
ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా సన్నాహకాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా భారత జట్టు ఇండియా-ఏ టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ప్రేక్షకులు లేకుండా జరుగతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ లభిస్తుంది. తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్ మైదానంలోని పాత పిచ్‌పై ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ పిచ్ బౌన్స్ మరియు సీమ్‌కు అనుకూలంగా ఉందని తెలుస్తుంది. పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత్ ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.
టచ్‌లోకి వచ్చిన విరాట్..
మ్యాచ్ విషయానికొస్తే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఇన్నింగ్స్‌ను చక్కగా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. విరాట్ చూడచక్కని కవర్ డ్రైవ్‌లతో అలరించాడని సమాచారం. అయితే విరాట్ ఓ రాంగ్ షాట్ ఆడి 15 పరుగుల వద్ద వికెట్ పారేసుకున్నట్లు తెలుస్తుంది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ నిష్క్రమించాడట.
Looks like Virat Kohli is done for the day. Was on 30 after batting for an hour. Started to get in rhythm after a shaky start.
Pant was bowled by the impressive Mukesh Kumar. Second time in the day he had been bowled— Tristan Lavalette (@trislavalette) November 15, 2024
తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔటైన విరాట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆడినట్లు తెలుస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ 30 పరుగులతో అజేయంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ పేసర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.
పంత్ మరోసారి క్లీన్ బౌల్డ్
ఈ మ్యాచ్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔటైనట్లు తెలుస్తుంది. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడట. పంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్లీన్ బౌల్డ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సారి అతను ముకేశ్ కూమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయినట్లు సమాచారం. మ్యాచ్‌కు సంబంధించిన ఈ విషయాలను ఓ జర్నలిస్ట్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.
ఇదిలా ఉంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ నాలుగు మ్యాచ్‌లైనా గెలవాల్సి ఉంది. ఈ సిరీస్‌కు ముందు భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కివీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది. స్వదేశంలోనే పేలవ ప్రదర్శన కనబర్చిన భారత్.. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment