అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అశూ అన్న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో సమయంలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.
టీమిండియా క్రికెటర్‌గా మాత్రమే
బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగానే తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. ఏదేమైనా క్రికెటర్ అశ్విన్‌గా తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని.. టీమిండియా క్రికెటర్‌గా మాత్రమే తన ప్రస్థానం ముగిసిందని పేర్కొన్నాడు. వీలైనంత కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని అశూ తెలిపాడు.
‘‘చాలా మందికి ఇదొక భావోద్వేగ సమయం. బహుశా నా మనఃస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అయితే, నేను ఇప్పుడు పూర్తి సంతృప్తితో ఉన్నాను. రిటైర్మెంట్ విషయం చాలా రోజులుగా నా మదిలో తిరుగుతూనే ఉంది. అయితే, బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతున్నపుడు నేను నిర్ణయం తీసుకున్నా.
జీరో రిగ్రెట్స్
ఇదేమీ నా జీవితంలో అతిపెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను ఇకపై కొత్త దారిలో ప్రయాణిస్తాను’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా ఒక్కసారి కూడా అవకాశం రానందుకు బాధపడుతున్నారా అని విలేకరులుగా అడగా.. ‘‘నాకు ఎలాంటి విచారం లేదు. జీరో రిగ్రెట్స్.
జీవితం, కెరీర్ పట్ల విచారంతో ఉండే వ్యక్తులను నేను దూరంగా ఉండి చూశాను. కానీ నా లైఫ్‌లో అలాంటివేమీ లేవు’’ అని అశ్విని తమ మనసులోని భావాలను వెల్లడించాడు. ఇక 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు తనకు ఘన స్వాగతం లభించిందని.. ఇప్పుడు మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారంటూ అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.
రోహిత్ అలా.. అశూ ఇలా
కాగా తాను పెర్త్‌కు చేరుకున్నపుడే అశూ రిటైర్మెంట్ విషయం తెలిసిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పగా.. అశూ మాత్రం బ్రిస్బేన్‌లోనే తాను డిసైడ్ అయ్యానని చెప్పడం గమనార్హం.
కాగా 2010లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు అశ్విన్. తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం.
సీఎస్‌కే తరఫున
ఇదిలా ఉంటే.. వన్డేల్లో 707 పరుగులు సాధించిన అశ్విన్.. టీ20లలో 184 రన్స్ రాబట్టాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(బ్రిస్బేన్) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇకపై అశూ క్లబ్ క్రికెట్‌కే పరిమితం కానున్నాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) తరఫున అతడు ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలం-2025లో చెన్నై ఫ్రాంఛైజీ.. అశూను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.
చదవండి: నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్ శర్మతో అశ్విన్
The countless battles on the field are memorable ❤️
But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌
Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc— BCCI (@BCCI) December 19, 2024
Comments
Please login to add a commentAdd a comment