బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్‌గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 4, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఆసీస్ ఓపెనర్లు మార్కస్ హేరిస్ (38) డేవిడ్ వార్నర్ (48) రాణించారు. వారికితోడు స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ (37) కూడా పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించింది. ఇక టీ విరామానికి ముందు కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు మరోసారి అడ్డుతగిలాడు. దీంతో మూడో సెషన్‌లో ఆట నిలిచిపోయింది. రోహిత్ శర్మ (4), శుభ్‌మన గిల్ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది.
(చదవండి: గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం)
Comments
Please login to add a commentAdd a comment