గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ ఈ ముంబైకర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ సేన వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.
వరుస వైఫల్యాలు
కివీస్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గానూ రోహిత్ విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు 2, 52, 0, 8, 18, 11. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ హిట్‌మ్యాన్ బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్.. అడిలైడ్‌లో తేలిపోయాడు. ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో అతడు మొత్తంగా కేవలం తొమ్మిది (3, 6) పరుగులే చేశాడు.
ఇక కీలకమైన మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ విఫలయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం పది పరుగులే చేశాడు. కాగా ఆసీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా కాకుండా ఆరోస్థానంలో రోహిత్ బ్యాటింగ్‌కు దిగడం గమనార్హం. దీంతో మిడిలార్డర్‌లో ఆడటం కూడా రోహిత్ ప్రదర్శనపై ప్రభావం పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. సారథిగా, బ్యాటర్‌గా వైఫల్యం చెందుతున్న రోహిత్ శర్మపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో రోహిత్ పరుగులు రాబట్టేందుకు కచ్చితంగా ప్రయత్నం చేస్తాడు.
అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై!
ఒకవేళ అలా జరగనట్లయితే.. తనను తానుగా తప్పుకొంటాడు. అతడు నిస్వార్థ గుణం ఉన్న కెప్టెన్. జట్టుకు భారంగా ఉండాలని కోరుకోడు. భారత క్రికెట్ ప్రయోజనాల పట్ల అతడి అంకితభావం అమోఘం. కాబట్టి వచ్చే రెండు మ్యాచ్‌లలోనూ ఇదే పునరావృతం అయితే, కచ్చితంగా కెప్టెన్‌గా తప్పుకొంటాడు’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. తొలి టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహించగా భారత్ 295 పరుగుల తేడాతో గెలిచింది.
ఇక రెండో టెస్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా తిరిగి రాగా.. ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. తదుపరి ఇరుజట్ల మధ్య మెల్‌బోర్న్, సిడ్నీ వేదికగా నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి.
చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment