ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టాప్ 3 బ్యాటర్లను భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా టాప్ త్రీలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అనూహ్యంగా మూడో స్థానంలో భారత మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికు సెహ్వాగ్ చోటువ్వలేదు. ఇక విరాట్ కోహ్లి రెగ్యూలర్‌గా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్న సంగతి తెలిసిందే.
"భారత జట్టులో చాలా మంది హార్డ్ హిట్టర్‌లు ఉన్నారు. కాబట్టి మ్యాచ్ ఫినిషింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. టాప్3లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఉండాలని భావిస్తున్నాను. రోహిత్ శర్మ, కిషన్ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది.
ఇక కిషన్‌తో పాటు రాహుల్ ఓపెనర్‌గా వచ్చినా జట్టుకు మంచి ఆరంభం లభిస్తుంది" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుతూ.. "ఉమ్రాన్ తన అద్భుతమైన ప్రదర్శనలతో నన్ను బాగా అకట్టుకున్నాడు. అతడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి కీలక బౌలర్లతో కలిసి భారత జట్టులో భాగం కావాలి" అని సెహ్వాగ్ తెలిపాడు.
చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..!
Comments
Please login to add a commentAdd a comment