
చెన్నై: యువ క్రికెటర్ నటరాజన్‌ను హాస్యనటుడు యోగిబాబు సోమవారం కలిశారు. ఫిజియోథెరపీ కోసం బెంగళూరులో ఉన్న నటరాజన్‌ను కలిసిన యోగిబాబు ఆయనకు కుమారస్వామి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను నటరాజన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన మిత్రుడు యోగిబాబును కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో గుర్తిండిపోయే రోజని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment