Virender Shewag
-
ఓటమితో మైండ్ బ్లాంక్.. టీవీ పగలగొట్టిన అభిమాని..అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు! ట్విస్ట్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అధ్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ యావత్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ విజయంతో భారత అభిమానులు ఒకరోజు ముందే దీపావళి చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి జీర్ణుంచుకోలేక ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. మ్యాచ్ అయిపోగానే కొందరు టీవీలు పగలగొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియో ఇప్పటిది కాదు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అయిపోగానే ఓ పాక్ అభిమాని తన టీవీని పగలగొట్టినట్లుగా ఇందులో కనిపించిది. దానిపైకి వస్తువును విసరడమే గాక.. కాలుతో తన్ని దాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఆ దృశ్యాల్లో ఉంది. అతడి ఆగ్రహాన్ని చూసి సెహ్వాగ్ సైటెర్లు వేశాడు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. రిలాక్స్ అవ్వండి. మేము ఇక్కడి దీపావళి టపాసులు పేల్చుతుంటే.. మీరేమో టీవీలు పగలగొడుతున్నారు. పాపం టీవీలు ఏం చేశాయి? అని రాసుకొచ్చాడు. నవ్వే ఓ ఎమోజీ కూడా పెట్టాడు. దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అయితే, నిజానికి ఇది టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్- పాక్ నాటి మ్యాచ్‌కు సంబంధించింది కాదు. 2016లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడగా.. దీనిని భారత్- పాక్ మ్యాచ్‌కు లింక్ చేసి వైరల్ చేయడం గమనార్హం. Relax Padosi , it’s only a game. Hamaare yahan Deepawali hai toh pataakhe phod rahe hain aur aap bevajah TV 📺 phod rahe hain 🤣. Nahin yaar, TV ka kya kasoor. pic.twitter.com/AvVL4fOmny — Virender Sehwag (@virendersehwag) October 23, 2022 చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
టీ20 ప్రపంచకప్.. టీమిండియా టాప్3లో కోహ్లికి నో ఛాన్స్..!
ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టాప్ 3 బ్యాటర్లను భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా టాప్ త్రీలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అనూహ్యంగా మూడో స్థానంలో భారత మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికు సెహ్వాగ్ చోటువ్వలేదు. ఇక విరాట్ కోహ్లి రెగ్యూలర్‌గా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్న సంగతి తెలిసిందే. "భారత జట్టులో చాలా మంది హార్డ్ హిట్టర్లు ఉన్నారు. కాబట్టి మ్యాచ్ ఫినిషింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. టాప్3లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఉండాలని భావిస్తున్నాను. రోహిత్ శర్మ, కిషన్ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది. ఇక కిషన్‌తో పాటు రాహుల్ ఓపెనర్‌గా వచ్చినా జట్టుకు మంచి ఆరంభం లభిస్తుంది" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుతూ.. "ఉమ్రాన్ తన అద్భుతమైన ప్రదర్శనలతో నన్ను బాగా అకట్టుకున్నాడు. అతడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి కీలక బౌలర్లతో కలిసి భారత జట్టులో భాగం కావాలి" అని సెహ్వాగ్ తెలిపాడు. చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
Ajinkya Rahane: తక్కువగా అంచనా వేశారు.. కానీ: సెహ్వాగ్
Happy Birthday Ajinkya Rahane: టీమిండియా బ్యాటర్ అజింక్య రహానే సోమవారం 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్ల నుంచి ఈ మహారాష్ట్ర ఆటగాడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే.. ఆస్ట్రేలియా పర్యటనలో.. కోహ్లి గైర్హాజరీలో క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ను గెలిపించిన తీరును ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. నాడు అవమానకర ఓటమి నుంచి పడిలేచిన కెరటంలా! గతేడాది(2020-21) ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను మట్టికరిపించి 2-1 తేడాతో గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయి తీవ్ర విమర్శల పాలైన భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. పితృత్వ సెలవు కోసం అప్పటి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి పయమనమ్యాడు. అదే సమయంలో కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ గాయాల బారిన పడి జట్టు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మెల్బోర్న్ టెస్టు నేపథ్యంలో సారథిగా బాధ్యతలు చేపట్టిన రహానే.. రహానే జట్టును ముందుకు నడిపించాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియా మెల్బోర్న్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం సమా సిడ్నీ టెస్టును డ్రా చేసుకుంది. అంతేగాక నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసి సిరీస్‌ను చేజిక్కించుకుంది. కాగా ఈ చారిత్రక విజయం త్వరలోనే బిగ్స్క్రీన్పై డాక్యుమెంట్ రూపంలో కనువిందు చేయనుంది. తక్కువగా అంచనా వేశారు.. కానీ ఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రహానెను కొనియాడుతూ బర్త్‌డే విషెస్ తెలిపాడు. ‘‘తక్కువగా అంచనా వేయబడ్డ ఎంతో మంది క్రికెటర్లలో తనూ ఒకడు. విదేశంలో టెస్టు సిరీస్ గెలిచి భారత్‌ను ముందుకు నడిపిన సారథి.. పుట్టినరోజు శుభాకాంక్షలు అజింక్య రహానే. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఆ దేవుడు నీకు శక్తినివ్వాలి’’ అని ట్వీట్ చేశాడు. ఇక రహానే సహచర ఆటగాడు, నయావాల్ ఛతేశ్వర్ పుజారా.. ‘‘హ్యాపీ బర్త్‌డే బ్రదర్.. నీకు మరిన్ని విజయాలు లభించాలి’’ అని ఆకాంక్షించాడు. అదే విధంగా బీసీసీఐ.. ‘‘192 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 8268 అంతర్జాతీయ పరుగులు.. రహానేకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ట్విటర్ వేదికగా విషెస్ తెలిపింది. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రహానేను విష్ చేశారు. చదవండి👉🏾Joe Root: వామ్మో.. ఇదేంటి? రూట్ నీకు చేతబడి తెలుసా? అదేం కాదు బ్రో.. వైరల్! చదవండి👉🏾Kohli- Rohit- Rahul: పేరు ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు ఆడాలి: భారత దిగ్గజం ఘాటు విమర్శలు When everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination. Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum - The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgH — Voot Select (@VootSelect) June 1, 2022 -
అతడు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు..
Virender Sehwag Comments on hardik pandya: టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేడు జరగబోయే ఈ ఆసక్తికర పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అతిధ్యం ఇవ్వబోతుంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. పాక్‌తో జరిగే ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చే సత్తా హార్దిక్ పాండ్యాకి ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున పాండ్యా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ కోటాలో పాండ్యా స్ధానంపై సందిగ్ధత ఏర్పడింది. అయితే సెహ్వాగ్ మాత్రం హార్దిక్‌కు మద్దతుగా నిలిచాడు. హార్దిక్ లాంటి పవర్ హిట్టర్ జట్టులో ఉండాలని సెహ్వాగ్ తెలిపాడు. “హార్దిక్ నా జట్టులో ఉంటాడు. అతడు ఎటువంటి బ్యాటర్ మనకు తెలుసు. పాండ్య మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చే సత్తా ఉన్న ఆటగాడు. అతడు అనేక సార్లు ఒంటి చేత్తో భారత్‌కు విజయాలను అందించాడు. హార్దిక్ ఫిట్‌గా ఉండి బౌలింగ్ చేసి ఉంటే.. అందరి దృష్టి అతడిపైన ఉండేది అని" సెహ్వాగ్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని సెహ్వాగ్ సూచించాడు. కాగా 2017లో జరిగిన ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమి చెందినప్పటికీ... హార్ధిక్ మాత్రం అధ్బుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టకున్నాడు. చివరసారిగా 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్య 26 పరుగులతో పాటు, రెండు కీలకమైన వికెట్లు కూడా సాధించాడు. చదవండి: IND Vs PAK: అందుకే జట్టులో మాలిక్‌కు చోటు.. అసలు కారణం చెప్పిన పాక్ కెప్టెన్ -
రథంపై నటరాజన్.. సెహ్వాగ్ రియాక్షన్
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫితో ఇండియాకు చేరుకున్న భారత జట్టుకు దేశం యావత్తు ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయ సిబ్బందితో సహా అభిమానులు, ప్రయాణికులు వారికి ఘన స్వాగతం పలకగా.. ఇక తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూర్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అతడి కోసం రథం ఏర్పాటు చేసి.. ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ‘‘ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి. నటరాజన్‌కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ’’ అనే క్యాప్షన్‌తో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సారి షేర్ చేశారు సెహ్వాగ్. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు) -
ఇంట్లో వాళ్లు మొబైల్ బిల్ కట్టలేదు: యువీ
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా ఓ సరదా ఫొటోను షేర్ చేశాడు. పెద్దగా సెల్ఫోన్లు అందుబాటులో లేని సమయంలో.. తన సహచరులతో కలిసి పబ్లిక్ టెలీఫోన్లో ఇంటికి కాల్ చేసి మాట్లాడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. సహచరులు వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్, ఆశిష్ నెహ్రాతో ఉన్న ఆనాటి జ్ఞాపకాను గుర్తు చేశాడు. ఫోటోకు యువీ ఓ సరదా క్యాప్షన్ కూడా జత చేశాడు. ‘మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేయడంతో ఇంట్లో వాళ్లు మా మొబైల్ బిల్స్ కట్టలేదు. దాంతో ఈ పరిస్థితి తలెత్తింది’అంటూ పేర్కొన్నాడు. సెల్ఫోన్లు లేని ఆ రోజులకు వెళ్దాం అంటూ రాసుకొచ్చాడు. (చదవండి: తప్పు నాదే మహా ప్రభో: యువీ) ఇక ఈ ఫొటో 2001లో టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లినప్పటిదిగా తెలుస్తోంది. న్యూజిలాండ్, శ్రీలంక, భారత్ మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్ జరిగింది. అనంతరం శ్రీలంకతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో కూడా పాల్గొంది. రెండు సిరీస్‌లను సనత్ జయసూర్య సారథ్యంలోని ఆతిథ్య జట్టు గెలుచుకుంది. యువీ షేర్ చేసిన ఫొటోపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. ‘ఫ్రీ కాల్’అటూ కామెండ్ చేశాడు. ‘శ్రీలంక నుంచి భారత్‌కు కాలింగ్ కార్డు’అంటూ యువీ సమాధానం ఇచ్చాడు. (చదవండి: జడేజాను అందుకోవడం కష్టం: రోడ్స్) View this post on Instagram When your parents don’t pay your mobile phone bill after a bad performance 😆! #throwback to days without 📱😇 @rd.nehra @virendersehwag @vvslaxman281 A post shared by Yuvraj Singh (@yuvisofficial) on May 24, 2020 at 9:08am PDT -
రంగంలోకి మరో వీరేంద్రుడు..
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ అంటే తెలియని వారుండరు. అతడు క్రీజ్‌లో ఉంటే బౌలర్లకు ముచ్చెమటలు పట్టేవి.. వీరేంద్రుడి వీర బాదుడికి బలైన బౌలర్లెందరో ఉన్నారు. సెహ్వాగ్ ఆటకు సెలవు ప్రకటించాక అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. కాని మళ్లీ ఇన్నాళ్లకు సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్‌ను గుర్తు చేస్తూ..అతని వారసుడొచ్చాడు. ఆ సంచలనం పేరే పృథ్వీ షా.. సెహ్వాగే మళ్లీ ఆడుతున్నడా ? అన్నట్లు తలపించే అతని ఆటతీరు ప్రముఖ క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. పృథ్వీ షా బ్యాటింగ్ చేసే తీరు, అతని టెక్నిక్ సెహ్వాగ్‌ను గుర్తుచేస్తున్నాయని, ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా తాను ఆడే విధానం అద్భుతంగా ఉందని ప్రముఖ క్రికెట్ దిగ్గజం, విండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా కొనియాడారు. పృథ్వీ షా, ఆడిన తొలి టెస్ట్‌లోనే చాలా పరుగులు చేశాడు. ఈ యంగ్ ప్లేయర్ భారత గడ్డ మీద చాలా బాగా ఆడాడు. అతని వయస్సు 19 సంవత్సరాలే అయినప్పటికీ.. ఐపీఎల్లో గత రెండు సీజన్ల నుంచి ఆడుతున్నందు వల్ల బాగా అనుభవం సంపాదించాడని ప్రశంసించారు. తన మీద ఉన్న అంచనాలకు తగ్గట్లు, జట్టు అవసరాల మేరకు పృథ్వీషా రాణిస్తాడని బ్రియన్ లారా ఆశాభావం వ్యక్తం చేశారు. పృథ్వీషా గత ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ ద్వారా ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో పృథ్వీ సెంచరీ చేయడం లారాను ఎంతగానో ఆకట్టుకుంది. అతని నాయకత్వంలోనే 2018లో అండర్-19 భారత జట్టు నాలుగోసారి వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
పంత్ ఇప్పుడే వద్దు: సెహ్వాగ్
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్ వరకు సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని జట్టులో కొనసాగల్సిందేనని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో పంత్‌ను వన్డేల్లోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ ఇండియా టీవీతో మాట్లాడుతూ.. ‘ధోనిని కాదని ఇప్పుడే యువ వికెట్ కీపర్ పంత్‌ను ఆడిస్తే ప్రపంచకప్ వరకు అతను కేవలం 10 నుంచి 15 వన్డేలు మాత్రమే ఆడగలడు. ఇది ధోనితో పోల్చితే చాలా తక్కువ. ధోనికి 300 వన్డేలాడిన అనుభవం ఉంది. అతని సేవలు ఈ వరల్డ్‌కప్ టోర్నీలో జట్టుకు ఎంతో అవసరం. పంత్ అలవోకగా సిక్స్‌లు కొట్టగలడు. కానీ ధోని సింగిల్ హ్యాండ్‌తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడన్న విషయం మర్చిపోవద్దు. మంచి ఫామ్‌లో ఉన్న పంత్ ఇంకొంతకాలం నిరీక్షించక తప్పదు’. అని వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్ సందర్భంగా ధోని బ్యాటింగ్ శైలిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. -
దటీజ్ కోహ్లి!
బర్మింగ్‌హామ్ : ఇంగ్లండ్ గడ్డపై చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ... గత పర్యటన నాటి ఆటగాడిని కానని నిరూపిస్తూ... టెయిలండర్ల సాయంతో ఒంటిరి పోరాటం చేస్తూ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల నుంచి సాధారణ క్రికెట్ అభిమాని వరకు కోహ్లిని కొనియాడక ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘దటీజ్ కోహ్లి’ అంటూ తమ అభిమాన క్రికెటర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ‘అత్యంత కీలకమైన సమయంలో నీ పోరాటం అమోఘం.. ఈ అద్భుత సెంచరీ సాధించిన నీకు అభినందనలు..ఈ టెస్ట్ సిరీస్‌ను గొప్పగా ఆరంభించారు’ -సచిన్ టెండూల్కర్ ‘కోహ్లి నుంచి అద్భుత సెంచరీ. 2014లో అతని 10 ఇన్నింగ్స్‌లో సాధించిన పరుగులను ఈ సిరీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సాధించాడు. షమీ, ఇషాంత్, యాదవ్‌లతో 99 పరుగులు జతవ్వగా.. వారి స్కోర్ 8 పరుగులే కాగా.. మిగతావన్నీ కోహ్లియే సాధించడం అద్భుతం’- వీరేంద్ర సెహ్వాగ్ ‘వాట్ ఏ ప్లేయర్.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించాడు. కోహ్లి కెరీర్లోనే ఇది ఓ గొప్ప సెంచరీ. ఇదో గొప్ప ఇన్నింగ్స్’-మహ్మద్ కైఫ్ ‘కోహ్లి..సెన్సెషన్ల్ బ్యాటింగ్.. సిరీస్‌కు గొప్ప ఆరంభం’- సురేశ్ రైనా ‘నా కల నిజమైంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ సందర్భం నన్ను కనువిందు చేసింది. కోహ్లి సెంచరీ సాధించగా.. మ్యాచ్‌కు హాజరైన అనుష్కశర్మ స్టాండ్స్‌లో నుంచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందిస్తుంటే.. కోహ్లి తమ వెడ్డింగ్ రింగ్ చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిపోయింది’- ఓ అభిమాని I REMEMBER SAYING TO @ViratAnushka15 that I want anushka to be present for 1st test and want virat to score century in front of her . today that happened 😊 virat scored 149, anushka was there in the stands ,kissed wedding ring, blew kiss to her through bat #ViratKohli #ENGvIND pic.twitter.com/20kWyaXH6X — VIRAT KOHLI 😍FANGIRL 😍 (@prakathiram) August 2, 2018 ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఇది కోహ్లికి ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్ట్ సెంచరీ కాగా.. కెరీర్లో 22వ సెంచరీ. భారత బ్యాటింగ్ ఆర్డర్ అంతా కుప్పకూలిన టెయిలండర్ల సాయంతో కోహ్లి పోరాడాడు. దీంతో భారత్ 274 పరుగులు చేయగలిగింది. చదవండి: 'సర్' విరాట్ -
ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది: సెహ్వాగ్
న్యూఢిల్లీ: తనకు వీడ్కోలు టెస్టు ఆడే అవకాశం రాలేదన్న బాధ ఎప్పటికీ మదిని తొలుస్తూనే ఉంటుందని భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనతో ముందుగానే చెప్పి ఉంటే వీడ్కోలుపై ఒక నిర్ణయం తీసుకునే వాడినని పేర్కొన్నాడు. తన వీడ్కోలులో భాగంగా ఒక టెస్టు ఆడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్నాడు. ఇండియన్ టీవీ షో 'ఆప్ కీ అదాలత్' తో మాట్లాడిన సెహ్వాగ్.. ఢిల్లీలో చివరి టెస్టు ఆడేందుకు ఒక అవకాశం ఇవ్వమని సెలెక్టర్లను అడిగినా ఇవ్వలేదని పేర్కొన్నాడు. తాను ఆడుతుండగానే రిటైర్మెంట్ కావాలనుకున్నానని.. అలా జరగకపోవడంతో అది ఎప్పటికీ వెలితిగానే ఉండిపోతుందని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా జీవితంలో ఆట అనేది ఒక భాగంగా సాగింది. ఎప్పటి వరకూ ఆడాలి.. ఎప్పుడు రిటైర్మెంట్ కావాలి అనేది ముందుగా ఊహించుకోలేకపోయా. ఎప్పుడైతే నన్ను జట్టులోంచి తొలగించారో అప్పటివరకూ రిటైర్మెంట్ ఆలోచన రాలేదు. ఈ కారణం చేతనే నా వీడ్కోలు కార్యక్రమం ఇలా జరిగింది 'అని సెహ్వాగ్ తన మనసులో బాధను బయటపెట్టాడు.