Courtesy: AP
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్, టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో అతడి పాత్ర మరువలేనిదన్నాడు. గబ్బా టెస్టులో అతడి బ్యాటింగ్ శైలి చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ మాదిరిగానే అనిపించిందని పేర్కొన్నాడు. కాగా 2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1 తేడా(ఒకటి డ్రా)తో గెలిచిన రహానే సేన అరుదైన ఘనత సాధించింది.
ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన నిర్ణయాత్మక చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా(56), రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) చెలరేగి ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ విషయాల గురించి మార్కస్ హారిస్ తాజాగా మాట్లాడుతూ... ‘‘మ్యాచ్ చివరి రోజు క్రికెట్ ప్రేమికులకు కన్నులపండుగే అయ్యింది.
ముఖ్యంగా పంత్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, నాకు మాత్రం పుజారా పట్టుదలగా నిలబడటం నచ్చింది. అతడు బంతులను ఎదుర్కొన్న విధానం చూస్తే ఓ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్ గురించి చెబుతూ.. ‘‘పంత్ సూపర్బ్‌గా ఆడాడు. ప్రతి ఒక్కరు అతడిలో ఉన్న మ్యాజిక్‌ను చూడగలిగారు. సిరీస్ కోల్పోవడం మాకు నిరాశే మిగిల్చింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజం’’ అని మార్కస్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Matthew Hayden: త్వరలోనే భారత్ మునుపటిలా మారిపోతుంది!
Comments
Please login to add a commentAdd a comment