brisbane test
-
AUS Vs SA 1st Test: ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్ ఖతం
గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగినప్పటికీ.. సఫారీలతో పోలిస్తే ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించగలిగింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (96 బంతుల్లో 92; 13 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆట తొలి రోజు 15 వికెట్లు నేలకూలిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఓవర్‌నైట్ స్కోర్ 145/5 వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 73 పరుగులు జోడించి 218 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్ 3, నోర్జే 2, ఎంగిడి ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. పాట్ కమిన్స్ (5/42), మిచెల్ స్టార్క్ (2/26), స్కాట్ బోలాండ్ (2/14), నాథన్ లయోన్ (1/17) ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ను సఫారీ ఏస్ పేసర్ రబాడ వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (2), డేవిడ్ వార్నర్ (3), స్టీవ్ స్మిత్ (6), ట్రవిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైప్పటికీ 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడంతో ఆసీస్ గెలుపొందింది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. -
నిప్పులు చెరిగిన పేసర్లు.. తొలి రోజే 15 వికెట్లు
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. -
అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్
సిడ్నీ: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనో పటిష్టమైన రాతి గోడ అని, బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను సైతం అతను అడ్డుకోగల సమర్ధుడని, నేటి తరంలో అలాంటి క్లాస్ ఆటగాడిని చూడలేదని కొనియాడాడు. క్రీజులో అతను చూపించే ఓపికకు ఎంతటి బౌలర్ అయినా దండం పెట్టాల్సిందేనని ఆకాశానికెత్తాడు. గబ్బా టెస్ట్‌లో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యక్షంగా చూశానని, ఓ ఎండ్‌లో పుజారా, మరో ఎండ్‌లో పంత్‌ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు. తాజాగా ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ.. పుజారాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పుజారాతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదని, అయినా అతని గురించి ఎంతో తెలుసన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. ఇటీవల తమతో జరిగిన సిరీస్‌లో పుజారా అంత ప్రభావం చూపలేడని తొలుత భావించామని, కానీ సిడ్నీ, గబ్బా టెస్ట్‌ల్లో అతను బ్యాటింగ్ చేసిన తీరు చూసి అవాక్కయ్యామని తెలిపాడు. ముఖ్యంగా నాలుగో టెస్ట్‌లో పుజారా తన దేహానికి బంతులు తగిలించుకున్న విధానాన్ని చూస్తే ఎంతటివారైనా సలామ్ అనాల్సిందేనని అన్నాడు. భీకరమైన బంతులు శరీరాన్ని గాయపరిస్తే, పంటి బిగువన నొప్పిని భరించాడన్నాడు. అతనిలా జట్టు ప్రయోజనాల కోసం దెబ్బలు తగిలించుకున్న ఆటగాడిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. రాతి గోడపైకి బంతిని సంధిస్తే ఎలా ఉంటుందో, అతని డిఫెన్స్ కూడా అదేలా ఉంటుందని కొనియాడాడు. కాగా, టీమిండియా ఆటగాళ్ల అత్యద్భుత పోరాట పటిమ కారణంగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో పుజారా అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బంతులు దేహానికి తగులుతున్నా గోడలా నిలబడి, టీమిండియాకు అపురూపమైన విజయాన్ని అందించాడు. చదవండి: ICC RANKINGS: రెండో ర్యాంక్ నిలబెట్టుకున్న కోహ్లీ -
పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు..
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్, టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో అతడి పాత్ర మరువలేనిదన్నాడు. గబ్బా టెస్టులో అతడి బ్యాటింగ్ శైలి చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ మాదిరిగానే అనిపించిందని పేర్కొన్నాడు. కాగా 2020-21 ఆస్ట్రేలియా టూర్లో భాగంగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1 తేడా(ఒకటి డ్రా)తో గెలిచిన రహానే సేన అరుదైన ఘనత సాధించింది. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన నిర్ణయాత్మక చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా(56), రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) చెలరేగి ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ విషయాల గురించి మార్కస్ హారిస్ తాజాగా మాట్లాడుతూ... ‘‘మ్యాచ్ చివరి రోజు క్రికెట్ ప్రేమికులకు కన్నులపండుగే అయ్యింది. ముఖ్యంగా పంత్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, నాకు మాత్రం పుజారా పట్టుదలగా నిలబడటం నచ్చింది. అతడు బంతులను ఎదుర్కొన్న విధానం చూస్తే ఓ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్ గురించి చెబుతూ.. ‘‘పంత్ సూపర్బ్‌గా ఆడాడు. ప్రతి ఒక్కరు అతడిలో ఉన్న మ్యాజిక్‌ను చూడగలిగారు. సిరీస్ కోల్పోవడం మాకు నిరాశే మిగిల్చింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజం’’ అని మార్కస్ చెప్పుకొచ్చాడు. చదవండి: Matthew Hayden: త్వరలోనే భారత్ మునుపటిలా మారిపోతుంది! -
ఒకేరోజు 381 పరుగులు.. సాధ్యమయ్యేనా!
సాక్షి క్రీడా విభాగం: నాలుగో రోజు లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్... ‘చెపాక్’ పిచ్ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో అనేదానికి ఇదో సూచిక! దాదాపు లెగ్‌స్టంప్‌పై పడిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను తాకింది. రోహిత్ తన కాలును ముందుకు జరిపి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్ తమ బౌలర్లకంటే కూడా పిచ్‌నే ఎక్కువగా నమ్ముకొని గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది. ఇలాంటి స్థితిలో భారత జట్టు ఆఖరి రోజు ఎలాంటి వ్యూహం అనుసరించబోతోందో చూడాలి. ఒక్క రోజులో, అదీ టెస్టు మ్యాచ్ చివరి రోజు 381 పరుగులు చేయడం సాధ్యమేనా? ఓవర్‌కు 4.2 పరుగుల వేగంతో అదీ అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై చేయగలరా అనేదే ఆసక్తికరం. బ్రిస్బేన్ విజయం తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందనడంలో సందేహం లేదు. ఎలాంటి లక్ష్యం ముందున్నా బెదరకుండా సానుకూల దృక్పథంతో ఆడగలమనే నమ్మకాన్ని ఆ మ్యాచ్ కలిగించింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. అయితే ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టులో భారత్ లక్ష్యం 328 పరుగులు. చివరి రోజు 324 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో పది వికెట్లూ ఉన్నాయి. సొంత మైదానం కాకపోయినా ఆ సమయానికి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మంచి బౌన్స్‌తో షాట్లు ఆడేందుకు తగిన అవకాశం కూడా కనిపించింది. అన్నింటికి మించి పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లుగా రహానే బృందం సాహసం చేయగా, పంత్ ప్రత్యేక ఇన్నింగ్స్ జట్టును గెలిపించింది. ఇక్కడ మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఓడితే అది అవమానకరంగా భావించే పరిస్థితి కాబట్టి రిస్క్ చేయడం కష్టం. దీనిని ‘డ్రా’గా ముగిస్తే చాలు, తర్వాతి మూడు టెస్టుల్లో చూసుకోవచ్చనే ఆలోచన సహజం. మరికొందరు తాజా పరిస్థితిని 2008లో ఇదే చెన్నైలో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచిన టెస్టుతో పోలుస్తున్నారు. నాటి మ్యాచ్‌లో భారత్ విజయలక్ష్యం 387 పరుగులు కాగా... నాలుగో రోజే సెహ్వాగ్ (68 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 83) మెరుపులతో భారత్ 131 పరుగులు చేసేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆఖరి రోజు మరో 256 పరుగులే అవసరమయ్యాయి కాబట్టి సచిన్ తదితరుల పని సులువైంది. కాబట్టి దానితో ఈ మ్యాచ్‌కు పోలికే లేదు. తాజాగా బంగ్లాదేశ్‌పై కైల్ మేయర్స్ అద్భుత బ్యాటింగ్‌తో వెస్టిండీస్ గెలిచిన టెస్టులో కూడా చివరి రోజు విండీస్ విజయానికి 285 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆట మొదలు పెట్టింది. ఇలా చూస్తే ఒకే రోజు 381 పరుగులు దాదాపు అసాధ్యమే! అయితే సంకల్పానికి, పట్టుదలకు అడ్డంకి ఏముంటుంది. భారత్ కూడా తొలి బంతి నుంచి ‘డ్రా’ కోసం ప్రయత్నించకపోవచ్చు. బ్రిస్బేన్ తరహాలోనే ఒక ఎండ్‌ను పుజారా రక్షిస్తుంటే మరో ఎండ్‌లో వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా పంత్ క్రీజ్‌లో ఉన్నంత వరకైనా గెలుపే లక్ష్యంగా టీమిండియా ముందుకు వెళుతుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు కాబట్టి పరుగులు ధారాళంగా రాకపోతే తమ డిఫెన్స్‌ను నమ్ముకొని ‘డ్రా’పై దృష్టి పెట్టగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయనేది వాస్తవం. ఇంగ్లండ్ కూడా ‘బ్రిస్బేన్’ భయంతోనే గెలుపు కాకపోయినా, ఓడకపోతే చాలనే స్థితిలోకి వెళ్లింది. భారత్‌కు ఎక్కువ ఓవర్లు అందుబాటులో ఉంచకుండా పరుగులు పెద్దగా రాకపోయినా రెండో ఇన్నింగ్స్‌ను సాగదీసింది. -
తండ్రి అయ్యాక అదెంతో మేలు చేసింది: కోహ్లి
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ సెలవులు ముగించుకుని జట్టుతో కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇంగ్లాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టులో ఆడుతున్నాడు. అయితే ఏళ్ల తరబడి క్రికెటర్‌గా ఉండటం వల్ల కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలుతున్నానని తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ వీడియోలో కోహ్లి తండ్రి అయిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన కొత్త బాధ్యతల గురించి తెలియజేశాడు. డైపర్లు మార్చడం మరీ అంత కష్టమైన పనేం కాదన్నాడు. ‘‘ఏళ్లుగా క్రికెట్ ఆడటం వల్ల చాలా విషయాలను సులువుగా అర్థం చేసుకునే లక్షణం అబ్బింది. నేర్చుకున్న ప్రతి విషయంలో మాస్టర్ని కాకపోవచ్చు కానీ.. మేనేజ్ చేయగలను. ఇక రవీ భాయ్ వల్ల క్రీజులో, బయట అన్ని విషయాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగింది. పరిస్థితులకు అనుకూలంగా నన్ను నేను మార్చుకోగలగడం క్రికెట్ వల్ల సాధ్యమయ్యింది. ఇదే అంశం తండ్రి అయ్యాక నాకు బాగా పనికి వచ్చింది. డైపర్లు మార్చడం.. పాపను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకోవడం వంటి అంశాల గురించి ఇప్పడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసి డైపర్లు మార్చడం మరీ అంత కష్టమేం కాదు. అయితే ఈ పనిలో నేను ఇంకా మాస్టర్ని కాలేదు’’ అన్నాడు. A special Test series triumph in Australia A new chapter in life Return of international cricket in India DO NOT MISS: #TeamIndia skipper @imVkohli and Head Coach @RaviShastriOfc get candid. 😎👌 Watch the full interview 🎥 https://t.co/9gffUQG2I2 @Paytm #INDvENG pic.twitter.com/ISg5TzMPXn — BCCI (@BCCI) February 5, 2021 ఇక బ్రిస్బెన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత టీమిండియాకు ఏ ర్యాంక్ ఇస్తారని ప్రశ్నించగా.. ఖచ్చితంగా టాప్ అనే వెల్లడించాడు కోహ్లి. ‘‘ఎందుకంటే బ్రిస్బెన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో పోల్చితే మాకు ఎన్నో అవరోధాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని తట్టుకుని మేం విజయం సాధించాం. అందుకే టాప్ ర్యాంక్ ఇస్తానని’’ తెలిపాడు. ఇక ఈ వీడియోలో కోహ్లి, టీమిండియా కోచ్ రవి శాస్త్రిలు పలు అంశాల గురించి ముచ్చటించారు. చదవండి: నిశ్చితార్ధం చేసుకున్న సిక్సర్ల వీరుడు.. చదవండి: ‘ఏంటి కోహ్లి.. మరీ అంత పనికిరాని వాడినా’ -
'వారి ఇన్నింగ్స్ చూస్తున్నా.. అప్పుడే డాక్టర్ పిలిచారు'
చెన్నై: బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని అంత తొందరగా మరిచిపోలేం. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన జట్టు 32 ఏళ్ల ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెడుతూ టెస్టు విజయంతో పాటు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గబ్బా టెస్టులో టీమిండియా విజయానికి రిషబ్ పంత్, పుజారా పోరాటం ఎంతో కీలకమో.. సుందర్- శార్దూల్ ద్వయం తొలి ఇన్నింగ్స్‌లో నెలకొల్పిన 123 పరుగులు విలువైన భాగస్వామ్యానికి అంతే స్థానం ఉంది. వీరిద్దరే లేకుంటే గబ్బా టెస్టులో టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రిస్బేన్ టెస్టుకు సంబంధించి మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలిటెస్టుకు సన్నద్దమవుతున్న వేళ కోహ్లి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా సాధించిన చారిత్రక విజయం గురించి ఇప్పటికే చాలాసార్లు చర్చించా. అయితే ఆరోజు జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. బ్రిస్బేన్ టెస్టు సమయంలో ఆసుపత్రిలో ఉన్న నేను సుందర్.. శార్దూల్ బ్యాటింగ్‌ను నా ఫోన్లో ఆస్వాదిస్తున్నా. వారిద్దరి సమన్వయంతో 127 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడింది. వారి ఇన్నింగ్స్ చూస్తున్న సమయంలోనే నాకు డాక్టర్ నుంచి పిలుపు వచ్చింది. ఒక బిడ్డకు తండ్రి అవడం అనేది నా జీవితంలో గొప్ప అనుభూతి. అదే సమయంలో టీమిండియా చారిత్రక టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేను చెప్పిన రెండు కారణాలు విభిన్న శైలిలో ఉన్నాయి.. యాదృశ్చికంగా నా జీవితంలో రెండు ఆనందాలు ఒకేసారి పొందడం ఆనందంగా ఉన్నా.. వాటిని ఒకదానితో మరొకటి ఎన్నటికీ పోల్చలేను. నేను లేకున్నా జట్టు విజయం సాధించడం.. ఆ మ్యాచ్‌ను నేను కళ్లారా వీక్షించడంతో టీమిండియాతో అనుబంధం మాత్రం ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. చదవండి: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్ షాట్ ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మేం పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాం. పెటర్నిటీ సెలవుల అనంతరం జట్టుతో కలవడం ఆనందంగా అనిపిస్తుంది. ఆసీస్‌పై టెస్టు సిరీస్ విజయాన్ని ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాం. జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌పిప్ ఫైనల్‌కు అర్హత సాధించడమే మా కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఇక రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా తుది జట్టులో కచ్చితంగా ఆడనున్నాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో పేస్ విభాగం మరింత పటిష్టంగా తయారైంది. స్వదేశంలో బుమ్రాకు ఇదే తొలి టెస్టు అయినా.. ఇప్పటికే తనేంటో ప్రపంచానికి తెలియచేశాడు. అతని ఫామ్‌పై ఎలాంటి సందేహాలు లేవు.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. చదవండి: సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం -
'ఆరోజు బ్యాట్ పట్టుకోవడమే ఇబ్బందిగా మారింది'
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో 89* పరుగులు ఇన్నింగ్స్‌తో రిషబ్ పంత్ హీరో అవ్వగా.. అంతకుముందు 91 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విజయంలో కీలకంగా మారాడు. కానీ వీరిద్దరి మధ్య మరో కీలక ఆటగాడు ఉన్నాడు.. అతనే చతేశ్వర్ పుజారా. అతడు చేసింది 56 పరుగులే అయినా.. అవే భారత జట్టు మ్యాచ్‌ను గెలిచేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు సెషన్ల పాటు ఆసీస్ బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ వారినే అలసి పోయేలా చేశాడు. పదునైన బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 211 బంతులు ఆడాడు. ఈ క్రమంలో అతని శరీరం మొత్తం గాయాలయ్యాయి. అతను చూపిన తెగువకు టీమిండియా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే తన వేలికి గాయం కూడా అయింది. తాజాగా పుజారా బ్రిస్బేన్‌లో బ్యాటింగ్ ఆడిన తీరు గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. చదవండి: గంగూలీకి సర్జరీ.. అదనంగా రెండు స్టెంట్లు 'మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా వేలికి గాయమైంది. దీని కారణంగా సిడ్నీ, బ్రిస్బేన్లలో బ్యాటింగ్ చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. బ్రిస్బేన్‌లో మళ్లీ అక్కడే దెబ్బ తగలడంతో గాయం మరింత తీవ్రమైంది. ఆ తర్వాత కనీసం బ్యాట్ పట్టుకోవడానికి కూడా రాలేదు. నాలుగు వేళ్లతోనే బ్యాట్‌ను గ్రిప్ చేయాల్సి వచ్చింది. జట్టును ఓటమినుంచి కాపాడాలనే ప్రయత్నంలో బాధనంతా దిగమింగుకొని ఎలాగోలా ఆడానంటూ' పుజారా చెప్పుకొచ్చాడు. చదవండి: క్రికెటర్ శిఖర్ ధావన్‌పై చార్జ్‌షీట్ -
గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే
ముంబై: గబ్బాలో టీమిండియా 32 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. పింక్ బాల్ టెస్ట్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు.. 40 రోజుల వ్యవధిలో.. అదే ఆస్ట్రేలియాను బ్రిస్బెన్ టెస్ట్‌లో మట్టి కరిపించింది. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికి చారిత్రాత్మక విజయం సాధించిన బ్రిస్బేన్ టెస్ట్‌కు ప్రత్యేకతలేన్నో. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ లీవ్‌లో ఉన్నాడు.. ఇక సీనియర్ ఆటగాళ్లను గాయాలు వెంటాడాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే ఆధ్వర్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు గబ్బా వేదికగా చరిత్రని తిరగరాసింది. పింక్ బాల్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో గబ్బా విజయానికి సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తన యూట్యూబ్ చానెల్లో రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన ప్రసంగం అడిలైడ్‌లో ఎదుర్కొన్న ఓటమి నుంచి టీమిండియా అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పిందో వెల్లడించారు. (చదవండి: క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!) ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘36 ఆలౌట్ తరువాత ఏం జరిగిందో మీకు తెలియదు. అప్పుడు రవి (శాస్త్రి) భాయ్ జట్టు సభ్యులను పిలిచి ఇలా అన్నాడు.. ‘‘ఈ 36 ను మీ స్లీవ్స్‌లో బ్యాడ్జ్ లాగా ధరించండి.. ఆ ఓటమి మీలో కసి పెంచుతుంది. మీ ఆట తీరు మారుతుంది. ఇక చూడండి మీరు గొప్ప జట్టు అవుతారు’’ అన్నాడు. 40 రోజుల వ్యవధిలో రవిశాస్త్రి మాటలు నిజం అయ్యాయి. అలాగే, అడిలైడ్ టెస్ట్ అనంతరం రెండు రోజుల వ్యవధిలో మేము ఐదు సార్లు సమావేశం అయ్యాం. విరాట్ (కోహ్లీ), జింక్స్ (అజింక్య రహానె), కోచింగ్ సిబ్బంది కాంబినేషన్స్ గురించి చర్చించారు. విరాట్ కొన్ని అద్భుతమైన సూచనలు ఇచ్చాడు. వాటన్నింటి ఫలితమే ఈ విజయం’’ అన్నారు శ్రీధర్. (నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్) -
రథంపై నటరాజన్.. సెహ్వాగ్ రియాక్షన్
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫితో ఇండియాకు చేరుకున్న భారత జట్టుకు దేశం యావత్తు ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయ సిబ్బందితో సహా అభిమానులు, ప్రయాణికులు వారికి ఘన స్వాగతం పలకగా.. ఇక తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూర్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అతడి కోసం రథం ఏర్పాటు చేసి.. ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ‘‘ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి. నటరాజన్‌కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ’’ అనే క్యాప్షన్‌తో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సారి షేర్ చేశారు సెహ్వాగ్. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు) -
ఊరేగింపు... మేళతాళాలు...
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్ గెలిపించిన కెప్టెన్ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే హౌజింగ్ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. భార్యతో పాటు రహానే తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకొని నడుస్తుండగా ఇరుగు పొరుగువారు, స్థానికులు అతనిపై అడుగడుగున పూలజల్లు కురిపించారు. అనంతరం రహానేతో కేక్ కట్ చేయించి వేడుక జరుపుకున్నారు. అంతకుముందు ముంబై క్రికెట్ సంఘం రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షాలను ఘనంగా సన్మానించింది. బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్ ఢిల్లీలో హర్షధ్వానాల మధ్య ఇంటికి చేరుకున్నారు. తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూరైన ‘చిన్నప్పంపట్టి’ గ్రామస్థులంతా రథంపై ఊరేగించి బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఊరంతా పాల్గొనడం విశేషం. ఓ నెట్ బౌలర్‌గా జట్టుతో పాటు వెళ్లిన ఈ తమిళ తంబి అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. కరోనా దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రహానే, రోహిత్, శార్దుల్, పృథ్వీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ కావాలని అధికారులు సూచించారు. -
నాన్న లేని లోటు పూడ్చలేనిది: సిరాజ్
సాక్షి, హైదరాబాద్: ‘‘నాన్న లేని లోటు తీర్చలేనిది. నేను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన శ్రమ దాగి ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై వికెట్ తీసుకున్న ప్రతిసారీ నాన్నే గుర్తొచ్చారు. అక్కడి ప్రదర్శన ఆయనకే అంకితం’’ అంటూ టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. అదే విధంగా.. క్లిష్ట పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆసీస్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ హైదరబాదీ.. టూర్ ముగించుకుని నేడు నగరానికి తిరిగి వచ్చాడు. విమానాశ్రయం నుంచి నేరుగా తండ్రి మహ్మద్ గౌస్ సమాధిని సందర్శించిన సిరాజ్.. ఆయనకు నివాళులు అర్పించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ విజయం వెలకట్టలేనిదంటూ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.(చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్) కోహ్లి భాయ్ ప్రోత్సహించాడు ‘‘కష్ట సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నన్ను రీటేన్ చేసుకుంది. కోహ్లి భాయ్ నాకు అడుగడుగునా అండగా నిలిచాడు. ఒత్తిడి వీడి ఆటపై దృష్టి సారించాలని చెప్పాడు. నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఐపీఎల్ ద్వారా మంచి అనుభవం లభించింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే సంప్రదాయ క్రికెట్ ఆడటం భిన్నమైంది. ఆసీస్ పర్యటనతో సంతోషంగా ఉన్నా. నాన్న కలను నెరవేర్చాలని పట్టుదలగా ఆడాను. టీమిండియాకు ఆడుతున్నా అనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకున్నా’’ అంటూ టెస్టుల్లో అరంగేట్రానికి ముందు తను ఎదుర్కొన్న అనుభవాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ బదులిచ్చాడు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) ఫేవరెట్ వికెట్ అతడిదే.. ఇక ఆసీస్ టూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు లేకపోయినా ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. బుమ్రా నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. నాలుగో టెస్టులో తొలుత కాస్త ఆందోళనకు గురయ్యాను. కానీ తను సపోర్టు చేశాడు. నా ప్రదర్శనను ప్రశంసిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇక అజ్జూ భాయ్(అజింక్య రహానే) యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాడు. నటరాజన్, సైనీ, వాషింగ్టన్ సుందర్, నన్ను ఇలా అందరినీ ప్రోత్సహించాడు. కోహ్లి భాయ్ కెప్టెన్సీని ఎంతగా ఎంజాయ్ చేశానో.. అజ్జూ భాయ్ సారథ్యాన్ని కూడా అంతే ఆస్వాదించాను. ఇక నా ఫేవరెట్ వికెట్ గురించి చెప్పాలంటే.. మార్నస్ లబుషేన్‌దే. కీలక సమయంలో తీసిన ఆ వికెట్ నాకెంతో ప్రత్యేకం’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. (చదవండి: కీలక వికెట్లు కూల్చిన సిరాజ్.. బుమ్రా ఆలింగనం) ఇప్పుడే ఇంటికి వచ్చాను అదే విధంగా.. ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్‌కు ఎలా సన్నద్ధమవుతారు అని ప్రశ్నించగా.. ‘‘ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటి భోజనం చేశా. అలా అని రిలాక్స్ అవ్వను. షమీ, ఉమేశ్ వచ్చిన తర్వాత కూడా మార్పు ఉండకపోవచ్చు. నిజానికి మేనేజ్మెంట్ ఎలా చెప్తే అదే నేను చేస్తాను. నేను ఇప్పుడు కూడా జూనియర్‌నే. అయితే ఆసీస్ విజయం ఇచ్చిన విశ్వాసంతో ముందుకు సాగుతాను. మనసు పెట్టి ఆడతాను అంతే. కఠినశ్రమతో పాటు ఆటను గౌరవించడం నేర్చుకున్నా. నా కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇక ముందు కూడా ఇలాగే మీ మద్దతు నాకు కావాలి’’ అని ఫ్యాన్స్‌కు సిరాజ్ విజ్ఞప్తి చేశాడు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలని ఈ హైదరాబాదీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా టెస్టు సిరీస్‌లో సిరాజ్ మొత్తంగా 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. ముఖ్యంగా గబ్బాలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. టూర్లో ఉండగానే తండ్రి మరణం, ఆసీస్ ప్రేక్షకుల జాత్యహంకార వ్యాఖ్యలు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఒత్తిడి జయించి తన ప్రతిభ నిరూపించుకుని దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. -
సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు ఆడుంటే
బ్రిస్బేన్: 1988 నుంచి 32 ఏళ్ల పాటు బ్రిస్బేన్ మైదానంలో ఓటమెరుగని ఆసీస్‌కు టీమిండియా చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ ఓడిపోవడంపై మాజీ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ క్రికెట్ ఆస్ట్రేలియా తీరును తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంప్రదాయం ప్రకారం బోర్డర్ గవాస్కర్ ట్రోపీని గబ్బాలో మొదలుపెట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. ఆతిథ్య జట్టుకు 2-1తేడాతో పరాభవం జరిగేదికాదని అభిప్రాయపడ్డాడు. చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్ 'ప్రతీ ఏడాదిలో సమ్మర్ సీజన్లో ఆసీస్ ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా.. గబ్బా వేదికగానే ఆరంభమవుతుంది. కానీ ఈసారి ఆ రూల్‌కు సీఏ వ్యతిరేకంగా వ్యవహరించింది. ఒకవేళ గబ్బాలో మొదటిటెస్టు జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆసీస్‌కు గబ్బా వేదిక బాగా కలిసొచ్చిన మైదానం.. 32 ఏళ్ల పాటు అక్కడ మాకు ఓటమి అనేది తెలియదు. ఇక్కడ తొలి మ్యాచ్ జరగుంటే ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేది. కానీ సీఏ మాత్రం విరుద్ధంగా అడిలైడ్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను అడిలైడ్‌లో ప్రారంభించింది. అంతేగాక టీమిండియా ఎప్పుడు వచ్చినా గబ్బా వేదికగానే తొలి టెస్టు ఆడాల్సి ఉండేది.. దీంతో పాటు పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్(వాకా) మైదానంలో ఈసారి ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశమే నన్ను సీఏను తప్పు పట్టేలా చేసింది.'అంటూ తెలిపాడు. -
నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్
హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇక హైదరాబాద్‌కు చేరుకోగానే సిరాజ్ తొలుత తన తండ్రి మహ్మద్ గౌస్ సమాధిని సందర్శించాడు. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న తండ్రి శ్రమను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించాడు. కాగా సిరాజ్ తండ్రి ఆటోడ్రైవర్‌గా పనిచేసేవారు. కొడుకును టీమిండియా క్రికెటర్‌గా చూడాలనే కోరికతో అనేక కష్టనష్టాలకోర్చారు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ను చూసి ఎంతో మురిసిపోయారు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) అయితే, నవంబరులో మొదలైన టీమిండియా ఆసీస్ పర్యటనకు ఎంపికైన సిరాజ్ అక్కడికి చేరుకున్న కొన్ని రోజులకే, మహ్మద్ గౌస్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ సిరాజ్‌కు అనుమతి ఇచ్చినా, సంప్రదాయ క్రికెట్లో తన అరంగేట్రం కోసం కలలు గన్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. ఇక బాక్సింగ్ డే టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. టెస్టు సిరీస్‌లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్
న్యూఢిల్లీ: బ్రిస్బేన్ టెస్టులో ‘హీరో’చిత ఇన్నింగ్స్ ఆడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్ ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 691 పాయింట్లతో 13వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ను ధోనితో పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పంత్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా 2018లో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్.. అనతికాలంలోనే తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉన్నాడంటే చాలు.. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడు ప్రదర్శిస్తూ చుక్కలు చూపించేవాడు. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్ ప్రేమికులు పంత్‌ను, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోల్చేవారు. పంత్ కూడా అందుకు తగ్గట్టుగానే రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు.(చదవండి: 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..) అయితే.. పంత్ మెరుగైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకుంటాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు. టెస్టు క్రికెట్‌ను పక్కన పెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్ కీపర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేయడంతో మెల్లగా అతడికి అవకాశకాలు కూడా సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ధోని వారసుడు అంటూ పంత్‌ను ప్రశంసించిన వాళ్లే అతడి ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై అతడికి శ్రద్ధ లేదని, పంత్ బదులు సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్‌గా తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసేవారు. కానీ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌తో మరోసారి తన సత్తా ఏంటో చూపించిన పంత్.. విమర్శకుల నోళ్లు మూయించాడు. (చదవండి: స్పైడర్మాన్ అంటూ రిషభ్ పాట.. వైరల్) ఆఖరి టెస్టులో పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడి(89 పరుగులు, నాటౌట్) భారత జట్టు చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మరోసారి ధోనితో పోలిక తెచ్చి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు పంత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఆకట్టుకున్నాడు. ‘‘ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలతో పోల్చినపుడు ఎవరికైనా సరే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నేను కూడా అంతే. ఎవరైనా అలా అన్నపుడు చాలా సంతోషపడతాను. అయితే నన్ను ఎవరితోనూ పోల్చకండి. ఎందుకంటే భారతీయ క్రికెట్ చరిత్రలో నాకంటూ ప్రత్యేక స్థానాన్ని, పేరును పొందాలని భావిస్తున్నా. ఆ దిశగా దృష్టి సారించాను కూడా. నిజానికి నాలాంటి యువ ఆటగాడిని దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదు’’ అని పేర్కొన్నాడు. (చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) -
కెరీర్ అత్యుత్తమ స్థానంలో రిషభ్ పంత్
దుబాయ్: బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పంత్ 13వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 691 పాయింట్లు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో ఉండగా... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (862 పాయింట్లు)ని వెనక్కి నెట్టి ఆసీస్ ప్లేయర్ లబ్‌షేన్ (878 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత ప్లేయర్లు పుజారా ఏడో స్థానంలో, రహానే తొమ్మిదో ర్యాంకులో నిలిచారు. బౌలర్ల విభాగంలో సిరాజ్ 32 స్థానాలు మెరుగుపరుచుకొని 45వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్‌బ్రాడ్ (ఇంగ్లండ్), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)... ఆల్‌రౌండర్ల కేటగిరీలో బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్డిండీస్), జడేజా (భారత్) వరుసగా టాప్–3లో ఉన్నారు. -
'నా కొడుకు సెంచరీ చేసుంటే బాగుండేది'
బ్రిస్బేన్: ఆసీస్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకున్న క్షణం నుంచి ఇప్పటిదాకా అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఆసీస్ విధించిన 328 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి చేధించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ కడదాకా నిలిచి 89* పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంత్‌కు తోడుగా పుజారా వికెట్లు కోల్పోకుండా అడ్డు గోడగా నిలిచాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్, పుజారాలను ఆకాశానికి ఎత్తడం అందరూ గమనించారు. అయితే ఇక్కడ మరో ఆటగాడు భారత్ నాలుగో టెస్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. 91 పరుగులు చేసి భారత విజయానికి బాటలు పరిచాడు. 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న గిల్ ఇన్నింగ్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. గిల్ ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నవేళ.. గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ మాత్రం తన కొడుకు సెంచరీ మిస్ అయినందుకు బాధపడ్డాడు. 'గిల్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా క్రికెట్ చరిత్రలో కొన్ని ఏళ్ల పాటు గర్తుండిపోతుంది. నా కొడుకు ఇన్నింగ్స్ నాకు ప్రత్యేకం.. కానీ దానిని సెంచరీగా మలిచి ఉంటే ఇంకా బాగుండేది. 91 పరుగుల వరకు వచ్చి కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోవడం కాస్త బాధ కలిగించింది. అయినా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే చిరస్మరణీయ విజయంలో నా కుమారుడు భాగస్వామ్యం కావడం ఆ బాధను మరిచేలా చేసింది. అయితే గిల్ ఔటైన విధానం నన్ను కలవరపరిచింది. అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని టచ్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కానీ ఇది అతనికి మంచి అనుభవం.. రానున్న మ్యాచ్‌ల్లో ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాడని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు! గిల్ తండ్రి లఖ్వీందర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారతదేశ సగటు తండ్రి ఆవేదన ఇలాగే ఉంటుంది. ఎంతైనా ఒక కొడుకుకు తండ్రే కదా.. మీరు అలా ఆలోచించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయినా గిల్ 91 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఆనందం ముందు 100 పరుగులు మిస్ కావడం పెద్ద విషయం కాదు' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
ఆసీస్ అభిమాని నోట భారత్ మాతాకీ జై.. వైరల్
బ్రిస్బేన్: 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా కంగారుపెట్టించింది. 328 రికార్డు లక్ష్యాన్ని ఛేదించి అటు టెస్టును ఇటు సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. కీలక ఆటగాళ్లు గాయాల గండంలో చిక్కుకున్నా అద్వితీయమైన ఆటతో రహానే సేన సగర్వంగా రెండోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముద్దాడింది. ఆసమయంలో 130 కోట్ల భారతీయుల గుండె ఉప్పొంగింది. దాంతోపాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు, క్రీడా విశ్లేషకులు టీమిండియా పోరాటపటిమను కొనియాడారు. ఆసీస్ ఆటగాళ్లు, కోచ్ సైతం ఇండియన్ క్రికెటర్లను తక్కువ అంచనా వేయొద్దని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో తమ జట్టు ఓటమిపాలైనప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..) గబ్బా స్టేడియంలో అభిమానుల గ్యాలరీ నుంచి ‘భారత్ మాతాకి జై’, ‘వందే మాతరం’ అంటూ స్లోగన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియా మూడు వికెట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 369 పరుగులు చేయగా.. భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 33 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ఓవరాల్‌గా భారత్ ముందు 328 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు), రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించి భారత్‌కు విజయాన్ని అందించారు. (చదవండి: కరోనా : సానియా మీర్జా భావోద్వేగం) -
దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు!
బ్రిస్బేన్: ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై అత్యంత చెత్త రికార్డును మూట గట్టుకున్న భారత జట్టుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.అందునా తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి తిరిగి రావడంతో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రికీ పాంటింగ్, మైకెల్ వాన్, మార్క్ వా, మైకెల్ క్లార్క్, బ్రాడ్ హడిన్ లాంటి మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై వెటకారంతో మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ' కోహ్లి లేని టీమిండియాను చూడలేమని ఒకరంటే.. తొలి టెస్టులోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా పని అయిపోయిందని.. ఈసారి వైట్‌వాష్ తప్పదని.. టీమిండియాకు ఇది ఒక చీకటి సిరీస్' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది కానీ నెలరోజులు తిరగకముందే టీమిండియా 2-1 తేడాతో ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే వరుసగా రెండో సారి టెస్టు సిరీస్‌ను దక్కించుకొని ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వినూత్న రీతిలో స్పందించాడు. టీమిండియాను ఎత్తిపొడుస్తూ మాట్లాడిన మాజీ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని వారి ట్వీట్స్‌తో పాటు భారత జట్టు కప్ అందుకున్న ఫోటోను షేర్ చేస్తూ తనదైన శైలిలో చురకలంటించాడు. ‘గుడ్ ఈవ్నింగ్ గబ్బా!! ఈ మైదానంలో నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్‌ను ఎప్పటికీ మరిచిపోలేం. ఇక కొందరు దిగ్గజాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. కోహ్లి లేకుండా మేం సిరీస్‌ను గెలవలేమన్నారు. ప్రధాన ఆటగాళ్లంతా గాయపడినా కుర్రాళ్లతో కలిసి బ్రిస్బేన్ టెస్టులో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టూ ఆర్ఎల్ఎస్.. ఈక్వేషన్‌ను సరిచేశాం. దిగ్గజాలు ఇప్పుడే సమాధానం ఇస్తారో చెప్పండి' అంటూ ట్రోల్ చేశాడు.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే! కాగా మూడో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, అశ్విన్‌ల మధ్య జరిగిన సంభాషణ గురించి అందరికి తెలిసిందే. గాయంతో నాలుగో టెస్టుకు దూరమైన అశ్విన్ మూడో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న భారత్‌ను హనుమ విహారితో కలిసి ఆసీస్ భీకరమైన బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచాడు. ఒకవైపు ఆసీస్ పేసర్ల విసురుతున్న బౌన్సర్ల దాటికి నెత్తురోడుతున్న ఏ మాత్రం ఆలక్ష్యం వహించకుండా ఓపికతో ఆడిన అశ్విన్.. టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ క్రమంలోనే టిమ్ పైన్ అశ్విన్‌పై స్లెడ్జింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. 'నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్'అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.వీటికి అశ్విన్ కూడా తనదైన శైలిలో ‘మేము కూడా మిమ్మల్ని భారత్‌లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్ కావొచ్చు.'అని ధీటుగా బదులిచ్చాడు. అయితే పైన్ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ అశ్విన్‌కు క్షమాపణ కోరడంతో వివాదం సద్దుమణిగింది.చదవండి: ఆసీస్‌తో సిరీస్ : అసలైన హీరో అతనే కాగా నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 7 వికట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) దూకుడు కనబర్చగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్‌తో మెరిసాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. LHS ( not = ) RHS ! Yours happily India tour of OZ 2020/21 Humbled by all the love and support we have received over the last 4 weeks!🙏 pic.twitter.com/nmjC3znglx — Ashwin 🇮🇳 (@ashwinravi99) January 19, 2021 -
వాటే సిరీస్.. రహానే కెప్టెన్సీ భేష్: పాక్ ఫ్యాన్స్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు భారత జట్టును కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తుండటంతో టీమిండియా హాష్టాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఆసీస్ గడ్డపై భారత్ అపూర్వ విజయాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లు 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు గబ్బాలో ఓటమి రుచి చూపించిన తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పంత్, గిల్, సిరాజ్, పుజారా, వాషింగ్టన్ సుందర్, ఠాకూర్ల ప్రదర్శన అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కితాబిచ్చాడు. ఇక దాయాది దేశం పాకిస్తాన్ వాసులు సైతం భారత జట్టు విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేయడం విశేషం. రహానే కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ సానుకూల కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాటే సిరీస్.. చారిత్రాత్మక విజయం. భారత్‌కు శుభాకాంక్షలు. టీమిండియా చూపిన పట్టుదల అమోఘం. భారత జట్టు నేడు వారి క్లాస్ ఆటను చూపించింది. మీరు ఇలాగే ఆడుతూ ఉండాలి. పాకిస్తాన్ నుంచి మీకు అభినందనలు’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘ఇంతటి ఘన విజయం. రిషభ్ పంత్ అత్యద్భుతం. ఇండియా వలె పాకిస్తాన్ జట్టు కూడా మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాం’’ అంటూ మాలిక్ రెహమాన్ అనే వ్యక్తి ఆకాంక్షించారు.(చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం) ఇక మరొకరు.. ‘‘కీలక ఆటగాళ్లు లేరు కాబట్టి ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతుంది అని అంతా భావించారు. కానీ మీరు మాత్రం అద్భుత పోరాటపటిమ కనబరిచి మీ అభిమానుల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేశారు. శుభాకాంక్షలు అని మరొకరు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో #AUSvsIND పాకిస్తాన్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక పాక్ క్రీడాభిమానుల ప్రశంసలకు సానుకూలంగా స్పందించిన ఇండియన్ నెటిజన్లు.. సౌతాఫ్రికాతో జరుగబోయే సిరీస్‌కు మీకు ఆల్ ది బెస్ట్ అని విషెస్ చెబుతున్నారు. కాగా భారత్- పాక్‌ల మధ్య మ్యాచ్ అంటేనే అసలైన మ్యాచ్ అని, ప్రత్యర్థి జట్టును ఓడించడంలోనే సిసలైన మజా ఉంటుందంటూ ఇరు జట్ల అభిమానులు భావిస్తారన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఆసీస్ గడ్డపై భారత్ విజయాన్ని అభినందిస్తూ మరో ఉపఖండ జట్టు ఫ్యాన్స్ ట్వీట్లు చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. What a series, Historic Victory, Congratulations India and Many Congratulations to Team India great Fight great ComeBack, India Show their class Today... Keep it up...🏏🏏🏏🏏🏏🏏🏏 💐 From Pakistan... 🤗 #AUSvIND#AUSvsIND #AUSvINDtest pic.twitter.com/8kLxg7qoLT — Fatima Khalil Butt (@FatiMaButt_4) January 19, 2021 What a historic game 👏 I wish the Pakistan will make us proud the same way India did. Rishabh pant is amazing. #AUSvsIND pic.twitter.com/KW46IQgHLY — Malik Abdur Rehman (@immalikrehman) January 19, 2021 -
ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ పాత్ర మరువలేనిది. శుబ్‌మన్ గిల్ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు. ఈరోజు పంత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రతి భారత అభిమాని మదిలో కొన్నేళ్ల పాటు నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. కాగా నాలుగో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన పంత్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. 'నా కల నిజమైంది. నేను ఫామ్‌లో లేని సమయంలో టీమ్ నాకు మద్దతుగా నిలిచింది. తొలి టెస్ట్ తర్వాత నెట్స్‌లో చెమటోడుస్తున్నాం. టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ నాకు అండగా ఉంది. నేనో మ్యాచ్ విన్నర్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది'అని పంత్ అన్నాడు. చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం అయితే స్వతహాగా రిషబ్ పంత్ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు. 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్ ఆరంభం నుంచే తనదైన దూకుడు ప్రదర్శించేవాడు. ఫామ్‌లో ఉంటే ప్రత్యర్థి ఎవరైనా సరే పంత్ మాత్రం బాదుడే లక్ష్యంగా పెట్టుకునేవాడు. మంచి స్ట్రైక్ రేట్ కలిగిన పంత్‌కు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు నిరుపితమైంది. మ్యాచ్‌లు గెలుస్తామన్న దశలో దాటిగా బ్యాటింగ్ కొనసాగించే పంత్ అనవసర షాట్లు ఆడి వికెట్ పోగొట్టుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ ఒక్క అంశంతోనే అతను జట్టులో సుస్థిరస్థానం పొందేవాడు కాదు. వాస్తవానికి ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ మొదట రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే టెస్టు జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మొదటిటెస్టులో అంతగా ఆకట్టుకోకపోవడంతో మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీంతో పంత్ మరోసారి ట్రోల్స్ బారీన పడ్డాడు. అయితే వీటిని పట్టించుకోని బీసీసీఐ మూడో టెస్టులోనూ పంత్‌ను ఆడించింది. చదవండి: ఆసీస్‌తో సిరీస్ : అసలైన హీరో అతనే కాగా మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 97 పరుగులతో అదరగొట్టాడు. ఆసీస్ విధించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంత్ పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ఉన్నంతవరకు మ్యాచ్ టీమిండియావైపై మొగ్గుచూపింది. అయితే అనూహ్యంగా 97 పరుగులు చేసిన పంత్ అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడం.. ఆ తర్వాత అశ్విన్, విహారిలు ఓపికతో ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అయితే గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం పంత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకుండా చివరిదాకా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. కాగా పంత్ టీమిండియా తరపున 16 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.చదవండి: పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది -
విరాట్ కోహ్లి ఈజ్ బ్యాక్!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జాతీయ సెలెక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. ఇక బ్రిస్బేన్ టెస్టులో అదరగొట్టిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. దాంతోపాటు స్టాండ్ బై వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ అవకాశం లభించింది. నాలుగు గెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు చెన్నైలో ప్రారంభమవుతుంది. తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇది... భారత జట్టు: విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. (చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం) -
ఆసీస్ టూర్: సిరాజ్ నుంచి సుందర్ దాకా
అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు.. అదే అద్భుతం జరిగిన తర్వాత దానిని ఎవరూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. నిజమే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే, బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తా చాటారు. ఎన్నో అవాంతరాలు దాటి సంప్రదాయ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆ ఆటగాళ్ల నేపథ్యం, ఈ సిరీస్‌లో నమోదు చేసిన గణాంకాలు పరిశీలిద్దాం. శభాష్ సిరాజ్.. హైదరాబాదీ బౌలర్. అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి ఆటోడ్రైవర్. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్.. ఆసీస్ సిరీస్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌కు ఎంపికయ్యాడు. టూర్లో ఉండగానే అతడి తండ్రి మరణించినా.. ఆయన కలను నెరవేర్చాలనే ఆశయంతో జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. బాక్సింగ్ డే టెస్టుతో పాటు గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన హైదరాబాదీ, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. వీరితో పాటు హాజల్‌వుడ్, స్టార్క్‌ను అవుట్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. (చదవండి: 36 పరుగులకు ఆలౌట్.. కానీ ఇప్పుడు ) రూ. 300 కోసం మ్యాచ్‌లు ఆడి.. హర్యానాలోని కర్నాల్‌లో జన్మించాడు. రైట్ ఆర్మ్ మీడియం బౌలర్. అతడి తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సైనీ.. క్రికెట్లో శిక్షణ తీసుకునేందుకు సరిపడా డబ్బు లేక ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ వాటి ద్వారా వచ్చే 300 రూపాయలతో అవసరాలు తీర్చుకునేవాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనీ వన్డేల్లో రంగప్రవేశం చేశాడు. ఇక సీనియర్ పేసర్ ఉమేశ్ గాయపడటంతో సిడ్నీ టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్‌కు కలిసొచ్చిన టూర్ తమిళనాడులోని చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. నటరాజన్ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు. ఈ క్రమంలో 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ల సలహాలు నటరాజన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఆసీస్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్ మనుకా ఓవల్ మైదానంలో ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఆ తర్వాత టీ20, గబ్బా మ్యాచ్ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు. సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్, గిల్ తండ్రి సుందర్‌కు క్రికెట్ అంటే మక్కువ. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ వాషింగ్టన్ అనే వ్యక్తి ఆయనకు అండగా నిలబడ్డాడు. ప్రోత్సాహం అందించాడు. ఈ క్రమంలో స్థానికంగా సుందర్ మంచి పేరు సంపాదించారు. అయితే తన రెండో కొడుకు జన్మించే కొన్నిరోజుల ముందు వాషింగ్టన్ మరణించడంతో ఆయన జ్ఞాపకార్థం, వాషింగ్టన్ సుందర్‌గా తనకు నామకరణం చేశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ప్రవేశించాడు. గబ్బా టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సుందర్.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 21 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక సిరాజ్, సైనీ, నటరాజన్, సుందర్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 259 పరుగులతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. -
పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ విధించిన 328 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా టీమిండియాను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా) 'ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈరోజు భారత ఆటతీరు ఔట్ స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఈ ఓటమితో మాకు గుణపాఠం కలిగింది. 150 కోట్ల మంది బలమున్న టీమిండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదనేది ఈరోజే తెలిసొచ్చింది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ టీమిండియా అద్బుత ప్రదర్శనతో 2-1 తేడాతో సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. ఏది ఏమైనా ఇండియా-ఆసీస్ టెస్టు సిరీస్ మాత్రం మరుపురానిదిగా నిలిచిందనడంలో సందేహం లేదు.. మ్యాచ్‌ల్లో గెలుపోటములు అనేవి సహజం.. ఈ విజయంతో టెస్టు క్రికెట్‌కున్న విలువేంటో మరోసారి కనిపించింది. (చారిత్రాత్మక విజయం : నీతా అంబానీ ప్రశంసలు ) రిషబ్ పంత్ లాంటి ఆటగాడు టీమిండియాకు దొరకడం అదృష్టం.. అసలు ఏ మాత్రం భయం అనేది లేకుండా పంత్ సాగించిన ఇన్నింగ్స్ చూస్తే.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ హెడ్డింగేలో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చకునేలా చేసింది. శుబ్‌మన్ గిల్ కూడా మంచి బ్యాటింగ్ కనబరిచాడు. కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్‌కు టెస్టు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంది.'అని చెప్పుకొచ్చాడు. లాంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీమిండియా మ్యాచ్ గెలిచాకా లాంగర్‌కు విషయం అర్థమయినట్లుంది అంటూ కామెంట్స్ జతచేశారు. 🗣 "Pant's innings reminded me a bit of Ben Stokes at Headingley actually. 🗣 "You can never take anything for granted. Never ever underestimate the Indians." - Justin Langer talks to @haydostweets about the series #AUSvIND pic.twitter.com/lnbnjqWjmg — 7Cricket (@7Cricket) January 19, 2021 -
32 ఏళ్ల జైత్రయాత్రకు టీమిండియా చెక్
బ్రిస్బేన్: గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం ద్వారా 32 ఏళ్ల రికార్డును తిరగరాసింది. సాధారణంగానే గబ్బా మైదానం అంటేనే ఆసీస్‌కు బాగా కలిసొచ్చిన వేదిక.. 32 ఏళ్లుగా అక్కడ ఆడిన ఒక్క టెస్టులోనూ ఆసీస్ ఓడిపోలేదు. తాజాగా టీమిండియా గబ్బాలో విజయం సాధించడం ద్వారా ఆసీస్ 32 ఏళ్ల జైత్రయాత్రకు తెరదించింది. గబ్బాలో ఆసీస్ ఇప్పటివరకు 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇక 1988లో వివ్ రిచర్డ్స్ నేతృత్వంలోని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆసీస్ ఓడిపోలేదు. (చదవండి: అద్భుత విజయం: బీసీసీఐ భారీ నజరానా) అంతేగాక టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడు వందలకుపైగా స్కోర్లు చేజ్ చేసి గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. ఇంతకముందు 1975-76లో విండీస్‌పై 406 పరుగులు చేధించగా.. 2008-09 సీజన్లో ఇంగ్లండ్‌పై 387 పరుగులు.. తాజాగా గబ్బాలో ఆసీస్‌పై 329 పరుగుల లక్ష్యం చేధించి కొత్త రికార్డు సృష్టించింది. అందులోనూ ఆసీస్‌కు బాగా కలిసొచ్చిన గబ్బా వేదికలో ఇంత భారీ స్కోరు ఛేదించడం అనేది టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 2018-19 సీజన్లో ఆసీస్‌పై 2-1 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా.. 2020-21లోనూ మరోసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై వరుసగా రెండోసారి సిరీస్‌ను సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోపీని అట్టిపెట్టుకోవడం మరో రికార్డుగా చెప్పవచ్చు. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టాప్ 5 టీమిండియా ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే.. బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ : 13 వికెట్లు( 3 టెస్టులు) ఆర్ అశ్విన్ : 12 వికెట్లు( 3 టెస్టులు) జస్ప్రీత్ బుమ్రా : 11 వికెట్లు(3 టెస్టులు) రవీంద్ర జడేజా : 7 వికెట్లు(2 టెస్టులు) శార్థూల్ ఠాకూర్ : 7 వికెట్లు(1 టెస్టు) బ్యాటింగ్: రిషబ్ పంత్ : 274 పరుగులు(5 ఇన్నింగ్స్‌లు) శుబ్‌మన్ గిల్ : 259 పరుగులు(6 ఇన్నింగ్స్‌లు) పుజారా : 271 పరుగులు(8 ఇన్నింగ్స్‌లు) అజింక్యా రహానే : 268 పరుగులు(8 ఇన్నింగ్స్‌లు) రోహిత్ శర్మ : 129 పరుగులు(4 ఇన్నింగ్స్‌లు)