క్రికెట్ ప్రేమికులకు చేదు వార్త!.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. వరణుడి కారణంగా బ్రిస్బేన్‌లో తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రెండో రోజు ఆట మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.20 నిమిషాలకు మొదలై.. కనీసం 98 ఓవర్లపాటు మ్యాచ్ సాగనుంది.
నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. ఇందులో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో విజయంతో సిరీస్ మొదలుపెట్టిన భారత్.. అడిలైడ్‌లో మాత్రం ఆసీస్ ముందు తలవంచింది. పింక్ బాల్ టెస్టులో మరోసారి కంగారూ జట్టు చేతిలో ఓడిపోయింది.
టాస్ ఆలస్యం
ఫలితంగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. తర్వాత కాస్త తెరిపినివ్వడంతో ఆట మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
మరోసారి వరణుడి అడ్డంకి
ఈ క్రమంలో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కొత్త బంతితో బరిలోకి దిగాడు. మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా వరుస ఓవర్లలో బౌలింగ్ చేశారు. అయితే, ఆసీస్ ఇన్నింగ్స్‌లో 13.2 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామం వరకు ఆటను వాయిదా వేశారు.
తొలిరోజు ఆట ముగిసిందిలా
కానీ.. వర్షం మాత్రం తగ్గలేదు. ఫలితంగా రెండో సెషన్ రద్దైపోయింది. అయితే, ఆ తర్వాత కూడా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. వర్షం వల్ల మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేనందువల్ల అంతటితో తొలిరోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఇక శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 19, నాథన్ మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మూడో టెస్టు(డిసెంబరు 14-18)
వేదిక: ది గబ్బా స్టేడియం, బ్రిస్బేన్
టాస్: టీమిండియా.. తొలుత బౌలింగ్
వర్షం వల్ల 13.2 ఓవర్లకే ముగిసిపోయిన ఆట
ఆసీస్ స్కోరు: 28/0
ప్లేయింగ్ ఎలెవన్
భారత తుది జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: IND Vs AUS 3rd Test: బ్రిస్బేన్ టెస్టులో మహ్మద్ సిరాజ్‌కు చేదు అనుభవం
Usman Khawaja puts away his first boundary of the day with this cracking shot off Siraj 👌#AUSvIND pic.twitter.com/xHJlbrFF8o
— cricket.com.au (@cricketcomau) December 14, 2024
Comments
Please login to add a commentAdd a comment