బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్లను ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.
ఆ తర్వాత మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ భారత ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అద్భుతమైన బంతితో లబుషేన్ బోల్తా కొట్టించాడు.
విరాట్ సూపర్ క్యాచ్..
ఆసీస్ ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నితీశ్ రెడ్డి రెండో బంతిని ఔట్‌సైడ్ స్టంప్ లైన్ వద్ద ఫుల్ డెలివరీగా సంధిచాడు. ఆ డెలివరీని లబుషేన్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ థిక్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఎటువంటి తప్పిదం చేయకుండా అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
క్యాచ్ పట్టిన వెంటనే విరాట్ కోహ్లి తన దైన స్టైల్లో కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. గబ్బా మైదానంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఆసీస్ అభిమానుల వైపు చూస్తూ మౌనంగా ఉండమని కోహ్లి సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను ఆసీస్ ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. అతడు మైదానంలోకి అడుగుపెట్టగానే బూయింగ్(బిగ్గరగా అరవడం) చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్ ఫ్యాన్స్‌కు కోహ్లి తన సెలబ్రేషన్స్‌తో కౌంటరిచ్చాడు.
చదవండి: తెలుగు టైటాన్స్ గెలుపు
— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024
Comments
Please login to add a commentAdd a comment