ధోని, పంత్
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్ వరకు సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని జట్టులో కొనసాగల్సిందేనని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో పంత్‌ను వన్డేల్లోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ ఇండియా టీవీతో మాట్లాడుతూ..
‘ధోనిని కాదని ఇప్పుడే యువ వికెట్ కీపర్ పంత్‌ను ఆడిస్తే ప్రపంచకప్ వరకు అతను కేవలం 10 నుంచి 15 వన్డేలు మాత్రమే ఆడగలడు. ఇది ధోనితో పోల్చితే చాలా తక్కువ. ధోనికి 300 వన్డేలాడిన అనుభవం ఉంది. అతని సేవలు ఈ వరల్డ్‌కప్ టోర్నీలో జట్టుకు ఎంతో అవసరం. పంత్ అలవోకగా సిక్స్‌లు కొట్టగలడు. కానీ ధోని సింగిల్ హ్యాండ్‌తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడన్న విషయం మర్చిపోవద్దు. మంచి ఫామ్‌లో ఉన్న పంత్ ఇంకొంతకాలం నిరీక్షించక తప్పదు’. అని వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్ సందర్భంగా ధోని బ్యాటింగ్ శైలిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment