భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు.
రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 26న మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదలుకానుంది.
పంత్ అద్భుత ప్రదర్శన
ఆసీస్‌తో మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తం 9 క్యాచ్‌లు పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టుకున్న పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఐదుగురిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో పంత్ బ్యాట్‌తో సత్తా చాటలేకపోయిన వికెట్ల వెనుక చురుగ్గా కదిలాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోగా.. పంత్ ఐదుగురిని పెవిలియన్‌కు పంపడంలో భాగమయ్యాడు. పంత్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఐదు క్యాచ్‌లు పట్టాడు. పంత్ తన 41 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 143 క్యాచ్‌లు, ఓ రనౌట్, 15 స్టంపింగ్‌లు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment