
చెన్నై : శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్లోబల్ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. నటరాజన్ గత తొమ్మిది నెలలుగా గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయనకు మూత్రపిండాలు, కాలేయం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం నటరాజన్‌ను వెంటీలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీర అవయవాలు పూర్తిగా పాడవటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. నటరాజన్ ఆరోగ్య పరిస్థితిపై శశికళ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో నటరాజన్‌ను కలిసేందుకు శశికళ పేరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.