ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ | ISO Certificate for Andhra Medical College | Sakshi
Sakshi News home page

ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌

Published Sun, Sep 3 2023 5:54 AM | Last Updated on Sun, Sep 3 2023 5:54 AM

ISO Certificate for Andhra Medical College - Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్‌వో 9001: 2015 సర్టిఫికెట్‌ లభించింది. వైద్య, విద్య రంగాల్లో సేవలందించినందుకు గాను హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఐఎస్‌వో 9001: 2015 సర్టిఫికెట్‌ ప్రకటించింది. వైద్య విద్యా సేవల నాణ్యతపై రెండో సర్వే తర్వాత ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాన్ని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌కు చెందిన శివయ్య శనివారం అందజేశారు.

ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల సంవత్సరంలో ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికెట్‌ రావడంపై ప్రిన్సిపాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికెట్‌ ఏడాది కాలం పాటు వ్యాలిడిటితో జారీ చేశారు. హెచ్‌వైఎం మొదటి సారి 2022 ఆగస్టు 16వ తేదీన జారీ చేశారు. రెండోసారి ఇప్పడు ధ్రువీకరణ పత్రం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement