ముంబై: సమర్థవంతమైన నిర్వహణకు గాను ముంబైలోని రాజ్‌భవన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్ లభించింది. అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికెట్ అందుకున్న దేశంలోని తొలి రాజ్‌భవన్ ముంబైయ్యేనని గవర్నర్ కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఏజీఎస్‌ఐ డెరైక్టర్ మోనా దేశాయ్ నుంచి ఐఎస్‌వో 9001:2008 సర్టిఫికెట్‌ను గవర్నర్ కె.శంకర్ నారాయణన్ స్వీకరించారని వెల్లడించాయి.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది చొరవ వల్లే ఈ ఐఎస్‌వో సర్టిఫికెట్ లభించిందన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే పంథాను అనుసరించాలని కోరారు. సమర్థత, ప్రమాణాలు, సేవల నాణ్యతలో ఇతర సంస్థలకు రాష్ట్రంలోనే ఉన్నత కార్యాలయమైన రాజ్‌భవన్ ఉదాహరణగా ఉండాలని ఆయన అన్నారు. కాగా, దక్షిణ ముంబైలోని 50 ఎకరాల్లో పచ్చని చెట్ల మధ్య అరేబియా సముద్రం చుట్టుపక్కల ఉన్న రాజ్‌భవన్‌లో చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి.
బ్రిటిష్ హయాంలోనే విడిదిగా ఉన్న ఈ భవనాన్ని తర్వాత సమ్మర్ రెసిడెన్సీగా మార్చారు. తదనంతరం ఇది గవర్నర్ అధికార నివాసంగా మారింది. 1885 నుంచే బ్రిటిష్ హయాంలో గవర్నర్ సెక్రటేరియట్‌గా ఉపయోగించారు. ఆ తర్వాత దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది భారత, విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు సేద తీరేందుకు వినియోగించారు. ముంబైగాక నాగపూర్, పుణే, కొండ ప్రాంతమైన మహాబలేశ్వర్‌లో కూడా రాజ్‌భవన్‌లు ఉన్నాయి. వీటిని అధికార నివాసాలుగా వినియోగిస్తున్నారు.
ముంబై రాజ్‌భవన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్
Published Tue, Feb 25 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement
Advertisement