వర్షం ఎఫెక్ట్‌.. ఆస్ట్రేలియా- భారత్‌ మూడో టెస్టు డ్రా | Teams agree for draw after rain stops play | Sakshi
Sakshi News home page

IND vs AUS 3rd Test: వర్షం ఎఫెక్ట్‌.. ఆస్ట్రేలియా- భారత్‌ మూడో టెస్టు డ్రా

Published Wed, Dec 18 2024 11:27 AM | Last Updated on Wed, Dec 18 2024 12:59 PM

Teams agree for draw after rain stops play

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియా-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా.. 8/0 స్కోరు వద్ద వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు.

ముందుగానే టీ బ్రేక్‌ను అంపైర్‌లు ప్రకటించారు. అంతలోనే వర్షం మళ్లీ తిరిగి రావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో ఆస్ట్రేలియా, భార‌త్ స‌మంగా నిలిచాయి.

భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా మూడో టెస్టు(డిసెంబరు 14- 18)
👉వేదిక: ది గబ్బా, బ్రిస్బేన్‌
👉టాస్‌: భారత్‌.. బౌలింగ్‌
👉ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 445 ఆలౌట్‌
👉భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 260 ఆలౌట్‌

👉ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 89/7 డిక్లేర్డ్‌
👉భారత్‌ లక్ష్యం: 275 పరుగులు
👉వర్షం కారణంగా భారత్‌ స్కోరు 8/0 వద్ద ఉండగా నిలిచిపోయిన ఆట
👉ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించడంతో మ్యాచ్‌ డ్రా
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ట్రవిస్‌ హెడ్‌(తొలి ఇన్నింగ్స్‌లో 152 రన్స్‌).

చదవండి: #Ravichandran Ashwin: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన అశ్విన్‌
శెభాష్‌.. ఫాలో ఆన్‌ గండం నుంచి తప్పించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement