పాపం నటరాజన్‌కే ఎందుకిలా? | Tragedy Story T Natarajan After Tested Corona Positive Ahead SRH Vs DC | Sakshi
Sakshi News home page

T. Natarajan SRH: పాపం నటరాజన్‌కే ఎందుకిలా ?

Published Wed, Sep 22 2021 4:30 PM | Last Updated on Wed, Sep 22 2021 4:51 PM

Tragedy Story T Natarajan After Tested Corona Positive Ahead SRH Vs DC - Sakshi

Courtesy: IPL Twitter

T. Natarajn Tested Corona Positive.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ నట్టూ(టి. నటరాజన్‌)కు బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్నట్లుంది. కాకపోతే ఏంటి చెప్పండి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో గాయపడిన నటరాజన్‌ అప్పటి నుంచి మళ్లీ మైదానంలోకి దిగలేదు. ఆ తర్వాత భారత్‌లో జరిగిన ఐపీఎల్‌ 2021 తొలి అంచె పోటీల వరకు నటరాజన్‌ సిద్ధమైనట్లే కనిపించాడు. అందుకు అనుగుణంగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీశాడు. అంతే మళ్లీ మోకాలి గాయం తిరగబెట్టడంతో నట్టూ దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం​ తీవ్రత ఎక్కవుగా ఉందని తేలడంతో సర్జరీ అవసరం రావడంతో ఐపీఎల్‌ సీజన్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.

చదవండి: IPL 2021: ఐపీఎల్‌లో మళ్లీ కరోనా కలకలం.. నటరాజన్‌కు పాజిటివ్‌!

ఇంతలో కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడింది. ఇక సర్జీరీ అనంతరం కోలుకున్న నటరాజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి మొదలైన ఐపీఎల్‌ రెండో అంచె పోటీలకు సిద్ధమని.. ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే నట్టూను ఈసారి విధి మరోసారి వక్రీకరించింది. రెండో అంచె పోటీల్లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.  మ్యాచ్‌కు అంతా సిద్ధమనుకున్న దశలో​ నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. నటరాజన్‌కు కరోనా ఎక్కడి నుంచి సోకిందన్నది అంతుచిక్కడం లేదు. నటరాజన్‌తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురిని ఐసోలేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. వీరిలో విజయ్‌ శంకర్‌(ప్లేయర్‌), విజయ్‌ కుమార్‌(టీం మేనేజర్‌), శ్యామ్‌ సుందర్‌(ఫిజియోథెరపిస్ట్‌), అంజనా వన్నర్‌(డాక్టర్‌), తుషార్‌ ఖేద్కర్‌(లాజిస్టిక్స్‌ మేనేజర్‌), పెరియసామి గణేషన్‌(నెట్‌​ బౌలర్‌) ఉన్నారు.


Courtesy: IPL Twitter

ఇక నటరాజన్‌ కరోనా నుంచి కోలుకోవడానికి కనీసం 10 రోజలైనా పట్టే అవకాశం ఉంటుంది. కరోనా లక్షణాలు.. మేజర్‌ లేక మైల్డ్‌ అనే విషయం పక్కనపెడితే రూల్స్‌ ప్రకారం 15 రోజులు ఐసోలేషన్‌లో గడపాల్సిందే. ఈ లెక్కన చూసుకుంటే అక్టోబర్‌ 7 వరకు నటరాజన్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఒక వేళ అతను కోలుకున్నా బరిలోకి దిగే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి దారుణంగా ఉంది. తొలి అంచె పోటీల్లో ఏడు మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే సాధించి ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. రెండో అంచె పోటీల్లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రతీ మ్యాచ్‌ కీలకమే.   నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు కంగారుపడ్డారు.'' పాపం నట్టూకే ఇలా ఎందుకు జరుగుతుంది.. ఈసారి అతని యార్కర్‌లు చూస్తాం అనుకున్నాం.. కానీ అది జరగడం లేదు.. నట్టూకు బ్యాడ్‌టైమ్‌ నడుస్తుంది'' అని కామెంట్స్‌ చేశారు. 

చదవండి: IPL 2021: గాయాల బారిన ‘సన్‌రైజర్స్‌’


Courtesy: IPL Twitter

ఇక 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో నటరాజన్‌ అద్భుతంగా రాణించాడు. మొదట టీమిండియాకు నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్‌ ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఆ తర్వాత టి20, గబ్బా మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా నటరాజన్‌ ఆసీస్‌ పర్యటనలో 11 (వన్డేలు-2, టీ20-6, టెస్టు-3)  వికెట్లు తీసి మరుపురాని సిరీస్‌గా గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. 

చదవండి: నటరాజన్‌కు సర్జరీ.. బీసీసీఐ స్పందన


Courtesy: ESPN Cric.Info

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement