
బ్రిస్బేన్: గబ్బా టెస్టులో టీమిండియా బౌలర్లు మరోమారు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోర్ 21/0తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కీలక ఆటగాళ్లను తొలి సెషన్‌లో పెవిలియన్‌కు పంపారు. డేవిడ్ వార్నర్ (48), మార్కస్ హేరిస్ (38), మార్నస్ లబుషేన్(25), మాథ్యూ వేడ్ (డకౌట్) వికెట్లను తీశారు.మహ్మద్ సిరాజ్ రెండు, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 149/4 తో ఉంది. క్రీజులో స్టీవెన్ స్మిత్(28), గ్రీన్(4) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 33 పరుగుల ఆధిక్యంతో ఓవరాల్‌గా ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 369 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 336 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. వారిద్దరూ ఏడో వికెట్‌కు అమూల్యమైన 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
(చదవండి: సుందరం శార్దూలం...)
Comments
Please login to add a commentAdd a comment