క్లబ్ ప్రియారీ ఫైర్ అనే పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్ ఖాళీ సమయంలో క్లబ్ ప్రియారీతో మాట్లాడుతూ.. ధోని, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు.
నన్ను నవ్వించగలిగేది అతనే..
రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ.. టీమిండియాలో నన్ను ఎవరైనా నవ్వించగలరంటే అది పంత్ మాత్రమే. అతన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటాడు. నాకు నవ్వుకోవాలని అనిపించిన ప్రతిసారి అతనితో మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి నవ్వించేస్తాడు.
వికెట్ల వెనక పంత్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అందరూ పగలబడి నవ్వుతారు. అయితే కారు ప్రమాదం కారణంగా పంత్ అమూల్యమైన కెరీర్‌ను మిస్ కావడం నన్ను చాలా బాధించింది. ఇప్పటికైనా అతను బెస్ట్ అంటూ హిట్‌మ్యాన్ కితాబునిచ్చాడు.
ధోనిని ఒప్పించడం చాలా కష్టం.. డీకే అయితే ఈజీ
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం చాలా మంది రిటైర్డ్ క్రికెటర్లు (పాకిస్తాన్) తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనే అంశంపై మాట్లాడుతూ.. రిటైర్మెంట్ వెనక్కు తీసుకోమని ధోనిని ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే అతను బాగా అలసిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో అతన్ని రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని వరల్డ్‌కప్ ఆడమని అడగలేం. అడిగినా అతను ఒప్పుకోడు. ఇదే విషయంలో దినేశ్ కార్తీక్‌ను ఒప్పించడమయితే చాలా సులువే అని హిట్‌మ్యాన్ అన్నాడు.
శభాష్ డీకే.. వరల్డ్‌కప్ ఆడాలని ఉన్నట్లుంది..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ధోని, దినేశ్ కార్తీక్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారని రోహిత్ కితాబునిచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ డీకేను సరదాగా ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కార్తీక్ హిట్టింగ్ చేస్తుండగా రోహిత్ సరదాగా చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. శభాష్ డీకే.. టీ20 వరల్డ్‌కప్‌కు సెలెక్ట్ కావాలని అడుతున్నట్లుంది. నీ మైండ్‌లో కూడా ఇదే నడుస్తున్నట్లుందని రోహిత్ డీకేను ఆటపట్టించాడు.
ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది..
ఇదే సందర్భంగా రోహిత్.. ధోని ముంబైతో ఆడిన ఇన్నింగ్స్‌పై (4 బంతుల్లో 20 నాటౌట్) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది. నాలుగు బంతులు ఆడి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతన్ని ఇన్నింగ్స్ తమ ఓటమిని శాశించింది. ధోని చేసిన 20 పరుగులే తమకు వారికి వ్యత్యాసం అంటూ గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment