారు. సుమారు 715 హెక్టార్ల భూమి సాగులో ఉంది. గ్రామంలో అధికంగా మామిడి, మిరప, చెరుకు, వరి, టమాట పంటలను సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2020 మే 30వ తేదీన మతుకువారిపల్లెలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించింది. దీని పరిధిలో మూడు పంచాయతీలను చేర్చింది. ఈ ఆర్బీకే భవనంలో డిజిటల్ లైబ్రరీ, వ్యవసాయ సంబంధిత పుస్తకాలు, టీవీ అందుబాటులో ఉంచింది. దీనికితోడు ఆర్బీకేలో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంటు రైతులకు చిత్తశుద్ధితో సేవలందించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలను పొలాల సందర్శనకు తీసుకువచ్చి రైతులకు సలహాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పథకాలను పారదర్శంగా అర్హులందరికీ పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుభరోసా సొమ్ము అన్నదాతలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి పంటకు రక్షణ కల్పిస్తున్నారు. భూసార పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించి ఏ సమయంలో ఏయే పంటలు సాగు చేయాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తగ్గిన వ్యయం.. పెరిగిన దిగుబడి మతుకువారిపల్లె రైతులు గతంలో ఎరువుల కోసం పీలేరు, సదుం, కల్లూరుకు వెళ్లేవారు. ఇందుకోసం అదనంగా ఒక్కో రైతుకు రూ.200 నుంచి రూ.500 వరకు ఖర్చయ్యేది. అయితే రైతుభరోసా కేంద్రంలోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులోకి రావడంతో అదనపు వ్యయం తప్పింది. కియోస్క్ మిషన్ ద్వారా ఎరువులు, మందుల వివరాలతోపాటు మార్కెట్ ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు లభించింది. ఆర్బీకే సిబ్బంది పనితీరు కారణంగా గ్రామంలోని రైతులు మంచి ఫలితాలను సాధించారు. ఆధునిక పనిముట్ల వినియోగంతో అధిక దిగుబడి పొందుతున్నారు. వ్యవసాయానికి అండగా నిలిచి, అన్నదాతల ఆరి్ధకాభివృద్ధికి సహకరిస్తూ, అత్యుత్తమ సేవలందిస్తున్న మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రాన్ని ఐఎస్ఓ ప్రశంసించింది. ఉత్తమ సరి్టఫికెట్‌ను ప్రదానం చేసింది. సిబ్బంది కృషిని అభినందించింది. సకాలంలో ఎరువులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి. బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు మా పొలాలను సందర్శించి సలహాలు అందిస్తున్నారు. మా ఆర్బీకే ఇప్పుడు ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉంది. – సి.రాణి, రైతు, మతుకువారిపల్లె జగనన్నకు కృతజ్ఞతలు రైతుభరోసా కేంద్రాల ద్వారా మాకు ఇన్ని సేవలందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు. ఆర్బీకే సిబ్బంది మాకు ఎప్పడూ అందుబాటులో ఉంటారు. ఒక పర్యాయం రైతుభరోసా సొమ్ము రాకపోతే వెంటనే ఆధార్ అనుసంధానం చేయించి నగదు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆధునిక పనిముట్ల వినియోగంపై మాకు అవగాహన కల్పించారు. – పి.తాతప్ప, రైతు, బోడిరెడ్డిగారిపల్లె ఆనందంగా ఉంది మా రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ సరి్టఫికెట్ రావడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మేం పనిచేశాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన బాటలో నడిచాం. అన్నదాత ఎప్పుడూ నష్టపోకూడదు అనే సంకల్పంతో విధులు నిర్వర్తించాం. ఆర్బీకే ద్వారా సకాలంలో సేవలందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మా కష్టానికి గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాం. –రోహిణి, వ్యవసాయ అసిస్టెంట్, మతుకువారిపల్లె ఆర్బీకే -
సింహాచలం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
-
శ్రీశైల దేవస్థానానికి ఐఎస్వో గుర్తింపు
శ్రీశైలం టెంపుల్: భక్తులకు వైద్య ఆరోగ్య పరంగా కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతున్న రక్షణ చర్యలకుగాను శ్రీశైల దేవస్థానానికి ఐఎస్వో (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ ధ్రువీకరణ (ఐఎస్వో–45001) లభించింది. అలాగే క్షేత్రపరిధిలో పారిశుధ్య నిర్వహణ, కోవిడ్ నిబంధనల అమలు తదితర చర్యలకుగాను జీహెచ్‌పీ (గుడ్ హైజెనిక్ ప్రాక్ట్రీసెస్) ధ్రువీకరణ కూడా లభించింది. ఈ మేరకు ఆదివారం ఐఎస్వో ప్రతినిధి ఎ.శివయ్య ధ్రువీకరణ పత్రాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావుకు అందజేశారు. రాష్ట్రంలో జీహెచ్‌పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం కావడం విశేషం. చదవండి: Vijayawada: చందమామ నీలి వర్ణంలో కనువిందు ఈ సందర్భంగా ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలు ఎప్పటికప్పుడు తగు సలహాలు, సూచనలు చేస్తూ క్షేత్రాభివృద్ధికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. దేవస్థాన సిబ్బంది కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అందరి కృషితోనే ఐఎస్వో ధ్రువీకరణ లభించిందన్నారు. -
ఏపీ గిరిజన సంక్షేమానికి ఐఎస్వో సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: ఉత్తమ పనితీరు కనబరిచిన ఏపీ గిరిజన సంక్షేమ ప్రధాన కార్యాలయం, ఏపీ గిరిజన సహకార ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సరి్టఫికెట్(ఐఎస్వో) లభించింది. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్‌బాషా, ఏపీ గిరిజన సహకార ఆరి్థక సంస్థ ఎండీ ఇ.రవీంద్రబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలు పథకాల అమలు, నిర్వహణ, సేవలు తదితర అనేక అంశాలపై హైమ్ ఇంటర్నేషనల్ సరి్టఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్(హైదరాబాద్) సంస్థ మదింపు(ఆడిట్) చేసి ఈ ఐఎస్వో సరి్టఫికెట్‌ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విజయవాడలోని ఈ రెండు ప్రధాన కార్యాలయాలు ఉత్తమ పనితీరుతో అంతర్జాతీయ గుర్తింపు పొందడం వరుసగా ఇది మూడో ఏడాది అని రంజిత్‌బాషా, రవీంద్రబాబు తెలిపారు. -
శ్రీకాళహస్తి అన్నప్రసాదానికి ఐఎస్వో సర్టిఫికెట్
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో అన్నప్రసాదం నాణ్యత, శుభ్రతకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ‘ఐఎస్వో’ సర్టిఫికెట్ లభించింది. ‘హెచ్‌వైఎం’ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఐఎస్వో ధ్రువపత్రాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు, సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఆలయానికి రెండు వైపులా రూ.34 లక్షల వ్యయంతో లగేజ్ స్కానర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించి తరువాతే అనుమతిస్తామన్నారు. రానున్న రోజుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దేశంలో అత్యున్నత స్థానానికి చేర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చెప్పారు. చదవండి: మహిళా కూలీకి వజ్రం లభ్యం -
అద్భుత కళాసంపదకు దక్కిన గౌరవం: ఐకే రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్ లభించడం పట్ల రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అద్భుత కళాసంపదకు దక్కిన అరుదైన గౌరవమని కొనియాడారు. యాదాద్రి ఆలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, అర్కిటెక్ట్‌లు, శిల్ప కళాకారులకు అభినందనలు తెలిపారు. నిర్మాణ దశలోనే ఐఎస్ఓ దక్కడంతో యాదాద్రి కీర్తి మరింత పెరిగిందన్నారు. ప్రాచీన శిల్పకళా సౌందర్యం, కృష్ణశిలల నిర్మాణాలు, ఎత్తైన గోపురాలు, అద్భుతమైన కళాసంపద, తంజావూరు శిల్ప నిర్మాణ రీతి, ప్రాకారాల సౌందర్య ప్రగతి, శిల్పుల కళాసృష్టితో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తుందన్నారు. -
ముంబై రాజ్‌భవన్‌కు ఐఎస్వో సర్టిఫికెట్
ముంబై: సమర్థవంతమైన నిర్వహణకు గాను ముంబైలోని రాజ్‌భవన్‌కు ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికెట్ అందుకున్న దేశంలోని తొలి రాజ్‌భవన్ ముంబైయ్యేనని గవర్నర్ కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఏజీఎస్ఐ డెరైక్టర్ మోనా దేశాయ్ నుంచి ఐఎస్వో 9001:2008 సర్టిఫికెట్‌ను గవర్నర్ కె.శంకర్ నారాయణన్ స్వీకరించారని వెల్లడించాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది చొరవ వల్లే ఈ ఐఎస్వో సర్టిఫికెట్ లభించిందన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే పంథాను అనుసరించాలని కోరారు. సమర్థత, ప్రమాణాలు, సేవల నాణ్యతలో ఇతర సంస్థలకు రాష్ట్రంలోనే ఉన్నత కార్యాలయమైన రాజ్‌భవన్ ఉదాహరణగా ఉండాలని ఆయన అన్నారు. కాగా, దక్షిణ ముంబైలోని 50 ఎకరాల్లో పచ్చని చెట్ల మధ్య అరేబియా సముద్రం చుట్టుపక్కల ఉన్న రాజ్‌భవన్‌లో చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ హయాంలోనే విడిదిగా ఉన్న ఈ భవనాన్ని తర్వాత సమ్మర్ రెసిడెన్సీగా మార్చారు. తదనంతరం ఇది గవర్నర్ అధికార నివాసంగా మారింది. 1885 నుంచే బ్రిటిష్ హయాంలో గవర్నర్ సెక్రటేరియట్‌గా ఉపయోగించారు. ఆ తర్వాత దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది భారత, విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు సేద తీరేందుకు వినియోగించారు. ముంబైగాక నాగపూర్, పుణే, కొండ ప్రాంతమైన మహాబలేశ్వర్‌లో కూడా రాజ్భవన్లు ఉన్నాయి. వీటిని అధికార నివాసాలుగా వినియోగిస్తున్నారు.