
బ్రిస్బేన్ : ఉత్కంఠభరిత, ఉద్విగ్న క్షణాలు... హోరాహోరీ సమరాలు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు... అన్ని కలగలిసిన టెస్టు సిరీస్‌లో అంతిమ మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్‌లో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది. రిషభ్ పంత్ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో కంగారూలను గడగడలాడించింది. తాజా విజయంతో ఆసీస్ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, బుమ్రా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్ టీంపై విజయాన్ని సాధించి ఔరా అనిపించింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది. (టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన)
నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు రోహిత్ శర్మ ఔట్ ద్వారా ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరవాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్ శుభమన్ గిల్‌తో ఇన్సింగ్స్‌కు బలమైన పునాదులు వేశారు. గిల్ 91 పరుగుల వద్ద ఔట్ అవ్వగా.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పుజారా సైతం బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రహానే 24 పరుగులతో వెంటనే పెవిలియన్ బాట పట్టినా.. యువ సంచలనం రిషభ్ పంత్ సూపర్భ్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. పంత్ 138 బంతుల్లో 89 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా కీలకమైన చివరి మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment