హార్దిక్ పాండ్యా, నటరాజన్, కోహ్లి(ఫొటో కర్టెసీ: సోషల్ మీడియా)
పుణె: చివరికంటా ఉత్కంఠ రేపిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిరీస్ విజేతను తేల్చిన ఆఖరి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో, కోహ్లి సేన 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, టీమిండియా కీలక సమయాల్లో పలు క్యాచ్‌లు జారవిడిచిన విషయం విదితమే. ఐదో ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్ పాండ్యా డ్రాప్ చేశాడు. లైఫ్ దొరికితే స్టోక్స్ ఎంత ప్రమాదకారిగా మారతాడో రెండో మ్యాచ్‌లో అందరూ చూశారు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ భారత్ చేజారింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో అతడి క్యాచ్‌ను మిస్ చేయగానే, ఎంత పెద్ద పొరపాటు చేశానన్నట్లుగా హార్దిక్ విస్మయం వ్యక్తం చేశాడు.
ఇక పదకొండో ఓవర్‌లో నటరాజన్ వేసిన బంతిని షాట్ ఆడిన స్టోక్స్, గాల్లోకి లేపగా మిడ్ వికెట్లో ఉన్న ధావన్ ఏమాత్రం తడబడకుండా ఒడిసిపట్టాడు. ఇక నోబాల్‌కు ఆస్కారం ఉందా అన్న విషయంపై థర్డ్ అంపైర్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో భారత శిబిరంలో ఆనందం విరిసింది. దీంతో హార్దిక్ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతేగాక, స్టోక్స్ క్యాచ్ పట్టినందుకు గబ్బర్‌కు రెండు చేతులు జోడించి దండం పెడుతూ, మోకాళ్ల మీద కూర్చుని ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి: IND vs ENG 3rd ODI: భారత్ తీన్‌మార్
ఆ నిర్ణయం చూసి షాక్‌కు గురైన విరాట్ కోహ్లి !
ఆ సిక్స్ దెబ్బకు.. బ్యాట్‌నే చెక్ చేశాడు!
#IndiavsEngland #INDvsENG #HardikPandya #natarajan ஹர்திக் பாண்டியா டூ நடராஜன்😂😜 pic.twitter.com/NSMF4H3wZA
— ஜெர்ரி🐀 (@Jerrykutty07) March 28, 2021
Comments
Please login to add a commentAdd a comment