Virender Sehwag Comments on hardik pandya: టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేడు జరగబోయే ఈ ఆసక్తికర పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అతిధ్యం ఇవ్వబోతుంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. పాక్‌తో జరిగే ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చే సత్తా హార్దిక్ పాండ్యాకి ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున పాండ్యా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ కోటాలో పాండ్యా స్ధానంపై సందిగ్ధత ఏర్పడింది. అయితే సెహ్వాగ్ మాత్రం హార్దిక్‌కు మద్దతుగా నిలిచాడు. హార్దిక్ లాంటి పవర్ హిట్టర్ జట్టులో ఉండాలని సెహ్వాగ్ తెలిపాడు.
“హార్దిక్ నా జట్టులో ఉంటాడు. అతడు ఎటువంటి బ్యాటర్ మనకు తెలుసు. పాండ్య మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చే సత్తా ఉన్న ఆటగాడు. అతడు అనేక సార్లు ఒంటి చేత్తో భారత్‌కు విజయాలను అందించాడు. హార్దిక్ ఫిట్‌గా ఉండి బౌలింగ్ చేసి ఉంటే.. అందరి దృష్టి అతడిపైన ఉండేది అని" సెహ్వాగ్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని సెహ్వాగ్ సూచించాడు. కాగా 2017లో జరిగిన ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ఓటమి చెందినప్పటికీ... హార్ధిక్ మాత్రం అధ్బుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టకున్నాడు. చివరసారిగా 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్య 26 పరుగులతో పాటు, రెండు కీలకమైన వికెట్లు కూడా సాధించాడు.
చదవండి: IND Vs PAK: అందుకే జట్టులో మాలిక్‌కు చోటు.. అసలు కారణం చెప్పిన పాక్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment