ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫితో ఇండియాకు చేరుకున్న భారత జట్టుకు దేశం యావత్తు ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయ సిబ్బందితో సహా అభిమానులు, ప్రయాణికులు వారికి ఘన స్వాగతం పలకగా.. ఇక తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూర్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అతడి కోసం రథం ఏర్పాటు చేసి.. ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.
‘‘ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి. నటరాజన్‌కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ’’ అనే క్యాప్షన్‌తో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సారి షేర్ చేశారు సెహ్వాగ్. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది.
(చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు)
Comments
Please login to add a commentAdd a comment